BJP JDS alliance : కర్ణాటకలో బీజేపీ- జేడీఎస్​ 'పొత్తు' ప్రభావం ఎంత?-how will bjp jds alliance impact karnataka in 2024 lok sabha elections ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bjp Jds Alliance : కర్ణాటకలో బీజేపీ- జేడీఎస్​ 'పొత్తు' ప్రభావం ఎంత?

BJP JDS alliance : కర్ణాటకలో బీజేపీ- జేడీఎస్​ 'పొత్తు' ప్రభావం ఎంత?

Sharath Chitturi HT Telugu
Sep 23, 2023 11:11 AM IST

BJP JDS alliance : బీజేపీ జేడీఎస్​ పొత్తు ఫిక్స్​ అయ్యింది. సీట్ల పంపకాలే తరువాయి! అంతా బాగుంది కానీ.. ఈ పొత్తుకు లోక్​సభ ఎన్నికల్లో విజయం వరిస్తుందా?

కర్ణాటకలో బీజేపీ- జేడీఎస్​ 'పొత్తు' ప్రభావం ఎంత?
కర్ణాటకలో బీజేపీ- జేడీఎస్​ 'పొత్తు' ప్రభావం ఎంత?

BJP JDS alliance : 2024 సార్వత్రిక సమరానికి ప్రాంతీయ, జాతీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో “పొత్తులు- విభేదాలు ” తెరపైకి వస్తున్నాయి. ఇక కర్ణాటక విషయానికొస్తే.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చూసిన జేడీఎస్​.. బీజేపీతో పొత్తుకు సిద్ధమైంది. ఇదే విషయంపై.. ఆ పార్టీ నేత, మాజీ సీఎం హెచ్​డీ కుమారస్వామి.. దిల్లీకి వెళ్లి అమిత్​ షాను కలిశారు. సీట్ల పంపకం విషయంపై చర్చించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు బీజేపీ- జేడీఎస్​ పొత్తుతో ఎవరికి లాభం? ఈ పొత్తు ఫలితాల్ని ఇస్తుందా?.. రాజకీయ నిపుణుల మాట ఏంటంటే..

ఉనికిని చాటుకోవడం కోసమేనా?

కర్ణాటకలో లింగాయత్​లు, వొక్కలిగళ జనాభా అధికం. వీరిని ప్రసన్నం చేసుకున్న పార్టీలకు అధికారం దక్కే అవకాశం ఎక్కువ అని ఓ నమ్మకం కూడా ఉంది. అయితే బీజేపీ, జేడీఎస్​లు.. రెండింటికీ వీరి మద్దతు ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇది స్పష్టంగా కనిపించింది. ఈ రెండు వర్గాలకు చెందిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ కన్నా బీజేపీ, జేడీఎస్​ల అభ్యర్థులు ముందు నిలబడ్డారు. కానీ.. కురుబాలు, ముస్లింలు, దళితులు, ఎస్​టీల మద్దతుతో కాంగ్రెస్​ ఈసారి విజయం సాధించగలిగింది.

జేడీఎస్​ పార్టీ ప్రభావం దక్షిణ కర్ణాటక ప్రాంతంపైనే ఎక్కువగా ఉంటూ వచ్చింది. కాంగ్రెస్​తో ఈ పార్టీకి ఇక్కడ దశాబ్దాలుగా వైరం నడుస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల వరకు ఇక్కడ కమలదళం ప్రభావం దాదాపుగా శూన్యమే! అయితే.. 2019 లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​- జేడీఎస్​లు పొత్తు ఏర్పరచుకుని పోటీ చేశాయి. కానీ ఈ పొత్తు ఫలించలేదు. 28 లోక్​సభ సీట్లల్లో 25 స్థానాల్లో బీజేపీ గెలిచింది.

2024 Lok Sabha elections : కానీ 2023 అసెంబ్లీ ఎన్నికలు.. జేడీఎస్​కు అస్సలు కలిసి రాలేదు! ఈ పార్టీ ఓటు బ్యాంక్​ రెండుగా చీలిపోయింది. కాంగ్రెస్​- బీజేపీలు జేడీఎస్​ ఓట్లను పంచుకున్నాయి. ఫలితంగా.. జేడీఎస్​ బలహీనపడిందని వార్తలు వచ్చాయి. కంచుకోటల్లాగా కనిపించిన సీట్లు కూడా జేడీఎస్​ నుంచి జారిపోయాయి.

ఈ పరిణామాల మధ్య ఇప్పుడు బీజేపీతో జేడీఎస్​ జతకడుతుండటం సర్వత్రా చర్చకు దారితీసింది. పార్టీ ఉనికి కోల్పోకుండా ఉండేందుకే జాతీయ పార్టీతో పొత్తుకు జేడీఎస్​ వెంపర్లాడుతోందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఓట్లు పడతాయా..?

JDS BJP alliance : 224 అసెంబ్లీ సీట్లను 2023 మేలో జరిగిన ఎన్నికలను ఇక్కడ ప్రస్తావించాలి. ఈ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్​లు సాధించిన ఓటు షేరు.. కాంగ్రెస్​ కన్నా ఎక్కువే. కానీ 'పొత్తు'పై కర్ణాటకవాసుల్లో భిన్న అభిప్రాయాలు ఉంటూనే ఉంటాయి. 2019 లోక్​సభ ఎన్నికలే ఇందుకు నిదర్శనం.

పైగా.. అసెంబ్లీ ఎన్నికలో సాధించిన విజయంతో కాంగ్రెస్​ చాలా శక్తివంతంగా మారింది. లోక్​సభలోనూ విజయాన్ని రిపీట్​ చేయాలని బలంగా ప్రణాళికలు రచిస్తోంది.

ఎన్నికలకు ముందు, తర్వాత.. పార్టీలు పొత్తులను ఏర్పరచుకోవడం, మార్చుకోవడం కొత్త విషయమేమీ కాదు. మరి ఈసారి.. బీజేపీ-జేడీఎస్​ పొత్తు ఎన్నేళ్లు కొనసాగుతోందో చూడాలి. ఈ పార్టీల కలయిక.. కర్ణాటకవాసులకు నచ్చుతుందా? పొత్తుకు ఓట్లు పడతాయా? అన్న ప్రశ్నలకు సమాధానం కోసం లోక్​సభ సమరం వరకు వేచి చూడాల్సిందే..

Whats_app_banner

సంబంధిత కథనం