TG Inter Exams Fee 2025 : తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు
తెలంగాణలోని ఇంటర్ విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు మరో అప్డేట్ ఇచ్చింది. రూ. 500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 31వ తేదీ వరకు ఫీజు చెల్లింపు గడువును పొడిగించింది.మరోవైపు వచ్చే ఏడాది మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి.
ఇంటర్మీడియట్ విద్యార్థులకు అధికారులుకు మరో అప్డేట్ ఇచ్చారు. ఫీజు చెల్లించుకోలేని విద్యార్థులకు మరో అవకాశం కల్పించారు. రూ. 500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 31వ తేదీ వరకు ఫీజు చెల్లించుకోవచ్చని ప్రకటన విడుదల చేశారు. నిజానికి ఈ గడువు డిసెంబర్ 17వ తేదీతోనే పూర్తి కాగా… తాజాగా డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగించారు. ఇక రూ.2 వేల ఆలస్య రుసుముతో జనవరి 2వరకు ఫీజులు చెల్లించవచ్చు.
ఇంటర్ ఫస్టియర్ జనరల్ రెగ్యులర్ కోర్సుల ఫీజును రూ.520గా నిర్ణయించారు. ఇంటర్ ఫస్టియర్ ఒకేషనల్ రెగ్యులర్ (థియరీ 520 + ప్రాక్టికల్స్ 230) కోర్సుల ఫీజు రూ.750గా ఉంది. ఇంటర్ సెకండియర్ జనరల్ ఆర్ట్స్ కోర్సుల ఫీజు రూ.520, సెకండియర్ జనరల్ సైన్స్ (థియరీ 520 + ప్రాక్టికల్స్ 230) కోర్సుల ఫీజు రూ.750గా ఉంది. సెకండియర్ ఒకేషనల్ (థియరీ 520 + ప్రాక్టికల్స్ 230) కోర్సుల ఫీజు రూ.750 చెల్లించాలి. వీటికి తోడు ఆలస్య రుసుం కూడా చెల్లించాల్సి ఉంటుంది.
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు…
మరోవైపు ఇంటర్ రెగ్యులర్, ఒకేషనల్ విద్యార్థులకు ఫిబ్రవరి 3, 2025 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 22, 2025తో పూర్తి అవుతాయి. రెండు సెషన్లలో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు… మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహిస్తారు. ఇక తుది పరీక్షల టైం టేబుల్ ను కూడా ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల షెడ్యూల్:
- మార్చి 5, 2025(బుధవారం)- సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
- మార్చి 7, 2025(శుక్రవారం)- ఇంగ్లీష్ పేపర్-1
- మార్చి 11, 2025(మంగళవారం) -మ్యాథ్స్ పేపర్-1ఏ, బోటనీ పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1
- మార్చి 13, 2025(గురువారం)-మ్యాథ్స్ పేపర్-1బి, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1
- మార్చి 17, 2025 (సోమవారం) -ఫిజిక్స్ పేపర్-1, ఎనకామిక్స్ పేపర్-1
- మార్చి 19, 2025(బుధవారం) -కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1
- మార్చి 21,2025(శుక్రవారం)-పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్య్ పేపర్-1(బైపీసీ విద్యార్థులకు)
- మార్చి 24, 2025(సోమవారం)-మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్ -1
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల షెడ్యూల్:
- మార్చి 6 , 2025(గురువారం)- సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2
- మార్చి 10, 2025(సోమవారం)- ఇంగ్లీష్ పేపర్-2
- మార్చి 12, 2025(బుధవారం) -మ్యాథ్స్ పేపర్-2ఏ, బోటనీ పేపర్-2, పొలిటికల్ సైన్స్ పేపర్-2
- మార్చి 15, 2025(శనివారం)-మ్యాథ్స్ పేపర్-2బి, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2
- మార్చి 18, 2025 (మంగళవారం) -ఫిజిక్స్ పేపర్-2, ఎనకామిక్స్ పేపర్-2
- మార్చి 20, 2025(గురువారం) -కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2
- మార్చి 22,2025(శనివారం)-పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్య్ పేపర్-2(బైపీసీ విద్యార్థులకు)
- మార్చి 25, 2025(మంగళవారం)-మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జాగ్రఫీ పేపర్ -2.
సంబంధిత కథనం