Assam rape case : బాలికపై అత్యాచారం.. చంపి, మృతదేహాన్ని నదిలో పడేసి!
03 July 2023, 15:00 IST
- Assam rape case : దేశంలో బాలికలపై అత్యాచార ఘటనలు రోజురోజుకు ఆందోళనకరంగా మారాయి. ఓ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు, ఆమెను చంపి, మృతదేహాన్ని నదలో పడేసిన ఘటన అసోంలో వెలుగులోకి వచ్చింది.
బాలికపై అత్యాచారం.. చంపి, మృతదేహాన్ని నదిలో పడేసి!
Assam rape case : అసోంలో ఓ 16ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలిని రేప్ చేయడమే కాకుండా, ఆమెను చంపి, మృతదేహాన్ని నదిలో పడేశాడు నిందితుడు!
ఇదీ జరిగింది..
అసోంలోని కామ్రూప్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 16ఏళ్ల బాలిక ఓ స్కూల్లో 8వ తరగతి చదువుకుంటోంది. కాగా.. గత సోమవారం తన మొబైల్ ఫోన్ను రీఛార్జ్ చేసుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఆ తర్వాత ఆమె ఇంటికి తిరిగి వెళ్లలేదు!
కూతురు ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు.. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై తక్షణమే స్పందించిన పోలీసులు.. బాలికను గుర్తించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా.. గత శుక్రవారం.. దిగారు నదిలో బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించగా.. ఆమెపై అత్యాచారం జరిగినట్టు రుజువైందని సమాచారం.
Minor raped in Assam : ఈ ఘటనతో స్థానికంగా నిరసనలు వెల్లువెత్తాయి. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని శుక్రవారం స్థానికులు సోనాపూర్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగారు.
మరోవైపు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. తాజాగా సోమవారం అతడిని పట్టుకున్నారు. అతనొక ఆటో డ్రైవర్ అని తెలుసుకున్నారు. అతడిని విచారించారు. ఈ నేపథ్యంలో బాలికను తానే రేప్ చేసి, చంపేసి, మృతదేహాన్ని నదిలో పడేసినట్టు.. నిందితుడు ఒప్పుకున్నాడని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
Minor killed in Assam : ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని బాధిత కుటుంబానికి పోలీసులు హామీనిచ్చారు.
బాలికపై అత్యాచారం..
Ranchi rape case : దేశంలో మహిళలపై నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా బాలికలపై అత్యాచార ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఓ బాలిక సామూహిక అత్యాచారానికి గురైన ఘటన ఇటీవలే ఝార్ఖండ్ రాజధాని రాంచీలో వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించి.. ముగ్గురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.
రాంచీలోని ధుర్వా ప్రాంతంలో గత నెల 29న జరిగింది ఈ ఘటన. 15ఏళ్ల బాధితురాలు తన బంధువుతో కలిసి సమీపంలోని జగన్నాథ ఉత్సవాలకు వెళ్లింది. కొంత సేపటి తర్వాత మైనర్ తిరుగుపయనం అయ్యింది.
బాలిక వెనక్కి వస్తుండగా వర్షం మొదలైంది. అప్పుడే ఓ యువకుడు ఆమెను కలిశాడు. బాధితురాలి బంధువుకు అతనితో పరిచయం ఉంది. ఆమెను ఇంటి వద్ద డ్రాప్ చేస్తానని చెప్పాడు. బాధితురాలు అతని బైక్ ఎక్కింది. కానీ ఇంటికి కాకుండా.. ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లాడు నిందితుడు. అక్కడే మరో ముగ్గురితో కలిసి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఒకరి తర్వాత ఒకరు అఘాయిత్యానికి ఒడిగట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.