Minor girl Rape: కరీం నగర్‌లో దారుణం, పదో తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
27 June 2023, 8:53 IST
- Minor girl Rape: ప్రేమ పేరుతో పదో తరగతి విద్యార్ధినిపై సహ విద్యార్ధులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కరీంనగర్‌లో వెలుగు చూసింది. ప్రేమ పేరుతో దగ్గరైన యువకుడు మొదట అత్యాచారానికి పాల్పడగా ఆ వీడియోలను రికార్డు చేసి, ఆపై బెదిరించి మిగిలిన వారు అకృత్యానికి పాల్పడ్డారు.
కరీం నగర్‌లో పదో తరగతి బాలికపై సామూహిక అత్యాచారం
Minor girl Rape: కరీంనగర్ పట్టణంలో పదో తరగతి విద్యార్ధినిపై సహ విద్యార్ధులు అత్యాచారానికి పాల్పడిన ఉదంతం వెలుగు చూసింది. మొదట ఓ విద్యార్ధితో సన్నిహితంగా ఉన్న వీడియోలను రికార్డు చేసిన సహ విద్యార్దులు, వాటితో ఆమెను బెదిరించి అత్యాచాారానికి పాల్పడ్డారు. అవే వీడియోలు చూపించి ఆమె లొంగ దీసుకునేందుకు మరో ముగ్గురు ప్రయత్నించారు. ఈ ఘటనలో ఆరుగురిపై పోక్సో కేసు నమోదు చేశారు.
ప్రియుడితో పదోతరగతి చదివే మైనర్ బాలిక సన్నిహితంగా ఉన్నప్పుడు రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీసిన అతని స్నేహితులు, ఆపై వాటిని చూపి ఆమెను బెదిరించి వేర్వేరు సందర్భాల్లో అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకే కాలనీలో నివసించే బాలికతో అదే ప్రాంతంలో ఇంటర్ చదువుతున్న బాలుడు సన్నిహితంగా ఉంటున్నాడు. ఇద్దరూ ప్రేమ పేరుతో దగ్గరయ్యారు.
ఏడాది కిందట ఓ సందర్భంలో వారిద్దరూ సన్నిహితంగా ఉన్న వీడియో, ఫొటోలను బాలుడి స్నేహితులు ఇద్దరు రహస్యంగా చిత్రీకరించారు. వాటిని ఆమెకు చూపించి, తల్లిదండ్రులకు చెబుతామని బెదిరించి బాలికను లొంగదీసుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ వీడియోలను షేర్ చేయడంతో వారి స్నేహితులైన మరో ముగ్గురు కూడా బాలికను లొంగదీసుకునేందుకు ప్రయత్నించారు.
మూడు రోజుల కిందట ఈ విషయం షీటీమ్ దృష్టికి వెళ్లడంతో వారు. అఘాయిత్యానికి పాల్పడిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలి పెట్టారు. కేసు నమోదు చేయకుండా విషయాన్ని రహస్యంగా ఉంచారు. సోమవారం బాలిక తల్లిదండ్రులతో కలిసి నగరంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఆమె ప్రేమికుడితో కలిపి ఆరుగురిపై పోక్సో, అత్యాచారం, బెదిరింపుల కేసు నమోదు చేశారు.
కేసు నమోదైన ఆరుగురిలో అయిదుగురు ఇంటర్ చదువుతున్నారని, మరో వ్యక్తి మేజర్ అని, అతను పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం పూర్తిచేశాడని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని, బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కరీం నగర్ పోలీసులు తెలిపారు.