Mumbai rape case : స్నేహితుడు రేప్​ చేసిన బాలికపై సొంత తండ్రి అత్యాచారం.. గర్భం దాల్చిన మైనర్​-mumbai minor girl becomes pregnant after being raped by male friend her father duo held ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Mumbai Rape Case : స్నేహితుడు రేప్​ చేసిన బాలికపై సొంత తండ్రి అత్యాచారం.. గర్భం దాల్చిన మైనర్​

Mumbai rape case : స్నేహితుడు రేప్​ చేసిన బాలికపై సొంత తండ్రి అత్యాచారం.. గర్భం దాల్చిన మైనర్​

Sharath Chitturi HT Telugu
Jun 24, 2023 01:30 PM IST

Mumbai rape case : ముంబైలో ఓ బాలిక రెండుసార్లు అత్యాచారానికి గురై చివరికి గర్భం దాల్చింది. తొలుత స్నేహితుడు ఆమెను రేప్​ చేయగా.. కొన్ని రోజులకే ఆమె తండ్రి అత్యచారానికి ఒడిగట్టాడు.

ముంబైలో బాలికపై అత్యాచారం..
ముంబైలో బాలికపై అత్యాచారం..

Mumbai rape case : మహారాష్ట్ర ముంబైలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. స్నేహితుడు రేప్​ చేసిన బాధతో కుమిలిపోతున్న ఓ బాలికపై.. ఆమె తండ్రి కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫలితంగా 16ఏళ్లకే ఆమె గర్భం దాల్చింది.

ఇదీ జరిగింది..

బాధితురాలికి.. కొంతకాలం క్రితం ఓ 32ఏళ్ల వ్యక్తితో పరిచయమైంది. వారిద్దరు ఒకే ప్రాంతంలో నివాసముంటారు. కొద్ది కాలంలోనే స్నేహితులయ్యారు. కాగా.. పెళ్లి చేసుకుంటానని చెప్పి, బాలికపై ఆ వ్యక్తి గత ఫిబ్రవరిలో రేప్​ చేశాడు. ఆ తర్వాత ఆమెను వదిలేశాడు. ఈ విషయం బయట చెప్పుకోలేక బాలిక కృంగిపోయింది.

కొన్ని రోజుల తర్వాత.. బాలికపై మరోమారు అత్యాచారం జరిగింది. ఈసారి సొంత తండ్రే ఆమెను రేప్​ చేశాడు! ఇంట్లో ఎవరూ లేని సమయంలో సొంత కూతురిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు ఆ 41ఏళ్ల తండ్రి. ఇవేవీ బాలిక ఎవరికి చెప్పుకోలేపోయింది. చాలా మనోవేధనకు గురైంది.

ఇలా బయటపడింది..

Father raped daughter in Mumbai : ఇటీవలే బాలికకు కడుపులో నొప్పి మొదలైంది. ఈ విషయం తన తల్లికి చెప్పింది. ఆ మహిళ, తన బిడ్డను రాజావాడి ఆసుపత్రికి తీసుకెళ్లింది. మైనర్​ గర్భం దాల్చిందని వైద్యులు చెప్పడంతో ఆ మహిళ షాక్​కు గురైంది. ఏం జరిగిందని ప్రశ్నించగా.. అప్పుడు బాలిక నిజం చెప్పింది. 'ముందు నా స్నేహితుడు రేప్​ చేశాడు. ఆ తర్వాత నా తండ్రి కూడా అత్యాచారం చేశాడు,' అని బాలిక వివరించింది.

సంబంధిత ఆసుపత్రి బాలిక విషయాన్ని తిలక్​ నగర్​ పోలీస్​ స్టేషన్​లోని అధికారులకు చెప్పింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలికను విచారించారు. ఆ సమయంలో పోలీసులకు జరిగనది వివరించింది. ఎవరి చెప్పుకోలేక తాను డిప్రెషన్​కి గురైనట్టు వివరించింది. ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు.. బాలిక తండ్రితో పాటు ఆమె స్నేహితుడిని అరెస్ట్​ చేశారు.

మరోవైపు ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్​లు వెల్లువెత్తుతున్నాయి.

11ఏళ్ల బాలికపై అత్యాచారం..

దేశంలో అత్యాచార ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా బాలికలపై అఘాయిత్యాలు ఆందోళనకరంగా మారాయి. ఓ 11ఏళ్ల బాలికను ఓ రిటైర్డ్​ పోలీసు అధికారి రేప్​ చేసిన ఘటన మధ్యప్రదేశ్​లో ఇటీవలే కలకలం సృష్టించింది.

ఇండోర్​ క్రైమ్​ బ్రాంచ్​లో పనిచేసే నాథురామ్​ దూబే.. సబ్​- ఇన్​స్పెక్టర్​ పోస్టు నుంచి ఇటీవలే రిటైర్​ అయ్యాడు. ఇండోర్​ జిల్లాలో అతనికి ఓ ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ఓ కుటుంబం నివాసముంటోంది.

కాగా.. జూన్​ రెండో వారంలో ఆ ఇంట్లోని కుటుంబసభ్యులు బయటకువెళ్లారు. 11ఏళ్ల బాలిక మాత్రమే ఇంట్లో ఉంది. అదే సమయంలో అక్కడికి వెళ్లిన నాథురామ్​.. ఆ మెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత.. తనకు జరిగినది తల్లిదండ్రులకు వివరించింది ఆ బాలిక. బాధితు కుటుంబం.. పోలీసులను ఆశ్రయించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సంబంధిత కథనం