Donald Trump : ‘ఈసారి నేను గెలవకపోతే రక్తపాతమే.. జాగ్రత్త’- ట్రంప్!
US Presidential elections 2024 : నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలవకపోతే.. రక్తపాతం తప్పదని అన్నారు ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. దీనికి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కౌంటర్ వేశారు.
US Presidential elections 2024 : 2024 అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికలు.. అమెరికా చరిత్రలోనే అత్యంత కీలకమని, ఈసారి.. తాను గెలవకపోతే.. రక్తపాతం తప్పదని అన్నారు!
'నేను గెలవకపోతే రక్తపాతమే..'
"నవంబర్ 5.. ఈ డేట్‌ని గుర్తుపట్టుకోండి. దేశ చరిత్రలో ఇది అత్యంత ముఖ్యమైన డేట్ అవుతుంది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్.. అత్యంత వేస్ట్ ప్రెసిడెంట్. ఈసారి జరిగే ఎన్నికల్లో నేను గెలవాలి. నేను గెలవకపోతే.. రక్తపాతమే!" అని ఒహాయోలో జరిగిన ఎన్నికల ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తాను గెలవకపోతే.. 'రక్తపాతం' జరుగుతుందని ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో స్పష్టత లేదు. కానీ.. అమెరికా ఆటోమొబైల్ ఇండస్ట్రీ ప్రమాదంలో ఉందని కథనాలు వెలువడుతున్న సమయంలో.. ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
"చైనీయులు.. మెక్సికోలో కార్లు తయారు చేసి, అమెరికాకు పంపుదామని చూస్తున్నారు. నేను అధికారంలోకి వస్తే.. అలా జరగదు. నేను గెలవకపోతే.. రక్తపాతం కచ్చితంగా జరుగుతుంది. దేశం మొత్తంపై ఈ రక్తపాతం ఎఫెక్ట్ పడుతుంది. ఏది ఏమైనా.. చైనీయులు మన దేశంలో కార్లను అమ్మనివ్వను," అని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
Donald Trump US Presidential elections : రిపబ్లికెన్ పార్టీ కీలక నేత, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన వ్యాఖ్యలపై డెమొక్రాట్ పార్టీ, జో బైడెన్ వర్గం ప్రకటన విడుదల చేసింది.
"2020 జనవరి 6న జరిగిన హింస అందరికి గుర్తుంది. దానిని మళ్లీ రిపీట్ చేయాలని ట్రంప్ చూస్తున్నారు. ఆయనొక లూజర్. ప్రజలు తెలివైన వారు. ఈసారి కూడా ఆయన్ని ఓడిస్తారు. హింసతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని ఓడిస్తారు," అని జో బైడెన్ క్యాంపైన్ చెప్పుకొచ్చింది.
ఇదే విషయంపై.. వాషింగ్టన్లో జరిగిన ఓ ఈవెంట్లో మాట్లాడారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.
"స్వేచ్ఛపై దాడి జరుగుతోంది. 2020 ఎన్నికల్లో చెప్పిన అబద్ధాలు, తీర్పును తారుమారు చేయాలని చేసిన ప్రయత్నాలు, జనవరి 6 సంఘటన.. ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారాయి. 2020లో వాళ్లు ఓడిపాయారు. కానీ ప్రమాదం ఇంకా పొంచి ఉంది," అని జో బైడెన్ అన్నారు.
Joe Biden US Presidential elections : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్, ట్రంప్ పోటీ చేయడం దాదాపు ఖరారైపోయింది. అయితే.. వయస్సులో వీరిద్దరూ పెద్దవారే. ఇదే విషయంపై కొందరు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. వీటిపైనా జో బైడెన్ స్పందించారు.
"ఇద్దరు పెద్దవాళ్లు పోటీ చేస్తున్నారు. వారిలో ఒకరి మానసిక పరిస్థితి సరిగ్గా లేదు. ఇంకొకరు నేను," అని బైడెన్ అన్నారు.
సంబంధిత కథనం