Madhya Pradesh crime news : 11ఏళ్ల బాలికపై రిటైర్డ్ పోలీసు అధికారి అత్యాచారం!
Madhya Pradesh crime news : క్రైమ్ బ్రాంచ్‌లో ఎస్ఐగా పని చేసి ఇటీవలే రిటైర్ అయిన ఓ పోలీసు.. తన ఇంట్లో అద్దెకు ఉండే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె వయస్సు 10ఏళ్లు.
Madhya Pradesh crime news : మధ్యప్రదేశ్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 11ఏళ్ల బాలికపై ఓ రిటైర్డ్ పోలీసు అధికారి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఇదీ జరిగింది..
ఇండోర్ క్రైమ్ బ్రాంచ్‌లో పనిచేసే నాథురామ్ దూబే.. సబ్- ఇన్స్పెక్టర్ పోస్టు నుంచి ఇటీవలే రిటైర్ అయ్యాడు. ఇండోర్ జిల్లాలో అతనికి ఓ ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ఓ కుటుంబం నివాసముంటోంది.
కాగా.. గత శనివారం, ఆ ఇంట్లోని కుటుంబసభ్యులు బయటకువెళ్లారు. 11ఏళ్ల బాలిక మాత్రమే ఇంట్లో ఉంది. అదే సమయంలో అక్కడికి వెళ్లిన నాథురామ్.. ఆ మెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత.. తనకు జరిగినది తల్లిదండ్రులకు వివరించింది ఆ బాలిక. బాధితు కుటుంబం.. పోలీసులను ఆశ్రయించింది.
"తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో.. 11ఏళ్ల బాలికపై నిందితుడు అత్యాచారానికి పాలపడ్డాడు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్నాము," అని ఏసీపీ సోనాక్షి సక్సేనా తెలిపారు.
నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. నిందితుడిని పట్టుకుని, శిక్షించి న్యాయం చేస్తామని బాలిక తల్లిదండ్రులకు పోలీసులు హామీనిచ్చారు.
దిల్లీలో 10ఏళ్ల బాలికపై..
దేశంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఓ 10ఏళ్ల బాలిక అత్యాచారానికి గురైన ఘటన తాజాగా దిల్లీలోని వికాస్పురి ప్రాంతంలో కలకలం సృష్టించింది.
Delhi rape case : 10ఏళ్ల బాలిక రేప్‌నకు గురైందన్న సమాచారంతో సోమవారం.. పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లారు. బాలికను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్సను అందించారు. ఆమె ప్రాణాలకు ప్రమాదం లేదని తెలిపారు.
కాగా.. నిందితుడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులు.. స్థానిక సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. బృందాలుగా విడిపోయి.. గాలింపు చర్యలు చేపట్టి, కొన్ని గంటల్లోనే పట్టుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, అతడిని అరెస్ట్ చేశారు.
గర్ల్‌ఫ్రెండ్ గొంతు కోసి..
ముంబైలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కదులుతున్న ఆటోలో.. ఓ వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్ గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత తాను కూడా ప్రాణాలు తీసుకోవాలని ప్రయత్నించాడు!
Mumbai crime news latest : ముంబైలోని సకినాక ప్రాంతంలో సోమవారం జరిగింది ఈ ఘటన. సంఘర్ష్ నగర్‌కు చెందిన 30ఏళ్ల పంచ్షీలా జామ్దర్, తన బాయ్‌ఫ్రెండ్ దీపక్ బోర్సేతో కలిసి ఓ ఆటో ఎక్కింది. కొద్దిసేపటికి వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. అది చాలా తీవ్రస్థాయికి చేరింది. చివరికి.. దీపక్, తన వద్ద ఉన్న పదునైన ఆయుధంతో మహిళ గొంతు కోసేశాడు. షాక్‌కు గురైన ఆటో డ్రైవర్, ఒక్కసారిగా వాహనానికి బ్రేక్ వేశాడు. బయటకు పరిగెత్తేందుకు ప్రయత్నించిన బాధితురాలు.. రెండు, మూడు అడుగులు వేసిన తర్వాత రోడ్డు మీద కుప్పకూలింది. కొన్ని క్షణాల తర్వాత ప్రాణాలు కోల్పోయింది. ఇదంతా కొన్ని క్షణాల్లోనే జరిగిపోయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం