US Presidential Election 2024: ‘‘మళ్లీ జో బైడెన్ గెలుస్తారు’’- అమెరికా అధ్యక్ష ఎన్నికలపై 'నోస్ట్రాడమస్' జోస్యం-joe biden will win us presidential election 2024 predicts nostradamus ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Us Presidential Election 2024: ‘‘మళ్లీ జో బైడెన్ గెలుస్తారు’’- అమెరికా అధ్యక్ష ఎన్నికలపై 'నోస్ట్రాడమస్' జోస్యం

US Presidential Election 2024: ‘‘మళ్లీ జో బైడెన్ గెలుస్తారు’’- అమెరికా అధ్యక్ష ఎన్నికలపై 'నోస్ట్రాడమస్' జోస్యం

HT Telugu Desk HT Telugu
May 02, 2024 04:58 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. రిపబ్లికన్ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. కానీ, ఈ ఎన్నికల్లో కూడా డెమొక్రాట్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ గెలుస్తారని యూఎస్ అధ్యక్ష ఎన్నికల నోస్ట్రాడమస్ గా పేరుగాంచిన లిచ్ మన్ జోస్యం చెప్పారు.

డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్
డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ (REUTERS)

US Presidential Election 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) మరోసారి విజయం సాధిస్తారని యూఎస్ అధ్యక్ష ఎన్నికలను సరిగ్గా అంచనా వేయడంలో ‘నోస్ట్రాడమస్ (Nostradamus)’ గా పేరుగాంచిన అలన్ లిచ్ మన్ జోస్యం చెప్పారు.

'చాలా పొరపాట్లు' జరిగితే తప్ప..

'చాలా పొరపాట్లు' జరిగితే తప్ప అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి అధ్యక్ష పీఠాన్ని నిలబెట్టుకోవడం ఖాయమేనని అలన్ లిచ్ మన్ తెలిపారు. అలన్ లిచ్ మన్ ను యుఎస్ అధ్యక్ష ఎన్నికల నోస్ట్రడామస్ (Nostradamus of US Elections) అని పిలుస్తారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో (US Presidential Election 2024) బైడెన్ తో రిపబ్లికన్ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పోటీ పడుతున్నారు. వీరిద్దరి మధ్య పోటీ బలంగా ఉంది. అయితే, మొత్తం మీద బైడెన్ పై ట్రంప్ కొంత ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ (Donald Trump) కంటే డెమొక్రాట్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ 1.5 శాతం ఓట్ల వెనుకంజలో ఉన్నట్లు అమెరికా జాతీయ సర్వేలు చెబుతున్నాయి.

ఇది ఫైనల్ అంచనా కాదు..

అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత విషయంలో 1984 నుంచి లిచ్ మన్ అంచనాలన్నీ నిజమయ్యాయి. అయితే, బైడెన్ (Joe Biden) గెలుస్తారన్న తన అంచనా తుది అంచనా కాదని అలన్ లిచ్ మన్ తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేతను అంచనా వేసే విషయంలో లిచ్ మన్ ముఖ్యంగా 13 కీ లతో ఒక నమూనా ను ఉపయోగిస్తారు. వాటిలో ఆరు లేదా అంతకంటే ఎక్కువ కీ అధికారంలో ఉన్న అభ్యర్థికి వ్యతిరేకంగా వస్తే, ఆ అభ్యర్థి ఓడిపోతాడని లిచ్ మన్ భావిస్తారు. ఆరు కన్నా తక్కువ వస్తే అధికారంలో ఉన్న అభ్యర్థి విజయం సాధిస్తారు. ప్రస్తుతం బైడెన్ కు వ్యతిరేకంగా 2 కీస్ మాత్రమే కనిపిస్తున్నాయి. అందువల్ల ఆయన విజయం సాధిస్తారు. అయితే, ఇది తుది అంచనా కాదు. ఈ ఎన్నికల్లో జో బైడెన్ (Joe Biden) ఓడిపోవాలంటే చాలా తప్పులు చేయాల్సి ఉంటుంది’’ అని అలన్ లిచ్ మన్ (Allan Lichtman) విశ్లేషించారు.