Yoga For Metabolism । జీవక్రియ రేటును పెంచి, బరువును తగ్గించే యోగా ఆసనాలు ఇవే!
28 November 2022, 7:58 IST
- Yoga For Metabolism: శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరిగి, మీకు శక్తి రావాలంటే, వేగంగా బరువు తగ్గాలంటే ఇక్కడ పేర్కొన్న యోగా ఆసనాలు ఆచరించండి. మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు.
Yoga For Metabolism- Bridge Pose
మనం ఏ పని చేయాలన్నా శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరగాలి. జీవక్రియ అనేది శరీరం మనం తిన్న ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియ. తిన్నది సరిగ్గా జీర్ణం కానపుడు శక్తి ఉత్పన్నం కాదు నీరసంగా అనిపిస్తుంది, మలబద్దకం సమస్య తలెత్తుతుంది. అయితే శరీరాన్ని కొంత వేడెక్కించడం ద్వారా ఈ పరిస్థితి నుంచి బయటపడవచ్చు. యోగా లోని కొన్ని శ్వాస పద్ధతులు ఆక్సిజన్ తీసుకోవడం, శరీరాన్ని వేడెక్కేలా చేసేందుకు సహయపడతాయి. ఇది జీవక్రియ వేగాన్ని పెంచుతుంది.
Yoga For Metabolism - మెరుగైన జీవక్రియ కోసం యోగాసనాలు
యోగా మన ఎండోక్రైన్ అవయవాలను ప్రేరేపిస్తుంది. అంతేకాకుండా, శరీరాన్ని సాగదీయడం, కుదించడం, మెలితిప్పడం ద్వారా కొవ్వు నిల్వలను కరిగించడానికి యోగా భంగిమలు ప్రభావంతమైనవని నిరూపితమైంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం, జీవనశైలిలో యోగాను చేర్చడం ద్వారా జీవక్రియ పెరగడమే కాకుండా, కొవ్వును వేగంగా బర్న్ చేయడంలో ఇది మీకు సహాయపడుతుంది.
వంతెన భంగిమ - Bridge Pose
దీనినే సేతుబంధ సర్వంగాసనం అని కూడా అంటారు. ఈ భంగిమలో వెన్ను లోపలికి వంగుతుంది, ఛాతీ తెరుచుకుంటుంది. శరీరాన్ని సాగదీయడం కోసం ఒక వంతెనను ఏర్పర్చినట్లు ఉంటుంది. ఈ భంగిమ ఛాతీ, మెడ, వెన్నెముక, తుంటిని సాగదీస్తుంది. వీపు, పిరుదులు, స్నాయువులను బలపరుస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఒత్తిడి, తేలికపాటి నిరాశను తగ్గించడంలో సహాయపడుతుందిఈ యోగా ద్వారా, వెన్నులో సమస్యలకు చికిత్స చేయవచ్చు, అలాగే ఇది జీవక్రియను ప్రోత్సహించే యోగా కూడా.
శలభాసన - Locust Pose
యోగా భంగిమలలోని ప్రసిద్ధ భంగిమలలో ఈ శలభాసన కూడా ఒకటి. శలభాసనాన్ని మిడతల భంగిమ అని కూడా అంటారు. ఈ భంగిమ వేసినపుడు మిడత ఆకారంలా ఉన్నట్లు ఉంటాం. ఇది యోగాలో అత్యంత ప్రభావవంతమైన బ్యాక్-బెండింగ్ ఆసనాలలో ఒకటి. డెస్క్‌లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలను ఎదుర్కోవడానికి ఈ భంగిమ ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ భంగిమ మీ వెన్నెముకకు మద్దతు ఇచ్చే వెనుక కండరాలను బలపరుస్తుంది. ఇది వెన్నునొప్పిని తగ్గించడానికి, మీరు కూర్చునే భంగిమను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే ఈ యోగాసనం జీర్ణక్రియ సమస్యలను తీర్చుతుంది. క్రమం తప్పకుండా ఈ ఆసనం అభ్యాసం చేస్తే జీవక్రియ సమస్యలను సరిచేయడంతో పాటు కేలరీలను వేగంగా బర్న్ చేయడానికి ప్రయోజనకరంగా ఉంటుంది.
సర్వంగాసనం- Shoulder Stand Pose
సర్వాంగం అనే పదానికి శరీరంలోని ప్రతి భాగం అని అర్థం. ఆసనం శరీరం చివరి స్థానం నుండి, ఇది మొత్తం శరీరంపై అనుకూలమైన ప్రభావాన్ని చూపుతుంది. అయితే ఈ భంగిమను మొదటిసారి ఆచరించేటపుడు కొన్ని భాగాలుగా ప్రయత్నించి, ఆ తర్వాత కొన్ని వారాల శిక్షణ తర్వాత మాత్రమే భంగిమను పూర్తిగా చేయాలని గట్టిగా సలహా ఇస్తారు. పేరులో సూచించినట్లుగా, ఈ సర్వంగాసన యోగా శరీరంలోని అన్ని అవయవాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జీవక్రియను పెంచి మీ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే భంగిమ. అందుకే దీనిని 'ఆసనాల రాణి' అని కూడా పిలుస్తారు.