TS DC Project: డిస్ట్రిక్ట్ కూలింగ్ ప్రాజెక్ట్ కోసం తబ్రీద్‌తో తెలంగాణ ఒప్పందం
TS DC Project: ఆసియాలోనే అతిపెద్ద డిస్ట్రిక్ట్ కూలింగ్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయటం కోసం తబ్రీద్‌తో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యం కుదర్చుకుంది. హైదరాబాద్ ఫార్మా సిటీ కోసం 125,000 శీతలీకరణ టన్నుల శీతలీకరణ సదుపాయాలను అభివృద్ధి చేస్తారు.
TS DC Project: ఆసియాలోనే అతిపెద్ద డిస్ట్రిక్ట్ కూలింగ్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయటం కోసం తబ్రీద్‌తో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యం కుదర్చుకుంది. హైదరాబాద్ ఫార్మా సిటీ కోసం 125,000 శీతలీకరణ టన్నుల శీతలీకరణ సదుపాయాలను అభివృద్ధి చేయడానికి మరియు 24 మిలియన్ టన్నుల CO2 కర్బన ఉద్గారాలు వాతావరణంలో విడుదల కాకుండా అడ్డుకోవడానికి 200 మిలియన్ల డాలర్ల పెట్టుబడులను తబ్రీద్ సంస్థ వెచ్చించనుంది.
విస్తృత శ్రేణి భాగస్వామ్య ప్రాజెక్టు ద్వారా ఆసియాలో పని చేయటానికి మరియు నివసించడానికి ఉత్తమ నగరాల్లో ఒకటిగా హైదరాబాద్‌ను నిల బెట్టనుంది. పారిశ్రామిక, వాణిజ్య పార్కుల కోసం అత్యుత్తమ శ్రేణి శీతలీకరణ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి, భారతదేశంలోని శీతలీకరణ పరిస్థితులకు పునరాకృతినిచ్చేందుకు, కూలింగ్ యుటిలిటీస్ లో గ్లోబల్ లీడర్ అయిన తబ్రీద్‌తో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యం చేసుకుంది.
హైదరాబాద్ ఫార్మా సిటీ (HPC) కోసం ఆసియాలో అతిపెద్ద డిస్ట్రిక్ట్ కూలింగ్ పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ పద్ధతిలో ఏర్పాటు చేస్తున్నారు. 1,25,000 RT సామర్ధ్యంతో డిస్ట్రిక్ట్ కూలింగ్ ప్లాంట్లు మరియు నెట్‌వర్క్‌లను అభివృద్ధి చేయనున్నారు. పారిశ్రామిక యూనిట్ల ప్రక్రియతో పాటు శీతలీకరణ, నిల్వ అవసరాల కోసం దీర్ఘకాల శీతలీకరణ సేవలు అందించడానికి $200 మిలియన్ల డాలర్ల వరకు సంస్థ పెట్టుబడి పెట్టనుంది.
తెలంగాణలో మొదటి సారిగా అందుబాటులోకి వచ్చిన ఈ కార్యక్రమం బహుళ ప్రయోజనాలను అందిస్తుంది. ఫలితంగా 6,800 GWh విద్యుత్ ఆదాతో పాటు 41,600 మెగా లీటర్ల నీటి పొదుపు, ప్రాజెక్ట్ జీవితకాలంలో 6.2 మిలియన్ టన్నుల CO2ను ఆదా చేయొచ్చు. గ్రీన్‌హౌస్ ఉద్గారాలను తగ్గించడానికి మార్గం సుగమం చేస్తుంది. ఈ ప్రయత్నం ఔషధ పరిశ్రమ యొక్క శీతలీకరణ ప్రక్రియలను విప్లవాత్మకంగా మార్చడానికి నిర్దేశించారు. బల్క్ డ్రగ్ తయారీ సౌకర్యాల కోసం స్వచ్ఛమైన వాతావరణానికి దోహదం చేస్తుంది.
వాణిజ్య జిల్లాలైన సైబరాబాద్ మరియు ఇతర మిశ్రమ వినియోగ అభివృద్ధి ప్రాంతాలలో శీతలీకరణ మౌలిక సదుపాయాలను అన్వేషించడానికి తెలంగాణ ప్రభుత్వం తబ్రీద్‌తో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది, దీని ఫలితంగా 200 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్‌ను తగ్గించే అవకాశం ఉంది, ఫలితంగా 30 సంవత్సరాల కాలంలో 18 మిలియన్ టన్నులు CO2 తగ్గుతుంది. ఈ ఫలితంగా హీట్ ఐలాండ్ ప్రభావాన్ని తగ్గించడం ద్వారా ఆసియాలో నివసించడానికి మరియు పని చేయడానికి అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా హైదరాబాద్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
సుస్థిర భవిష్యత్తు వైపు ప్రయాణాన్ని ప్రారంభించిన వేళ, తబ్రీద్‌తో భాగస్వామ్యం చేయడం మాకు ఆనందంగా ఉందని మంత్రి కేటీఆర్ చెప్పారు. పర్యావరణ నిర్వహణ పట్ల తెలంగాణ ప్రభుత్వ నిబద్ధతకు ఇది ఉదాహరణగా నిలుస్తుందని చెప్పారు. కూల్ రూఫ్ పాలసీలతో పాటు ఎనర్జీ-ఎఫిషియెంట్ డిస్ట్రిక్ట్ కూలింగ్ ద్వారా శీతలీకరణకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా అధిక ప్రయోజనాలు ఉంటాయన్నారు.
ప్రపంచంలోని అతిపెద్ద నెట్ జీరో ఫార్మాస్యూటికల్ క్లస్టర్‌కు డిస్ట్రిక్ట్ శీతలీకరణలో తబ్రీద్ నైపుణ్యాన్ని తీసుకురావడం ద్వారా, పారిశ్రామిక క్లస్టర్ల భవిష్యత్తును రూపొందించడమే కాకుండా, పర్యావరణ బాధ్యతకు శక్తివంతమైన ఉదాహరణగా నిలుస్తుందని తబ్రీద్ ఛైర్మన్ ఖలీద్ అబ్దుల్లా అల్ ఖుబైసీ చెప్పారు.
.