Workouts for Women : టోన్డ్ బాడీ కావాలంటే.. ఈ వర్కౌట్లు చేయండి..
08 October 2022, 9:19 IST
- Workouts for Women : శరీర బరువు తగ్గడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వ్యాయామాలు చేస్తాము. అయితే మహిళలు కొన్ని వర్కౌట్లు చేయడం వల్ల సన్నగా, టోన్డ్ బాడీని పొందవచ్చు అంటున్నారు ఫిట్నెస్ నిపుణులు. అయితే వాటికోసం కొన్ని రొటీన్ని ప్రయత్నించండి.
టోన్డ్ బాడీ కోసం ఈ వ్యాయామాలు చేయండి
Workouts for Women : బరువు తగ్గడానికి, మీకు కావలసిన టోన్డ్ బాడీని పొందడానికి స్మార్ట్ మార్గాల్లో మీ శిక్షణ నియమాన్ని మార్చుకోండి. వ్యాయామ నియమావళికి బాగా ప్రణాళికాబద్ధమైన, వ్యూహాత్మకమైన విధానంమే సన్నగా, ఫిట్ బాడీని సాధించడానికి గొప్ప మార్గం. మీ శరీరాన్ని టోన్ చేసే, ఫిట్‌నెస్‌ను మెరుగుపరిచే వ్యాయామాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము.
రన్ చేయండి..
రన్నింగ్/జాగింగ్ వంటి శారీరక వ్యాయామం జీవన నాణ్యత, ఆత్మగౌరవం, మానసిక ఆరోగ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. క్రమం తప్పకుండా రన్నింగ్ చేయడం వలన మీరు దృఢమైన టోన్డ్, ఫిట్ బాడీని పొందుతారు.
Lunges చేయండి..
మీ శరీరాన్ని పరిరక్షించే, టోన్ చేసే వ్యాయామాలలో Lunges ఒక భాగం. ఇది ఫంక్షనల్ మొబిలిటీని ప్రోత్సహిస్తుంది. మీ కాళ్లను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.
పుష్-అప్స్
పుష్-అప్‌లు ఒక అద్భుతమైన పూర్తి-శరీర వ్యాయామం. ఇది మీ ఎగువ శరీరం, కోర్ బలానికి ప్రాధాన్యతనిస్తుంది. దాదాపు మీ అన్ని కండరాలకు శిక్షణనిస్తుంది.
స్క్వాట్స్
స్క్వాట్స్ చేయడం ద్వారా మీరు బరువు తగ్గవచ్చు. ఎందుకంటే అవి కేలరీలను బర్న్ చేస్తాయి. అదనంగా అవి మోకాలి, చీలమండ గాయాల సంభావ్యతను తగ్గిస్తాయి. ఎయిర్ స్క్వాట్‌లు, సైడ్-స్టెప్ స్క్వాట్‌లు, సుమో స్క్వాట్‌లు, లీప్ స్క్వాట్‌లు, వెయిటెడ్ స్క్వాట్‌లు చేయవచ్చు.
బర్పీస్
బర్పీస్ తీవ్రమైన, ప్లైయోమెట్రిక్ వ్యాయామం.. ఏదైనా వ్యాయామాన్ని ముగించడానికి అద్భుతమైన మార్గం. ఎందుకంటే ఇది హృదయ స్పందన రేటును పెంచుతుంది. మీ శరీరాన్ని బలపరుస్తుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు మెరుగ్గా, చురుకుగా ఉంటారు. మీరు క్రమం తప్పకుండా బర్పీలు చేస్తే మీరు మంచి అనుభూతిని పొందుతారు. మీ శరీరం త్వరగా టోన్డ్ అవుతుంది.