Ranchi rape case : వర్షంలో బాలికపై సామూహిక అత్యాచారం!
Ranchi rape case : ఓ బాలిక సామూహిక అత్యాచారానికి గురైన ఘటన రాంచీలో వెలుగులోకి వచ్చింది. నిందితుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Ranchi rape case : ఝార్ఖండ్ రాజధాని రాంచీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. ముగ్గురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.
ఇదీ జరిగింది..
రాంచీలోని ధుర్వా ప్రాంతంలో గత నెల 29న జరిగింది ఈ ఘటన. 15ఏళ్ల బాధితురాలు తన బంధువుతో కలిసి సమీపంలోని జగన్నాథ ఉత్సవాలకు వెళ్లింది. కొంత సేపటి తర్వాత మైనర్ తిరుగుపయనం అయ్యింది.
బాలిక వెనక్కి వస్తుండగా వర్షం మొదలైంది. అప్పుడే ఓ యువకుడు ఆమెను కలిశాడు. బాధితురాలి బంధువుకు అతనితో పరిచయం ఉంది. ఆమెను ఇంటి వద్ద డ్రాప్ చేస్తానని చెప్పాడు. బాధితురాలు అతని బైక్ ఎక్కింది. కానీ ఇంటికి కాకుండా.. ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లాడు నిందితుడు. అక్కడే మరో ముగ్గురితో కలిసి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఒకరి తర్వాత ఒకరు అఘాయిత్యానికి ఒడిగట్టారు.
ఇదీ చూడండి:- Minor girl Rape: కరీం నగర్‌లో దారుణం, పదో తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
బాధితురాలు తనకు జరిగిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురిని శనివారం అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో వ్యక్తిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.
మరోవైపు బాలికను పోలీసులు సీడబ్ల్యూసీ (చైల్డ్ వెల్ఫేర్ కమిటీ) వద్ద హాజరుపరిచారు. అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
నిందితులను కఠినంగా శిక్షిస్తామని బాధిత కుటుంబానికి పోలీసులు హామీనిచ్చారు.
సంబంధిత కథనం