తెలుగు న్యూస్ / ఫోటో /
Vande Bharat Express : హైదరాబాద్ - బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం... టికెట్ ధరలివే
- Bengaluru-Hyderabad Vande Bharat Train: హైదరాబాద్- బెంగళూర్ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభమైంది. ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. సోమవారం నుంచి సాధారణ ప్రయాణికులకు ఈ ట్రైన్ అందుబాటులో ఉండనుంది. టికెట్ల బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.
- Bengaluru-Hyderabad Vande Bharat Train: హైదరాబాద్- బెంగళూర్ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభమైంది. ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. సోమవారం నుంచి సాధారణ ప్రయాణికులకు ఈ ట్రైన్ అందుబాటులో ఉండనుంది. టికెట్ల బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.
(1 / 6)
ఇప్పటికే తెలంగాణ నుంచి రెండు వందే భారత్ ఎక్స్ ప్రెస్ లు నడుస్తుండగా… తాజాగా ప్రారంభించిన దానితో కలిపి మూడో ఎక్స్ ప్రెస్ అవుతుంది. కాచిగూడ స్టేషన్లో జరిగిన కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఇవాళ దేశవ్యాప్తంగా మొత్తం 9 వందే భారత్ ఎక్స్ ప్రెస్ లను వర్చువల్ గా ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.(Twitter)
(2 / 6)
ప్రతిరోజూ (బుధవారం మినహా) కాచిగూడ నుంచి ఉదయం 5.30 గంటలకు రైలు బయలుదేరుతుంది. మహబూబ్‌నగర్ (6.59), కర్నూల్ సిటీ (8.39), అనంతపూర్ (10.54) స్టేషన్లలో ఆగుతూ యశ్వంత్‌పూర్ (మధ్యాహ్నం 2.15) చేరుకుంటుంది. మధ్యాహ్నం 3గంటలకు యశ్వంత్‌పూర్‌నుంచి బయలుదేరి, అనంతపూర్ - 5.40, కర్నూల్ సిటీ 7.50, మహబూబ్‌నగర్ 21.39 స్టేషన్లలో ఆగుతూ.. రాత్రి 11.15 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.
(3 / 6)
ఆదివారం ఒక్కరోజు మాత్రం.. మధ్యాహ్నం 12.30కి కాచిగూడ నుంచి బయలుదేరి ఫలక్‌నుమా, ఉందానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్,దేవరకద్ర, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, పెండేకల్లు జంక్షన్, గుత్తి, కల్లూరు, అనంతపూర్, ధర్మవరం జంక్షన్, పెనుగొండ, రంగేపల్లి, హిందూపూర్, తొండెబావి, యలహంక జంక్షన్, లొట్టేగొల్లహల్లి మీదుగా యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది.
(4 / 6)
ఈ ఎక్స్ ప్రెస్ మొత్తం 12 జిల్లాల గుండా వెళ్తుంది. తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, నంద్యాల్, అనంతపూర్, శ్రీ సత్యసాయి జిల్లాలు ఉండగా, కర్ణాటకలో చూస్తే చిక్‌బళ్లాపూర్, బెంగళూరు రూరల్ జిల్లాలు ఉన్నాయి.
(5 / 6)
ఈ ఎక్స్ ప్రెస్ సగటు వేగం గంటకు 71.74 కిలోమీటర్లు. గతంలో ఈ దూరం ప్రయాణించేందుకు పట్టే సమయం 11.20 గంటలు.. వందేభారత్ రైలుతో 8.30 గంటల్లో ప్రయాణించవచ్చు. ఈ మార్గంలో వచ్చే 4 ప్రధాన స్టేషన్లు కాచిగూడ (హైదరాబాద్), కర్నూల్, అనంతపూర్, యశ్వంత్‌పూర్ (బెంగళూరు).దేశ ఐటీ రాజధాని, స్టార్టప్ రాజధానిని ఈ రైలు అనుసంధానం చేస్తుంది.
(6 / 6)
కాచిగూడ నుంచి యశ్వంతపూర్ స్టేషన్‌కు ఎకానమీ చైర్ కార్‌లో క్యాటరింగ్ రుసుముతో కలుపుకొని రూ.1,600 ధరగా నిర్ణయించారు. క్యాటరింగ్ చార్జి లేకుండా సాధారణ ప్రయాణానికి రూ.1,255, ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్ కోచ్‌లో ప్రయాణానికి క్యాటరింగ్ చార్జీతో కలుపుకొని రూ. 2,915గా, కేటరింగ్ చార్జీ లేకుండా 2,515గా నిర్ధారించారు. యశ్వంతపూర్ నుంచి కాచిగూడ (నం.20704)కు ఈ ధరల్లో స్వల్ప తేడా ఉంది. ఎకానమీ చైర్ కార్‌లో కేటరింగ్ చార్జీలతో కలిపి రూ.1,540, కేటరింగ్ చార్జీ లేకుండా రూ.1,255, ఎగ్జిక్యూటివ్ చైర్‌కార్ కోచ్‌లో కేటరింగ్ చార్జీతో కలిపి రూ.2,865, కేటరింగ్ చార్జీ లేకుండా రూ.2,515గా నిర్ణయించారు.
ఇతర గ్యాలరీలు