Sleep after Lunch: మధ్యాహ్న భోజనం చేశాక నిద్ర ఎందుకు వస్తుంది? ఎలాంటి ఆహారాలు తింటే నిద్ర వస్తుంది?
Sleep after Lunch: మీరు ఎంత చురుకుగా ఉన్నా భోజనం చేశాక మాత్రం నిద్ర ముంచుకువస్తుంది. మధ్యాహ్న భోజనం తిన్నాక ఎంతో మంది కునుకుపాట్లు పడుతూ ఉంటారు. ఇలా మధ్యాహ్న భోజనం తరువాత నిద్ర ఎందుకు వస్తుంది?
కొంతమందికి మధ్యాహ్న భోజనం చేశాక నిద్ర ముంచుకొస్తుంది. మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు లేకపోయినా కూడా వారికి ఆవలింతలు వస్తూనే ఉంటాయి. ఆఫీసులో ఉన్నా కూడా నిద్ర పోవాలన్న కోరిక పుడుతుంది. స్కూల్, కాలేజ్ స్టూడెంట్స్, ఆఫీసుల్లో పనిచేసే వాళ్లే కాదు ఇంట్లో ఉన్నవారు కూడా లంచ్ తిన్నాక నిద్ర రావడాన్ని గమనించే ఉంటారు. అంతవరకు యాక్టివ్ గా ఉన్నవారికి మధ్యాహ్న భోజనం తిన్నాక మాత్రం నిద్ర ఎందుకు వస్తుంది? దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. అలాగే మధ్యాహ్న భోజనంలో మీరు తిన్న కొన్ని ఆహారాల వల్ల కూడా నిద్ర వచ్చే అవకాశం ఉంది. కొన్ని రకాల ఆహారాలు శరీరంలో సెరోటోనిన్, మెలటోనిన్ స్థాయిలను పెంచుతాయి. ఈ హార్మోన్లు స్లీప్ హార్మోన్లు. వాటి ఉత్పత్తి పెరిగితే నిద్ర వచ్చేస్తుంది. మధ్యాహ్నం పూట ఎలాంటి ఆహారాలు తింటే నిద్ర వచ్చే అవకాశం ఉందో తెలుసుకోండి.
మధ్యాహ్న భోజనం చేశాక నిద్రమత్తుగా అనిపించడానికి మన శరీరంలో అన్నంలోని గ్లూకోజు రక్తంలో కలవడమే కారణం. ఇది శరీరానికి విశ్రాంతి మూడ్ ను అందిస్తుంది. శరీరంలో విడుదలైన మెలటోనిన్, సెరటోనిన్ వంటి హార్మోన్లు మత్తు భావనను అందిస్తాయి. అందుకే లంచ్ తిన్నాక నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది.
చపాతీ, పలావ్: మధ్యాహ్న భోజనానికి చపాతీ, అన్నం లేదా పలావ్ తినడం వల్ల శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ట్రిప్టోఫాన్ అనే హార్మోనును మెదడుకు పంపేందుకు సహాయపడుతుంది. ట్రిప్టోఫాన్ మెలటోనిన్ హార్మోనుగా మారుతుంది. ఇది నిద్రను ప్రేరేపిస్తుంది. బ్రెడ్, నూడుల్స్ కూడా నిద్రను ప్రేరేపిస్తాయి. ఆరోగ్యకరమైన ప్రోటీన్ గా చెప్పే పనీర్, వెజిటేబుల్ సలాడ్ కూడా శరీరంలో స్లీప్ హార్మోన్లను పెంచుతాయి. జీడిపప్పు, బాదం ఇవన్నీ మన నిద్రకు కారణమవుతాయి.
పాలు లేదా పెరుగు: మధ్యాహ్నం పాలు లేదా పెరుగు తీసుకోవడం వల్ల నిద్రకు వచ్చేస్తుంది. పాలలో ఉండే ట్రిప్టోఫాన్, కాల్షియం నిద్ర వచ్చేలా చేస్తాయి. పెరుగు లేదా మజ్జిగ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. ఇది నిద్రకు సహాయపడుతుంది. మధ్యాహ్న భోజనంలో మీరు చివరగా పెరుగన్నం తింటే కచ్చితంగా నిద్ర వచ్చేస్తుంది
తీపి పదార్థాలు
లంచ్‌లో తీపి పదార్థాలు తినడం వల్ల బ్లడ్ షుగర్ పెరుగుతుంది. ఇది శరీరాన్ని సాధారణ స్థితికి తీసుకువస్తుంది. నిద్ర వచ్చేలా చేస్తుంది. తులసి టీ తాగడం ద్వారా కూడా నిద్ర వచ్చేలా చేసుకోవచ్చు. దీని వల్ల మీరు మధ్యాహ్నం నిద్రపోవచ్చు.
తేనె: తేనె తాగడం వల్ల నిద్ర వస్తుంది. తేనెలోని గ్లూకోజ్ కంటెంట్ శరీరంలో ఒరెక్సిన్ అనే ఆమ్లం ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఇది మానసిక ఉత్తేజాన్ని తగ్గిస్తుంది. నిద్రను ప్రోత్సహిస్తుంది. మధ్యాహ్నం వేడి పాలు లేదా తేనెతో గ్రీన్ టీ తాగడం వల్ల మీకు తెలియకుండానే నిద్ర పడుతుంది. బ్రౌన్ రైస్, గోధుమ రొట్టెలలో కార్బోహైడ్రేట్లు, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది కండరాలను రిలాక్స్ చేయడానికి సహాయపడుతుంది. ఇది మధ్యాహ్నం తాగిన తర్వాత మీరు నిద్రపోవడానికి కారణమవుతుంది.
మాంసాహార వంటకాలు: చికెన్ లేదా పీతలు వంటి ప్రోటీన్ ఆహారాలు. నిద్ర హార్మోన్లను ఉత్తేజపరుస్తాయి. చెర్రీ జ్యూస్ వంటి పండ్ల రసాలు మెలటోనిన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఇది నిద్రను ప్రేరేపిస్తుంది. మధ్యాహ్నం చెర్రీ జ్యూస్ ను తాగడం వల్ల కూడా మీరు నిద్రపోవడానికి కారణం అవుతుంది.
భోజనం తర్వాత 10 నుండి 15 నిమిషాలు నడవడం ఆరోగ్యానికి మంచిది. ఆ తరువాత నిద్రపోవాలి. ఇలా చేస్తే జీర్ణ సమస్యలు రావు.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం
టాపిక్