తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Devotee Offers 2000 Rupees Notes: హుండీలో 8 లక్షల విలువైన 2 వేల రూపాయల నోట్లు

Devotee offers 2000 rupees notes: హుండీలో 8 లక్షల విలువైన 2 వేల రూపాయల నోట్లు

HT Telugu Desk HT Telugu

23 May 2023, 19:29 IST

  • 2 వేల రూపాయల నోటును మార్కెట్లో నుంచి ఉపసంహరించబోతున్నట్లు, ప్రజలు తమ వద్ద న్న 2 వేల రూపాయల నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలని ఆర్బీఐ శనివారం ప్రకటించింది.  అదే రోజు ఒక అజ్ఞాత భక్తుడు మొత్తం 8 లక్షల రూపాయల విలువైన రూ. 2 వేల నోట్లను హిమాచల్ ప్రదేశ్ లోని ఒక ఆలయంలోని హుండీలో వేశారు.

2000 రూపాయల కరెన్సీ నోటు
2000 రూపాయల కరెన్సీ నోటు (REUTERS)

2000 రూపాయల కరెన్సీ నోటు

Devotee offers 2000 rupees notes: రూ. 2 వేల నోటును మార్కెట్లో నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ రెండు రోజుల క్రితం ప్రకటించింది. పౌరులు తమ వద్ద ఉన్న రూ. 2 వేల నోట్లను సెప్టెంబర్ 30 వరకు బ్యాంక్ ల్లో మార్చుకోవచ్చని సూచించింది.

ట్రెండింగ్ వార్తలు

Crime news: స్కూల్ లో బాలికపై అత్యాచారం; దారుణం చేసింది స్కూల్ ఓనరే; అతడికి సహకరించిన ఏఎస్సై

UPSC CDS 2: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ

UK Graduate Visa: హైయర్ స్టడీస్ కు యూకే వెళ్లే స్టుడెంట్స్ కు గుడ్ న్యూస్; గ్రాడ్యుయేట్ వీసాపై కీలక అప్ డేట్

Rajasthan: రాజస్థాన్ గనిలో కుప్పకూలిన లిఫ్ట్; మైన్ లో ఇరుక్కుపోయిన 15 మంది అధికారులు

Devotee offers 2000 rupees notes: మే 23 నుంచి..

మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు పౌరులు తమ వద్ద ఉన్న రూ. 2 వేల నోట్లను బ్యాంక్ ల్లో మార్చుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. అయితే, ఆర్బీఐ ఆ ప్రకటన చేసిన మే 20వ తేదీననే ఒక అజ్ఞాత భక్తుడు మొత్తం 8 లక్షల రూపాయల విలువైన రూ. 2 వేల నోట్లను హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలో ఉన్న జ్వాలా దేవీ ఆలయంలోని హుండీలో వేశారు. మొత్తం 400 నోట్లను ఆ అజ్ఞాత భక్తుడు హుండీలో వేశాడని ఆ దేవాలయ పూజారి, టెంపుల్ ట్రస్ట్ సభ్యుడు కపిల్ శర్మ తెలిపారు. ఒక్కో నోట్ల కట్టలో రూ. 2 వేల నోట్లు 100 ఉన్నాయని, అలాంటి నాలుగు కట్టలను మే 21న హుండీ లెక్కింపు సమయంలో గుర్తించామని తెలిపాడు. ఆ రోజు ఆ ఆలయానికి రూ. 11.42 లక్షల హుండీ ఆదాయం సమకూరిందని వెల్లడించాడు. జ్వాలా దేవీ ఆలయానికి భక్తులు వేసవిలో ఎక్కువగా వస్తుంటారని తెలిపారు. అయితే, ఇంత పెద్ద మొత్తంలో ఈ ఆలయం హుండీలో వేయడం ఇదే ప్రథమమన్నారు.

Devotee offers 2000 rupees notes: 2016 నవంబర్ లో..

రూ. 2 వేల నోట్లను 2016 లో నాడు చెలామణిలో ఉన్న రూ. 1000, రూ. 500 నోట్లను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్న తరువాత మార్కెట్లోకి విడుదల చేశారు. ఆ తరువాత 2019 లో రూ. 2 వేల నోట్ల ముద్రణను నిలిపేశారు. తాజాగా, రూ. 2 వేల నోట్లను మార్కెట్లో నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.

Devotee offers 2000 rupees notes: శక్తి పీఠాల్లో ఒకటి..

హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలో ఉన్న జ్వాలా దేవీ ఆలయం దేశంలోని మొత్తం 51 శక్తి పీఠాల్లో ఒకటి. హిమాలయ పర్వత సానువుల్లో కాంగ్రా లోయలో శివాలిక్ పర్వత శ్రేణి పాదాల వద్ద ఈ ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని పాండవులు నిర్మించారని ప్రతీతి. సతీ దేవి నాలుక ఈ ఆలయ ప్రాంతంలో పడడం వల్ల ఇక్కడ జ్వాలా దేవి ఆలయాన్ని నిర్మించారని విశ్వసిస్తారు. ఈ ఆలయంలో ఏ విగ్రహం ఉండదు. కేవలం అగ్ని మాత్రమే జ్వలిస్తూ ఉంటుంది.

తదుపరి వ్యాసం