తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Yoga In Pregnancy: ప్రెగ్నెన్సీలో ఈ 5 యోగాసనాలు చేయండి, నార్మల్ డెలివరీకి సాయం చేస్తాయి

Yoga in Pregnancy: ప్రెగ్నెన్సీలో ఈ 5 యోగాసనాలు చేయండి, నార్మల్ డెలివరీకి సాయం చేస్తాయి

25 September 2024, 10:30 IST

google News
  • Yoga in Pregnancy: మీరు ప్రెగ్నెన్సీ సమయంలో కూడా ఫిట్ గా ఉండాలనుకుంటే, అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండాలనుకుంటే ఈ ఐదు యోగాసనాలు తప్పకుండా. ఇవి గర్భధారణలో వచ్చే సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.

ప్రెగ్నెన్సీలో చేయాల్సిన యోగాసనాలు
ప్రెగ్నెన్సీలో చేయాల్సిన యోగాసనాలు (shutterstock)

ప్రెగ్నెన్సీలో చేయాల్సిన యోగాసనాలు

ప్రెగ్నెన్సీ సమయంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మొదటి త్రైమాసికంలో వాంతులు, వికారం, తలతిరడం లాంటి సమస్యలు.. చివరి మూడు నెలల్లో కాల్లలో వాపు, వెన్నునొప్పి వరకు చాలా మంది మహిళలకు ఇబ్బందులుంటాయి.  వీటన్నిటినీ ఎదుర్కోవడానికి యోగా సహాయపడుతుంది. వీటి అభ్యసన ద్వారా  ప్రెగ్నెన్సీలో ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. అంతే కాదు ప్రెగ్నెన్సీ చివరి మూడు నెలల్లో యోగా చేస్తే నార్మల్ డెలివరీ అవకాశాలు పెరిగి సిజేరియన్ అవసరాన్ని తగ్గిస్తుంది. అవేంటో చూడండి.

ప్రెగ్నెన్సీ సమయంలో యోగాసనాలు:

తాడాసనం:

తాడసనాన్ని సాధారణంగా ఎవ్వరైనా చేయవచ్చు. కానీ తాడాసనం గర్భిణీ స్త్రీలు చేయదగ్గ సులభమైన యోగాసనం. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. దీనితో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.

వీరభద్రాసనం:

ప్రెగ్నెన్సీలో వెన్నునొప్పితో బాధపడే మహిళలు తప్పకుండా వీరభద్రాసనం చేయాలి. ఈ ఆసనం చేయడం వల్ల శరీరం దృఢంగా మారడంతో పాటు జీర్ణక్రియ సమస్య కూడా తగ్గుతుంది. గర్భిణీ స్త్రీలు కనీసం ఐదు నిమిషాలు వీరభద్రాసనం చేయవచ్చు.

సుఖాసనం:

ఇది విశ్రాంతి ఇచ్చే భంగిమ. దీంతో మానసిక ప్రశాంతత పెరుగుతుంది. గర్భిణీ స్త్రీలు రోజూ సుఖాసనం యోగ సాధన చేయాలి. దీంతో ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా అనిపించడమే కాకుండా, కడుపులోని బిడ్డకు కూడా అన్ని రకాలా దోహదం చేస్తుంది. 

బద్ధకోణాసనం:

బద్ధకోణాసనం చేయడం వల్ల పాదాల కండరాలు రిలాక్స్ అవుతాయి. అలాగే, కటి ప్రాంతంలోని కండరాలను కదిలించి వాటిని బలంగా చేస్తుంది. ప్రెగ్నెన్సీ మూడవ త్రైమాసికంలో ప్రతిరోజూ ఈ ఆసనం చేయడం వల్ల నార్మల్ డెలివరీకి సహాయపడుతుంది.

వృక్షాసనం:

నిటారుగా నిలబడి కుడి తొడ మీద ఎడమ పాదం ఉంచాలి. నమస్కరించే భంగిమలో ఉండాలి. చేతులు జోడించి ఛాతీపై ఉంచి రెండు కాళ్లు మారుస్తే ముప్పై ముప్పై సెకన్లు సాధన చేయాలి. ఈ ఆసనం చేయడం వల్ల మనసు ప్రశాంతంగా అయ్యి శరీర స్థితి కూడా సక్రమంగా ఉంటుంది.

తదుపరి వ్యాసం