Char Dham Portals : ఛార్‌దామ్ ఆలయాల ఓపెనింగ్‌పై కీలక అప్డేట్..
Gangotri Dham opening date 2024 : గంగోత్రి ధామ్ పోర్టల్స్ ఓపెనింగ్‌పై కీలక అప్డేట్ ఇచ్చింది ఆలయ సిబ్బంది. ఛార్దామ్లోని ఇతర ఆలయాలకు చెందిన వివరాలను ఇక్కడ చూడండి.
Gangotri Dham opening date 2024 : గంగోత్రి ధామ్ ఆలయ ఓపెనింగ్‌పై కీలక అప్డేట్. అక్షయ తృతియ సందర్భంగా.. 2024 మే 10 మధ్యాహ్నం 12:25 గంటలకు పోర్టల్స్ ఓపెన్ అవుతాయి. ఈ విషయాన్ని ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో ఉన్న గంగోత్రి ఆలయ కమిటీ అధికారులు వెల్లడించారు.
"అన్నింటిని పరిశీలించి, ఒక మంచి సమయాన్ని లెక్కించిన ఆలయ అర్చకులు.. మే 10 మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషాలకు గంగోత్రి ధామ్ పోర్టల్స్‌ని ఓపెన్ చేయాలని సూచించారు," అని శ్రీ పంచ్ మందిర్ సమితి గంగోత్రి ధామ్‌కు చెందిన హరీశ్ సెమ్వాల్ తెలిపారు.
గంగా మాత శీతాకల నిడివి ప్రాంతమైన ఉత్తరకాశీలోని మూకాంబలో ఆలయ అర్చకులు కలిసి.. పోర్టల్స్‌ని తెరిచే విషయంపై చర్చించారని సెమ్వాల్ చెప్పుకొచ్చారు.
Yamunotri Dham opening date 2024 : ఇక యమునోత్రి ధామ్ పోర్టల్స్ ఓపెనింగ్‌పై ఈ నెల 14న.. సంబంధిత ఆలయ అర్చకులు ఓ నిర్ణయం తీసుకుంటారు.
"యమునోత్రి ధామ్ పోర్టల్స్ తెరిచే విషయంపై.. పవిత్రమైన శుక్ల పక్ష షష్ఠి రోజైన ఏప్రిల్ 14న ఓ నిర్ణయం తీసుకుంటాము. చైత్ర మాసంలో వచ్చే 6వ రోజు ఇది. ఈ రోజున.. యమున.. భూమిపైకి వచ్చిందని విశ్వసిస్తుంటారు. అందుకే ఆ రోజు అర్చకులు చర్చలు జరుపుతారు," అని యమునోత్రి ఆలయ కమిటి ఎగ్జిక్యూటివ్ సభ్యుడు పురుషోత్తమ్ యూనియల్ తెలిపారు.
ఇక బద్రినాథ్ ధామ్ పోర్టల్.. మే 12 ఉదయం 6 గంటలకు ఓపెన్ అవుతుంది. కేదార్నాథ్ పోర్టల్.. మే 10 ఉదయం 7 గంటలకు ఓపెన్ అవుతుంది.
Badrinath opening date 2024 : "మద్మేశ్వర ఆలయాన్ని తెరిచే విషయంపై ఏప్రిల్ 13న నిర్ణయం తీసుకుంటాము. ఆ రోజు పవిత్ర వైశాకి పండుగ ఉంటుంది," అని బద్రినాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ మీడియా ఇన్ఛార్జ్ హరీశ్ గౌర్ తెలిపారు.
సముద్రానికి 3140 మీటర్ల ఎత్తులో ఉంటుంది గంగోత్రి ధామ్. భాగీరతి నదీ ఒడ్డు ఉంటుంది. హిందు సంప్రదాయం ప్రకారం.. స్వర్గం నుంచి గంగా తొలతు గంగోత్రిలో అడుగుపెట్టింది. అయితే.. ఈ నది ప్రారంభం.. గంగోత్రి నుంచి 19కి.మీల దూరంలోని గోముఖ్ దగ్గర ఉంటుంది. గోముఖ్ నుంచి ప్రవహించిన నీరు..దేవప్రయాగ వద్ద అలకనందను కలుస్తుంది. ఆ తర్వాతే.. దీనికి గంగా అని పేరు వస్తుంది.
Kedarnath opening date 2024 : యమునోత్రి ధామ్.. సముద్రానికి 3,293 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అక్షయ తృతియ రోజు ఆలయం తెరుచుకుని.. దీపావలి నుంచి రెండో రోజు వచ్చే యమ ద్వీతియ నాడు మూసుకుంటుంది. గంగోత్రి-యమునోత్రి మధ్య దూరం 46 కి.మీలు.
ప్రతి యేటా.. 6 నెలలపాటు ఛార్‌దామ్ ఆలయాలు మూతపడి ఉంటాయి. ఏప్రిల్ లేదా మేలో తెరుచుకుని.. శీతాకాలం (అక్టోబర్ లేదా నవంబర్)లో మూతపడతాయి.
ఛార్‌దామ్ యాత్రకు ప్రజల నుంచి స్పందన ప్రతియేటా పెరుగుతోంది. 2023లో 5.6 మిలియన్ మంది అక్కడికి వెళ్లారు. ఇది ఒక రికార్డు. 2022లో ఈ సంఖ్య 4.6 మిలియన్గా ఉంది.
సంబంధిత కథనం