MLC Kavitha Remand : కవిత ఈడీ కస్టడీ గడువును పొడిగించిన కోర్టు-delhi court extends ed remand of brs leader k kavitha by 3 days ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mlc Kavitha Remand : కవిత ఈడీ కస్టడీ గడువును పొడిగించిన కోర్టు

MLC Kavitha Remand : కవిత ఈడీ కస్టడీ గడువును పొడిగించిన కోర్టు

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 23, 2024 01:29 PM IST

BRS leader K Kavitha Arrest Updates: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవిత రిమాండ్ ను మరో 3 రోజులు పొడిగించి రౌస్ అవెన్యూ కోర్టు.

రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత
రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత (ANI)

MLC Kavitha Remand : ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్(BRS leader K Kavitha) అయిన సంగతి తెలిసిందే. ఇవాళ్టితో ఈడీ(ED) కస్టడీ పూర్తి కాగా….మధ్యాహ్నం కోర్టులో ప్రవేశపెట్టింది ఈడీ. మరో ఐదు రోజులపాటు కస్డడీ గడువు పొడిగించాలని ఈడీ కోరగా…. రౌస్ అవెన్యూ కోర్టు(Rouse Avenue Courts) మరో మూడు రోజులు పొడిగించింది. ఫలితంగా మరో మూడు రోజులపాటు కవితను ఈడీ ప్రశ్నించనుంది. తిరిగి మార్చి 26వ తేదీన ఉదయం 11 గంటలకు కవితను కోర్టులో హాజరుపర్చనున్నారు.

న్యాయపోరాటం చేస్తాం - ఎమ్మెల్సీ కవిత

కోర్టులోకి వెళ్ల సమయంలో ఎమ్మెల్సీ కవిత  (MLC Kavitha)మాట్లాడారు. గతంలో  అడిగిన వివరాలనే మళ్లీ మళ్లీ అడుగుతున్నారని అన్నారు. పూర్తిగా తప్పుడు కేసును బనాయించారని… కొత్తగా అడిగింది ఏం లేదన్నారు. తన అరెస్ట్ పై న్యాయపోరాటం చేస్తామనని చెప్పారు.

హైదరాబాద్ లో ఈడీ సోదాలు…

మరోవైపు ఇవాళ (శనివారం) ఉదయం 06 గంటల తర్వాత ఏడు మందితో కూడి ఈడీ(ED) అధికారుల బృందం హైదరాబాద్ లోని మాదాపూర్ లో సోదాలు చేపట్టింది. ఇక్కడ ఉన్న ఓ అపార్ట్ మెంట్ లో ఉంటున్న కవిత ఆడపడుచు అఖిల నివాసంలో ఈ తనిఖీలు జరుగుతున్నట్లు తెలిసింది. అయితే కవిత కస్టడీలో(MLC Kavitha Arrest) ఉండగానే... బంధువుల ఇళ్లల్లో సోదాలు జరపటం చర్చనీయాంశంగా మారింది. కవిత ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఈ సోదాలు జరుగుతున్నాయా...? లేక మరేదైనా కోణంలో తనిఖీలు చేపట్టారా అన్నది తేలాల్సి ఉంది.

ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో(Delhi Liquor Scam) అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ (MLC Kavitha) ఊరట దక్కలేదు. ఈడీ అరెస్ట్ ను సవాల్ చేస్తూ… సుప్రీంకోర్టులో(Supreme Court) పిటిషన్ వేయగా… దీనిపై శుక్రవారం న్యాయస్థానం విచారించింది. ప్రస్తుత సమయంలో తాము బెయిల్ ఇవ్వలేమని… కింది కోర్టునే ఆశ్రయించాలని సూచించింది. ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించిన కోర్టు… ఈ పిటిషన్ పై త్వరితగతిన విచారణ జరపాలని కింది కోర్టుకు సూచించింది.సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎంఎం సుందరేష్, బేలా ఎం. త్రివేది కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వలను జారీ చేసింది. బెయిల్ అభ్యర్థనను విచారించే మొదటి న్యాయస్థానం ట్రయల్ కోర్ట్ అని నొక్కిచెప్పింది. దీంతో రౌస్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.

బెయిల్ పిటిషన్ దాఖలు….

సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో(Rouse Avenue Courts) కవిత తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ ను దాఖలు చేశారు. దీనిపై కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది ఉత్కంఠగా మారింది. ఇక్కడ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తే… మళ్లీ సుప్రీంను కవిత ఆశ్రయించే అవకాశం ఉంది.

 

Whats_app_banner