Amarnath Yatra 2024 : జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర- పూర్తి వివరాలు..
14 April 2024, 17:21 IST
Amarnath Yatra 2024 registration : అమర్నాథ్ యాత్ర 2024పై కీలక అప్డేట్ ఇచ్చింది.. శ్రీ అమర్నాథ్జీ ఆలయ బోర్డు. యాత్ర ప్రారంభం- ముగింపు తేదీలతో సహా అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియపై వివరాలను వెల్లడించింది.
జూన్ 29న అమర్నాథ్ యాత్ర ప్రారంభం..
Amarnath Yatra 2024 registration date : పవిత్ర అమర్నాథ్ యాత్రకు సంబంధించిన కీలక్ అప్డేట్! ఈ ఏడాది జూన్ 29న.. అమర్నాథ్ యాత్ర ప్రారంభమవుతుంది. దాదాపు రెండు నెలల తర్వాత.. ఆగస్ట్ 19తో ఈ పవిత్ర యాత్ర ముగుస్తుంది. అమర్నాథ్ యాత్రకు సంబంధించిన అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ.. ఈ నెల 15న మొదలవుతుంది. ఈ మేరకు.. శ్రీ అమర్నాథ్జీ ఆలయ బోర్డు తాజాగా ఈ వివరాలను వెల్లడించింది.
అమర్నాథ్ యాత్ర కోసం కసరత్తులు..
జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్డీఆర్ఎఫ్), రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం (ఎస్డీఆర్ఎఫ్) సభ్యులు.. అమర్నాథ్ యాత్ర 2024 ఆశాంతా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. ఇందుకోసం.. ఎంఆర్టీ (మౌంటైన్ రెస్క్యూ టీమ్స్) నుంచి వీరు ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. జమ్ముకశ్మీర్ పోలీస్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, సీఆర్పీఎఫ్ సభ్యులతో కూడిన ఎంఆర్టీలను.. పవిత్ర అమర్నాథ్ ఆలయానికి దారి తీసే రెండు మార్గాల్లో మోహరిస్తారు అధికారులు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా.. ఈ బృందాలు చర్యలు చేపడతాయి.
Amarnath Yatra 2024 date : "జూన్‌లో మొదలయ్యే శ్రీ అమర్నాథ్ యాత్ర.. రెండు నెలల పాటు కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా.. లక్షలాది మంది భక్తులు అమర్‌నాథుడిని చూడటానికి వస్తారని భావిస్తున్నాము. యాత్రలో భక్తులకు ప్రకృతిపరమైన ఇబ్బందులు ఎదురవ్వొచ్చు. ఈ పరిస్థితులను టాకిల్ చేసేందుకు.. మౌంటైన్ రెస్క్యూ టీమ్స్‌ని సిద్ధం చేస్తున్నాము. ఈ టీమ్స్.. ప్రస్తుతం శిక్షణ పొందుతున్నాయి," అని ఎంఆర్టీ ఇన్ఛార్జ్ రామ్ సింగ్ సలాథియా తెలిపారు.
"కీలక, సున్నితమైన ప్రాంతాల్లో ఎంఆర్టీలను మోహరిస్తాము. ఎమర్జన్సీ సమయంలో భక్తులకు వారు వెంటనే సాయం చేస్తారు. అంతేకాదు.. సరికొత్త టెక్నాలజీని కూడా ఎప్పటికప్పుడు టెస్ట్ చేస్తున్నాము. వాటిని కూడా ఉపయోగిస్తాము," అని రామ్ సింగ్ అన్నారు.
Amarnath Yatra 2024 start date : "ఈ బృందాలు.. ప్రతియేటా వేలాది మంది భక్తులకు సాయం చేస్తున్నాయి. టీమ్ సభ్యులను చూస్తే నాకు గర్వంగా ఉంది. వరద, అగ్ని, కొండచరియలు విరిగిపడటం, రోడ్డు ప్రమాదాలు వంటి విషయాలపై వీరు ట్రైనింగ్ తీసుకుంటున్నారు," అని రామ్ సింగ్ స్పష్టం చేశారు.
జమ్ముకశ్మీర్ పోలీసు విభాగానికి చెందిన 1,300 మంది సైనికులు ఇప్పటికే శిక్షణ పూర్తి చేసుకున్నారని రామ్ సింగ్ అన్నారు.
అమర్నాథ్ యాత్రను హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అందుకే ప్రతియేటా లక్షలాది మంది భక్తులు.. అమరనాథుడి దర్శనం కోసం జమ్ముకశ్మీర్‌కి వెళుతూ ఉంటారు.
ఛార్‌దామ్ ఆలయాలు..
Amarnath Yatra 2024 registration fee : గంగోత్రి ధామ్ ఆలయ ఓపెనింగ్‌పై ఇటీవలే ఒక కీలక అప్డేట్ వచ్చింది. అక్షయ తృతియ సందర్భంగా.. 2024 మే 10 మధ్యాహ్నం 12:25 గంటలకు పోర్టల్స్ ఓపెన్ అవుతాయి. ఈ విషయాన్ని ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో ఉన్న గంగోత్రి ఆలయ కమిటీ అధికారులు వెల్లడించారు.
ఇక యమునోత్రి ధామ్ పోర్టల్స్ ఓపెనింగ్‌పై సంబంధిత ఆలయ అర్చకులు త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.