తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Up Rape Case : 5ఏళ్ల చిన్నారిపై 55ఏళ్ల వ్యక్తి అత్యాచారం.. ఇంటికి తీసుకెళ్లి!

UP rape case : 5ఏళ్ల చిన్నారిపై 55ఏళ్ల వ్యక్తి అత్యాచారం.. ఇంటికి తీసుకెళ్లి!

Sharath Chitturi HT Telugu

08 July 2023, 7:14 IST

google News
  • UP rape case : 5ఏళ్ల చిన్నారిపై ఓ 55ఏళ్ల వ్యక్తి అత్యాచారం చేసిన ఘటన ఉత్తర్​ ప్రదేశ్​లో వెలుగులోకి వచ్చింది. మరో ఘటనలో 17ఏళ్ల మైనర్​పై ఓ 29ఏళ్ల వ్యక్తి అత్యాచారనికి పాల్పడ్డాడు.

5ఏళ్ల చిన్నారిపై 55ఏళ్ల వ్యక్తి అత్యాచారం..
5ఏళ్ల చిన్నారిపై 55ఏళ్ల వ్యక్తి అత్యాచారం..

5ఏళ్ల చిన్నారిపై 55ఏళ్ల వ్యక్తి అత్యాచారం..

UP rape case : ఉత్తర్​ ప్రదేశ్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 5ఏళ్ల చిన్నారిపై ఓ 55ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఇదీ జరిగింది..

ఉత్తర్​ ప్రదేశ్​ అమేఠీ జిల్లాలోని ఓ గ్రామంలో గత బుధవారం జరిగింది ఈ ఘటన. చిన్నారి ఉంటున్న ఇంటికి వెళ్లాడు ఓ 55ఏళ్ల వ్యక్తి. తన ఇంట్లో టీవీ ఉందని, అక్కడ చూడవచ్చని చెప్పి, మైనర్​ను బయటకు తీసుకెళ్లాడు. అలా ఇంటికి తీసుకెళ్లిన ఆయన, 5ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఘటన గురించి తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు.. పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై పోక్సోతో పాటు ఇతర చట్టాల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. కాగా.. నిందితుడిని ఇంకా అరెస్ట్​ చేయలేదని తెలుస్తోంది.

మరోవైపు వైద్య పరీక్షల కోసం చిన్నారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి:- Scheme for minor rape victims : అత్యాచార బాధితులకు ఆర్థిక సాయం.. కేంద్రం కీలక నిర్ణయం!

17ఏళ్ల బాలికపై..

దేశంలో మహిళలు, బాలికలు, చిన్నారులపై అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఓ 17ఏళ్ల బాలికపై ఓ 29ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. గత నెల 24 తెల్లవారుజామున బాలిక మెరైన్​ డ్రైవ్​కు వెళ్లింది. తన జుట్టుకు రంగు వేసుకోవడంపై తల్లి మందలిచడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లి, చివరికి మెరైన్​ డ్రైవ్​ వద్ద కూర్చుంది. ఆమె ఏడుస్తుండటం చూసి ఓ వ్యక్తి బాలిక వద్దకు వెళ్లాడు. ఆమెను ఓదార్చాడు. ఇలా వారిద్దరి మధ్య పరిచయం పెరిగింది. వారిద్దరు నెంబర్​లు ఎక్స్​ఛేంజ్​ చేసుకున్నారు.

జూన్​ 24న.. బాలికకు ఆ వ్యక్తి ఫోన్​ చేశాడు. తన ఇంటికి పిలిచాడు. ఆమె వెళ్లింది. అక్కడే ఆమెను రేప్​ చేశాడు నిందితుడు. అంతటితో ఆగకుండా ఆ దృశ్యాలను చిత్రీకరించాడు. మళ్లీ రేప్​ చేశాడు. జూన్​ 25న ఈ విషయాన్ని బాధితురాలు తన తల్లికి చెప్పింది. జులై 1న ఈ వ్యవహారంపై పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదైంది.

ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడిని శుక్రవారం అరెస్ట్​ చేశారు.

తదుపరి వ్యాసం