తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Thomas Matthew Crooks : డొనాల్డ్​ ట్రంప్​పై హత్యాయత్నం- ఎవరు ఈ థామస్​ మాథ్యూ క్రూక్స్​?

Thomas Matthew Crooks : డొనాల్డ్​ ట్రంప్​పై హత్యాయత్నం- ఎవరు ఈ థామస్​ మాథ్యూ క్రూక్స్​?

Sharath Chitturi HT Telugu

14 July 2024, 11:24 IST

google News
  • పెన్సిల్వేనియాలోని బట్లర్​లో జరిగిన బహిరంగ సభలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​పై హత్యాయత్నం జరిగింది. నిందితుడిని థామస్ మాథ్యూ క్రూక్స్(20)గా గుర్తించారు.

ట్రంప్​వైపు దూసుకెళ్లిన బుల్లెట్​!
ట్రంప్​వైపు దూసుకెళ్లిన బుల్లెట్​! (New York Times)

ట్రంప్​వైపు దూసుకెళ్లిన బుల్లెట్​!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై జరిగిన హత్యాయత్నం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. 2024 అధ్యక్ష ఎన్నికల ప్రచారాల్లో భాగంగా పెన్సిల్వేనియా బట్లర్​లో స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం జరిగిన ఓ బహిరంగ ర్యాలీలో ట్రంప్​పై హత్యాయత్నం జరిగింది. నిందితుడికి సంబంధించిన వివరాలు తాజాగా అందుబాటులోకి వచ్చాయి. ట్రంప్​పై హత్యాయత్నానికి ప్రయత్నించిన దుండగుడిని థామస్ మాథ్యూ క్రూక్స్​గా అధికారులు గుర్తించారు. అతని వయస్సు 20ఏళ్లు!

ట్రంప్​ని థామస్​ ఎందుకు చంపాలనుకున్నాడు?

బట్లర్ ఫామ్ షో మైదానంలో డొనాల్డ్ ట్రంప్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న వేదికకు 130 గజాల దూరంలో ఉన్న ఓ తయారీ కర్మాగారం పైకప్పు మీద నుంచి కాల్పులు జరిపాడు థామస్​ మాథ్యూ క్రూక్స్​.

దాడి అనంతరం దుండగుడిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్చి చంపారు. అతడి నుంచి ఏఆర్ తరహా రైఫిల్​ను భద్రతా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి:- Donald Trump : డొనాల్డ్​ ట్రంప్​ ర్యాలీలో కాల్పుల కలకలం! మాజీ అధ్యక్షుడి చెవికి గాయం- లైవ్​ వీడియో..

న్యూయార్క్​ పోస్ట్​ ప్రకారం ఘటనాస్థలానికి 40మైళ్ల దూరంలోని బెథెల్​ పార్క్​ వద్ద నిందితుడు ఇల్లు ఉంది. ట్రంప్​ని అతను ఎందుకు టార్గెట్​ చేశాడు? హత్యాయత్నం వెనుక కారణాలు ఏంటి? వంటి ప్రశ్నలపై ప్రస్తుతం క్లారిటీ లేదు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు, త్వరలో మరిన్ని వివరాలను వెల్లడిస్తామని అధికారులు చెప్పారు. ట్రంప్​పై హత్యాయత్నం వెనుక థామస్​ ఒక్కడే ఉన్నాడా? లేక వేరెవరైనా అతడిని ప్రేరేపించారా? అన్నది ఇప్పుడే చెప్పలేమని స్పష్టం చేశారు.

కాగా థామస్​ మాథ్యూ క్రూక్స్​ కాల్పుల్లో డొనాల్డ్ ట్రంప్ కుడి చెవికి గాయమైంది. రక్తం కూడా కారింది. థామస్​ కాల్పుల్లో మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇంకొకరికి తీవ్రంగా గాయలయ్యాయి.

మరణించిన వ్యక్తి కుటుంబానికి అమెరికా మాజీ అధ్యక్షుడు సంతాపం తెలిపారు.

1981 తర్వాత తొలిసారి..

కొన్ని దశాబ్దాలుగా గన్​ కల్చర్​తో అమెరికా సతమతమవుతోంది. 1963లో అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీని కాల్చి చంపారు. 1968లో కాలిఫోర్నియాలో రాబర్ట్ ఎఫ్ కెన్నడీ సహా పలువురు ఎన్నికల ప్రచారంలో కాల్పులకు బలయ్యారు. 1972లో ఇండిపెండెంట్​గా పోటీ చేస్తున్న జార్జ్ వాలెస్​ను ప్రచార వేదికపై దుండగులు కాల్చి చంపారు.

981లో రొనాల్డ్ రీగన్​ను కాల్చి చంపిన ఘటన తర్వాత ఒక అధ్యక్షుడు లేదా అధ్యక్ష అభ్యర్థిపై హత్యాయత్నం జరగడం ఇదే తొలిసారి. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు నాలుగు నెలల ముందు ఈ దాడి జరగడం గమనార్హం.

ఇదిలా ఉండగా, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​కి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడోన్​ ఫోన్​ చేసినట్టు తెలుస్తోంది.

“అధ్యక్షుడు బైడెన్ మాజీ అధ్యక్షుడు ట్రంప్​తో మాట్లాడారు. పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరో, బట్లర్ మేయర్ బాబ్ డాండోయ్ తో కూడా మాట్లాడారు. ఈ రోజు రాత్రి (శనివారం) అధ్యక్షుడు వాషింగ్టన్ డీసీకి తిరిగి వస్తున్నారు. రేపు ఉదయం శ్వేతసౌధంలో ఆయనకు హోంల్యాండ్ సెక్యూరిటీ, లా ఎన్​ఫోర్స్​మెంట్ అధికారుల నుంచి అప్డేట్ బ్రీఫింగ్ అందుతుంది,” అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

తదుపరి వ్యాసం