Bengaluru Bandh : నేడు బెంగళూరు బంద్​.. తెరపైకి మళ్లీ ఆ వివాదం..!-bengaluru bandh today 26 september section 144 to be imposed schools shut ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bengaluru Bandh : నేడు బెంగళూరు బంద్​.. తెరపైకి మళ్లీ ఆ వివాదం..!

Bengaluru Bandh : నేడు బెంగళూరు బంద్​.. తెరపైకి మళ్లీ ఆ వివాదం..!

Sharath Chitturi HT Telugu
Sep 26, 2023 06:07 AM IST

Bengaluru Bandh : నేడు బెంగళూరు బంద్​కు పిలుపునిచ్చాయి అనేక రైతు బృందాలు. వీటికి విపక్షాలు మద్దతిచ్చాయి. బంద్​ వెనుక ఉన్న అసలు కారణం ఏంటంటే..

నేడు బెంగళూరు బంద్​.. తెరపైకి మళ్లీ ఆ వివాదం..!
నేడు బెంగళూరు బంద్​.. తెరపైకి మళ్లీ ఆ వివాదం..! (Savitha)

Bengaluru Bandh : కర్ణాటకలో దశాబ్దాల నాటి కావేరీ జలాల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. కర్ణాటక నుంచి తమిళనాడుకు కావేరీ నది నీటిని విడుదల చేస్తుండటాన్ని నిరసిస్తూ.. నేడు బెంగళూరు బంద్​కు పిలుపినిచ్చాయి అనేక రైతు బృందాలు. ప్రతిపక్షాలు ఈ బంద్​కు మద్దతినిచ్చాయి. ఈ నేపథ్యంలో ఐటీ హబ్​గా పేరొంది, నిత్యం హడావుడిగా కనిపించే బెంగళూరు మహా నగరంలో.. మంగళవారం పూర్తిస్థాయి షట్​డౌన్​ కనిపించే అవకాశం ఉంది.

స్కూళ్లు, కాలేజీలకు సెలవు..

బెంగళూరు బంద్​ నేపథ్యంలో ఎలాంటి అవాంఛీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. నగరంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవును ప్రకటించారు బెంగళూరు అర్బన్​ డిస్ట్రిక్ట్​ కలెక్టర్​ కేఏ దయానంద్​. స్కూళ్లు మూతపడినా.. కొన్ని ప్రైవేట్​ విద్యాసంస్థలు.. ఆన్​లైన్​ క్లాసెస్​ ఏర్పాటు చేసుకున్నాయి. మరోవైపు నగరంలోని అనేక ప్రాంతాల్లో సెక్షన్​ 144ని విధిస్తున్నట్టు బెంగళూరు డీసీపీ ప్రకటించారు. ఐదుగురికి మించి ప్రజలు ఒకచోట గుమిగూడవద్దని ఆదేశాలిచ్చారు.

Bengaluru Bandh 26 September : బెంగళూరు బంద్​పై కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. నిరసనలకు తాము మద్దతు ఇవ్వడం లేదని, కానీ బంద్​ వెనుక ఉన్న కారణాల తీవ్రతను తాము అర్థం చేసుకోగలమని పేర్కొంది. కావేరీ జలాల వివాదం తీవ్రత మాకు కూడా తెలుసని స్పష్టం చేసింది.

బంద్​ నేపథ్యంలో గూగుల్​, వాల్​మార్ట్​, ఐబీఎం, యాక్సెంచర్​ వంటి దిగ్గజ ఐటీ సంస్థలు.. తమ ఉద్యోగులకు వర్క్​ ఫ్రం హోం వెసులుబాటును కల్పించాయి. మంగళవారం నాడు అనవసరమైన ప్రయాణాలు చేయవద్దని సూచించినట్టు తెలుస్తోంది. దేశ ఐటీ హబ్​గా పేరొందిన బెంగళూరులో దాదాపు 4వేల మంది ఐటీ ఉద్యోగులు నివాసముంటున్నారు.

Cauvery water dispute : అయితే నగరంలో క్యాబ్​ సేవలు యథావిథంగా కొనసాగనున్నాయి. ఓలా, ఊబెర్​, ప్రభుత్వ బస్సులు మంగళవారం నడుస్తాయి. కాగా.. బెంగళూరులో రెస్టారెంట్లు మూతపడి ఉంటాయి.

ఫ్రీడం పార్క్​, రాజ్​ భవన్​, టౌన్​హాల్​ వంటి ప్రాంతాల్లో నిరసనలు చేపట్టేందుకు ఆందోళనకారులు సన్నద్ధమవుతున్నారు. ఆయా ప్రాంతాల్లో అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.

'బెంగళూరు బంద్​కు పూర్తి మద్దతు..'

బెంగళూరు బంద్​కు పూర్తి మద్దతిస్తున్నట్టు ప్రకటించింది బీజేపీ.

"బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్​ యడియూరప్ప.. ఈ బంద్​కు మద్దతిచ్చారు. మేము కూడా మద్దతిస్తున్నాము. మేము కూడా నిరసనల్లో పాల్గొంటాము," అని బీజేపీ నేత సీటీ రవి మీడియాకు తెలిపారు.

Cauvery bandh in Bengaluru : తమిళనాడు- కర్ణాటక మధ్య నెలకొన్న కావేరీ జలాల వివాదంపై జేడీఎస్​ ఎంపీ దేవెగౌడ స్పందించారు.

"కావేరీ జలాల విషయంపై నేను ప్రధాని మోదీకి లేఖ రాశాను. జల్​ శక్తి విభాగం.. రివ్యూ పిటిషన్​ దాఖలు చేయాలని, జలాల విషయంలో నిపుణుల కమిటీని కర్ణాటకకు పంపించాలని విజ్ఞప్తి చేశాను," అని అన్నారు. బీజేపీతో జేడీఎస్​ ఇటీవలే పొత్తు కుదుర్చుకున్న విషయం తెలిసిందే.

సంబంధిత కథనం