తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Donald Trump : అమెరికాలో పతాకస్థాయికి గన్​ కల్చర్​- 1981 తర్వాత తొలిసారి ఇలా..

Donald Trump : అమెరికాలో పతాకస్థాయికి గన్​ కల్చర్​- 1981 తర్వాత తొలిసారి ఇలా..

Sharath Chitturi HT Telugu

14 July 2024, 8:10 IST

google News
  • అమెరికాలో గన్​ కల్చర్​ పతాకస్థాయికి చేరింది! అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై హత్యాయత్నం జరిగింది. 1981లో రొనాల్డ్ రీగన్​ను కాల్చి చంపిన ఘటన తర్వాత ఒక అధ్యక్షుడు లేదా అధ్యక్ష అభ్యర్థిపై హత్యాయత్నం జరగడం ఇదే తొలిసారి.

డొనాల్డ్​ ట్రంప్​పై హత్యాయత్నం
డొనాల్డ్​ ట్రంప్​పై హత్యాయత్నం (REUTERS)

డొనాల్డ్​ ట్రంప్​పై హత్యాయత్నం

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఎన్నికల ర్యాలీలో కాల్పుల కలకలం! ప్రమాదం నుంచి ట్రంప్​ తృటిలో తప్పించుకున్నారు. ఆయన్ని రక్షించిన సీక్రెట్​ సర్వీస్​.. ఈ ఘటనను ట్రంప్​పై హత్యాయత్నంగా పరిగణించి, దర్యాప్తు చేపట్టింది. ఇదే ఘటనలో ఒక దుండగుడితో పాటు ర్యాలీలో పాల్గొన్న ఒక సభ్యుడు మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

కాల్పుల శబ్దాలు వినిపించడంతో డొనాల్డ్ ట్రంప్ నేలపై పడిపోవడం, భద్రతా సిబ్బంది చుట్టుముట్టడం వంటి దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ట్రంప్​పై హత్యాయత్నం జరగడం సర్వత్రా చర్చకు దారితీసింది.

డొనాల్డ్ ట్రంప్ ర్యాలీలో కాల్పుల మోత..

  1. డొనాల్డ్ ట్రంప్ బాగానే ఉన్నారని యుఎస్ సీక్రెట్ సర్వీస్ తెలిపింది. లా ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు దుండగుడిని కాల్చి చంపారని స్పష్టం చేసింది. 1981లో రొనాల్డ్ రీగన్​ను కాల్చి చంపిన ఘటన తర్వాత ఒక అధ్యక్షుడు లేదా అధ్యక్ష అభ్యర్థిపై హత్యాయత్నం జరగడం ఇదే తొలిసారి. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు నాలుగు నెలల ముందు ఈ దాడి జరగడం గమనార్హం.
  2. కాల్పులు జరిపిన వ్యక్తి ర్యాలీలో పాల్గొనలేదని, అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతడిని కాల్చి చంపారని సమాచారం. అధ్యక్షుడు, ప్రధాన పార్టీ అభ్యర్థులతో ఈ సీక్రెట్​ సర్వీస్​ ప్రతిచోటా పర్యటిస్తుంది. ఎలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉంటుంది.
  3. ట్రంప్ ప్రసంగం మధ్యలో కాల్పుల శబ్దాలు వినిపించాయి. ఆయన నేలకొరిగారు. కుడి చేతిని కుడి చెవి మీద పెట్టారు. చెవి నుంచి రక్తం కనిపించింది. ఆ తర్వాత మరో రెండు సార్లు కాల్పుల శబ్ధాలు వినిపించాయి. ర్యాలీ వేదిక నుంచి ట్రంప్​ను వెయిటింగ్ కారులోకి తీసుకెళ్లడానికి సీక్రెట్ సర్వీస్​కు రెండు నిమిషాల సమయం పట్టింది. ట్రంప్ గాయం తీవ్రత ఇంకా తెలియలేద.
  4. బుల్లెట్​తో నన్ను కాల్చారు. నా కుడి చెవి పైభాగనికి తాకింది. ఏదో తేడాగా ఉందని నాకు అనిపించింది. కాల్పుల శబ్దం వినిపించింది. బుల్లెట్​ నా చర్మంలోకి చొచ్చుకెళ్లింది. మన దేశంలో ఇలాంటి ఘటనలు జరగడటం ఆందోళనకరం,” అని తన ట్రూత్​ సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు.
  5. యునైటెడ్ స్టేట్స్ సీక్రెట్ సర్వీస్ కమ్యూనికేషన్స్ చీఫ్ ఆంథోనీ గుగ్లీల్మి ఎక్స్​లో ఇలా రాశారు: “జూలై 13 సాయంత్రం పెన్సిల్వేనియాలో జరిగిన ట్రంప్ ర్యాలీలో ఒక సంఘటన జరిగింది. సీక్రెట్ సర్వీస్ రక్షణ చర్యలను అమలు చేసింద. మాజీ అధ్యక్షుడు సురక్షితంగా ఉన్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టాము.”
  6. ట్రంప్ పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ అమెరికా జెండా ముందు పిడికిలి ఎత్తిన ట్రంప్ ఫోటోను ఎక్స్​లో పోస్ట్ చేశారు. అమెరికాను కాపాడేందుకు ఆయన పోరాటం ఆపరని పేర్కొన్నారు.
  7. ఈ కాల్పుల ఘటనపై ఎఫ్​బీఐ, ఇతర నిఘా సంస్థలు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టాయి.
  8. కొన్ని దశాబ్దాలుగా గన్​ కల్చర్​తో అమెరికా సతమతమవుతోంది. 1963లో అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీని కాల్చి చంపారు. 1968లో కాలిఫోర్నియాలో రాబర్ట్ ఎఫ్ కెన్నడీ సహా పలువురు ఎన్నికల ప్రచారంలో కాల్పులకు బలయ్యారు. 1972లో ఇండిపెండెంట్​గా పోటీ చేస్తున్న జార్జ్ వాలెస్​ను ప్రచార వేదికపై దుండగులు కాల్చి చంపారు.

తదుపరి వ్యాసం