తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Yoga Asanas To Cure Dengue : యోగాతో డెంగ్యూకి ఇలా చెక్ పెట్టేయండి..

Yoga Asanas to Cure Dengue : యోగాతో డెంగ్యూకి ఇలా చెక్ పెట్టేయండి..

01 November 2022, 8:51 IST

    • Yoga Asanas to Cure Dengue : యోగాతో ఎన్నిప్రయోజనాలుంటాయో అందరికీ తెలిసిందే. అయితే డెంగ్యూకి కూడా యోగాతో చెక్ పెట్టవచ్చు అంటున్నారు యోగా నిపుణులు. అసలే ఈ మధ్య డెంగ్యూ కేసులు ఎక్కువ అవుతున్నాయి. మీరు కూడా దానిని తప్పించుకోవాలంటే ఈ ఆసనాలు వేసేయండి మరి. 
యోగాతో ప్రయోజనాలు
యోగాతో ప్రయోజనాలు

యోగాతో ప్రయోజనాలు

Yoga Asanas to Cure Dengue : మీకు డెంగ్యూ ఉందని నిర్ధారణ అయితే చింతించకండి. మంచి పోషకాహారం, తగినంత విశ్రాంతి, కొన్ని యోగా ఆసనాలను ప్రయత్నించడం ద్వారా.. డెంగ్యూకి చెక్ పెట్టవచ్చు అంటున్నారు. వీటిని పాటిస్తే డెంగ్యూ నుంచి త్వరగా కోలుకోవడం సాధ్యమవుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అయితే డెంగ్యూ నుంచి కోలుకోవడానికి సహాయపడే యోగా ఆసనాలు ఏమిటో.. వాటిని ఎలా చేయాలో.. వాటి వల్ల కలిగే బెనిఫిట్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

దండాసనం

కూర్చున్న స్థితిలో మీ కాళ్లను ముందుకు చాచండి. మీ మడమలను, కాళ్లను కలపండి. మీ వీపును నిటారుగా ఉంచి ముందుకు చూడండి. మీ వెన్నెముకకు మద్దతుగా నేలపై మీ అరచేతులను మీ తుంటి పక్కన ఉంచండి. మీ భుజాలను రిలాక్స్​గా ఉంచండి.

దండాసనం వల్ల ప్రయోజనాలివే..

ఈ భంగిమ మీ స్నాయువులను సాగదీస్తుంది. మీ వెన్నెముకను పొడిగిస్తుంది. మీ భంగిమను మెరుగుపరుస్తుంది. మీ వీపును బలపరుస్తుంది. మీ కటి, తొడలు కండరాలను బిగుతుగా చేస్తుంది.

మలాసనం

నిటారుగా నించోండి. మీ మోకాళ్లను వంచి.. మీ మడమల మీద బరువు వేస్తూ.. కూర్చోండి. మీ పాదాలు నేలపై ఫ్లాట్‌గా ఉండేలా చూసుకోండి. మీరు మీ అరచేతులను మీ పాదాల పక్కన నేలపై ఉంచవచ్చు. లేదా దండం పెట్టవచ్చు. ఈ స్థితిలో వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోండి.

మలాసనం వల్ల ప్రయోజనాలివే

ఇది తుంటి, గజ్జలను తెరుస్తుంది. చీలమండలు, దిగువ హామ్ స్ట్రింగ్స్, వీపు, మెడను సాగదీస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పొత్తికడుపును టోన్ చేస్తుంది. మీ జీవక్రియను బలపరుస్తుంది. మీ పెల్విక్, హిప్ కీళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది.

వజ్రాసనం

నేలపై మోకరిల్లండి. మీ కటిని మీ మడమల మీద ఉంచి.. మీ మోకాళ్లు, చీలమండలను స్ట్రెచ్ చేయండి. మీ మడమలను ఒకదానికొకటి దగ్గరగా ఉంచండి. మీ అరచేతులను మీ మోకాళ్లపై లేదా మీ తొడలపై ఉంచండి. మీరు సౌకర్యవంతంగా ఉండే వరకు మీ కటిని కొద్దిగా వెనుకకు, ముందుకు సర్దుబాటు చేయండి.

వజ్రాసనంతో బెనిఫిట్స్ ఇవే

వజ్రాసనం మనస్సును ప్రశాంతంగా, స్థిరంగా ఉంచడంలో మాత్రమే కాకుండా జీర్ణ ఆమ్లత్వం, గ్యాస్ ఏర్పడటాన్ని నయం చేస్తుంది. మోకాలి నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. తొడ కండరాలను బలపరుస్తుంది. వెన్నునొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. లైంగిక అవయవాలను బలోపేతం చేయడంలో, మూత్ర సంబంధిత సమస్యల చికిత్సలో సహాయపడుతుంది.

పశ్చిమోత్తనాసనం

దండసానాతో ప్రారంభించి.. వీపు భాగం గట్టిగా ఉంటే చేతులతో పట్టుకుంటూ పాదాల చుట్టూ ఉంచాలి. మీ మోకాలు కొద్దిగా వంచి.. కాళ్లు ముందుకు సాగేలా చూసుకోండి. మీ వెన్నెముకను నిటారుగా ఉంచుతూ ముందుకు వంచండి. మీ బొటనవేళ్లను మీ వేళ్లతో పట్టుకోండి. మీ తలతో మీ మోకాళ్లను తాకండి.

పశ్చిమోత్తనాసనం వల్ల కలిగే ప్రయోజనాలు

తేలికగా అనిపించినప్పటికీ.. ముఖ్యంగా అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్న వారికి ఇది చాలా ప్రయోజనాలను అందిస్తుంది. ఇది శరీరాన్ని ప్రశాంతంగా ఉంచి.. మనస్సును రిలాక్స్‌గా ఉంచడం అనేది ఒక ప్రధాన ఆరోగ్య ప్రయోజనాల్లో ఒకటి. ఇది తలకు రక్తాన్ని ప్రసరింపజేయడంలో సహాయపడుతుంది. తద్వారా మనస్సుకు విశ్రాంతినిస్తుంది. నిద్రలేమి, నిరాశ, ఆందోళనను తగ్గిస్తుంది.