తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Kejriwal Bail: ‘‘జైలులో కేజ్రీవాల్ కావాలనే మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు’’ : ఈడీ

Kejriwal bail: ‘‘జైలులో కేజ్రీవాల్ కావాలనే మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు’’ : ఈడీ

HT Telugu Desk HT Telugu

18 April 2024, 15:44 IST

  • Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్ పెరగడానికి జైళ్లో కావాలనే మామిడి పళ్లు, స్వీట్లు తింటున్నారని ఈడీ ఆరోపించింది. తన షుగర్ లెవల్స్ ను నిరంతరం పర్యవేక్షించాలని, తన వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతించాలని కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై ఢిల్లీ కోర్టు గురువారం విచారణ జరిపింది.

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (HT_PRINT)

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుకునేందుకు ఉద్దేశపూర్వకంగా మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారని, చక్కెర కలిపిన టీ తాగుతున్నారని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపించింది. తన షుగర్ లెవల్స్ ను నిరంతరం పర్యవేక్షించాలని, తన వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతించాలని కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ కోర్టు గురువారం విచారించింది. కేజ్రీవాల్ బ్లడ్ షుగర్ లెవల్స్ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని, ఆయన రెగ్యులర్ గా డాక్టర్ ను సంప్రదించాల్సిన అవసరం ఉందని కోర్టుకు సమర్పించిన పిటిషన్ లో పేర్కొన్నారు. వారానికి మూడు సార్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యులను సంప్రదించే అవకాశం ఇవ్వాలని కేజ్రీవాల్ కోర్టును కోరారు.

ట్రెండింగ్ వార్తలు

Fact Check : 'ల్యాబ్​లో పిల్లలను నచ్చినట్టు తయారు చేసుకోవచ్చు' అంటున్న ఈ వైరల్​ వీడియోలో నిజమెంత?

Sushil Modi death : బీజేపీ సీనియర్​ నేత సుశీల్ కుమార్​​ మోదీ కన్నుమూత..

Viral : ఆటగాడివే! ఒకేసారి ఇద్దరు గర్ల్​ఫ్రెండ్స్​.. దొరికిపోయి- చివరికి..

Southwest Monsoon 2024: గుడ్​ న్యూస్​.. ఇంకొన్ని రోజుల్లో దేశాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు!

డయాబెటిస్ ఉన్నా మామిడిపళ్లు తింటున్నారు..

'డయాబెటిస్ ఎక్కువగా ఉందని చెబుతున్న వ్యక్తి.. రోజూ మామిడి పండ్లు తినడం, స్వీట్లు తినడం, పంచదారతో టీ తాగడం.. చేస్తున్నారని కేజ్రీవాల్ పిటిషన్ ను వ్యతిరేకిస్తూ ఈడీ కోర్టుకు తెలిపింది. బెయిల్ పొందడానికే ఆయన ఇవన్నీ చేస్తున్నారని ఈడీ తరఫున వాదిస్తున్న స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జోహబ్ హుస్సేన్ ఆరోపించారు. రక్తంలో చక్కెర స్థాయిల్లో హెచ్చుతగ్గులను కారణంగా చూపి బెయిల్ పొందడానికి కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారని హుస్సేన్ కోర్టులో వాదించారు.

మీడియాలో రావడం కోసమే..

ఈడీ వాదనను కేజ్రీవాల్ తరఫు న్యాయవాది వివేక్ జైన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మీడియాలో ప్రముఖంగా రావడం కోసమే ఈడీ తరఫు న్యాయవాది ఇలాంటి అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అయితే, కేజ్రీవాల్ ఈ దరఖాస్తును ఉపసంహరించుకుంటున్నారని, మెరుగైన పిటిషన్ ను దాఖలు చేస్తామని జైన్ కోర్టుకు తెలిపారు.

డైట్ పై నివేదిక

దాంతో, కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. అంతకుముందు, కేజ్రీవాల్ జైలులో తీసుకుంటున్న డైట్ పై జైలు అధికారుల నుంచి మెడికల్ రిపోర్టు కోరింది. గుజరాత్ లో ఆప్ స్టార్ క్యాంపెయినర్లలో అరవింద్ కేజ్రీవాల్, ఆయన సతీమణి సునీత కూడా ఉన్నారు.ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ట్రయల్ కోర్టు అతని జ్యుడీషియల్ కస్టడీని 2024 ఏప్రిల్ 23 వరకు పొడిగించింది. ఇదే కేసులో తెలంగాణ భారాస నేత, ఎమ్మెల్సీ కవిత కూడా జైళ్లో ఉన్న విషయం తెలిసిందే.

ప్రజా ప్రయోజన వ్యాజ్యం

ఎక్సైజ్ పాలసీ కేసులో తనను ఈడీ అరెస్టు చేయడం, ఆ తర్వాత రిమాండ్ విధించడాన్ని సవాలు చేస్తూ తాను దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేయడంపై కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా, ఆప్ నేత సంజయ్ సింగ్ దిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎమ్మెల్యేలు, కేబినెట్ మంత్రులతో కేజ్రీవాల్ సమావేశాలు నిర్వహించేందుకు అనుమతించాలని జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ ను ఆదేశించాలని కోరుతూ సంజయ్ సింగ్ ఢిల్లీ హైకోర్టులో ఈ పిల్ దాఖలు చేశారు.

తదుపరి వ్యాసం