తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Extramarital Affairs : వివాహం తర్వాత పక్కచూపులు చూడటం ఎందుకు పెరుగుతుంది?

Extramarital Affairs : వివాహం తర్వాత పక్కచూపులు చూడటం ఎందుకు పెరుగుతుంది?

Anand Sai HT Telugu

15 March 2024, 12:30 IST

google News
    • Extramarital Affairs Increase : వివాహేతర సంబంధాలతో జీవితాలు నాశనం అవుతున్నాయి. కుటుంబాలు రోడ్డు మీదకు వస్తున్నాయి. ఓ సర్వే ప్రకారం ఇండియాలో వివాహేతర సంబంధాలు పెరుగుతున్నాయట.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Unsplash)

ప్రతీకాత్మక చిత్రం

కొందరు వివాహేతర సంబంధాలతో కుటుంబాన్ని నాశనం చేస్తున్నారు. కొన్ని కారణాలతో ఇలాంటి సంబంధాలు పెట్టుకుంటున్నారు. దీంతో రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి వస్తుంది. దాంపత్య జీవితంలో ఏమాత్రం అసంతృప్తి ఉన్నా వెంటనే పక్కచూపులు అనేది ఇప్పుడు సాధారణమైపోయింది. ఈ విషయం కుటుంబం మీద ఎలాంటి ప్రభావం చూపుతుందని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఫలితంగా అక్రమ సంబంధాలు పెరిగిపోవడమే కాకుండా పలు సందర్భాల్లో హత్యలకు కూడా దారితీస్తున్నాయి. అసలు అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి గల కారణాలేంటి అనే అంశానికి అనేక కారణాలు ఉన్నాయి.

విడాకులు కామన్

భారతీయులు వివాహేతర సంబంధాలను ఎక్కువగా అంగీకరిస్తున్నట్లు తాజా సర్వేలు చెబుతున్నాయి. ఈ రోజుల్లో భారతదేశంలో వివాహాన్ని శాశ్వతమైన బంధంగా చూడడం లేదు. దంపతులు సంతోషంగా లేకుంటే విడాకులు తీసుకోవడం కామన్ అయిపోయింది. కొన్ని కారణాల వల్ల చాలా మంది ఇతర వ్యక్తులతో సంబంధం కలిగి ఉండాలనుకుంటున్నారని ఒక సర్వే కనుగొంది.

మోసం చేయెుచ్చట

25, 50 సంవత్సరాల మధ్య వయస్సు గల 1500 మంది వివాహిత భారతీయులపై జరిపిన సర్వేలో కొందరు ఒక వ్యక్తితో కలిసి ఉండటం జీవితకాలం సరిపోతుందని విశ్వసిస్తున్నారు. 44 శాతం మంది ఒకరి కంటే ఎక్కువ మందిని ప్రేమించడం సాధ్యమవుతుందని చెబుతున్నారు. 55 శాతం మంది తమ జీవిత భాగస్వామితో కాకుండా మరొకరితో లైంగిక సంబంధం కలిగి ఉండాలని కోరుకుంటున్నారట. అందులోనే 37 శాతం మంది ప్రేమలో ఉన్నప్పుడు కూడా మోసం చేయడం సాధ్యమేనని నమ్ముతారు.

నిర్లక్ష్యం కూడా కారణం

సర్వే ప్రకారం 23 శాతం మంది వ్యక్తులు తమ భాగస్వామిని నిర్లక్ష్యం చేసినట్లు భావిస్తే వారిని మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. 32 శాతం మంది వ్యక్తులు తమ భాగస్వామి నుండి లైంగిక సంతృప్తి లోపంతో ఇలా చేస్తారు. సంబంధాలలో అపనమ్మకం తలెత్తడంతో కూడా కొందరు పక్కచూపులు చూస్తున్నారు. భావోద్వేగ, శారీరక రెండింటిలో కమ్యూనికేషన్ లేకపోవడం విజయవంతమైన సంబంధానికి అతిపెద్ద అడ్డంకులలో ఒకటి. 31 శాతం మంది వయస్సు లేదా సంబంధ స్థితితో సంబంధం లేకుండా ఆకర్షణీయంగా, కావాల్సిన అనుభూతిని కోరుకుంటున్నారు.

వివాహేతర సంబంధానికి కారణాలు

భార్యాభర్తల నడుమ సంతృప్తికరమైన శృంగారం లేకపోవడం ప్రధాన కారణంగా చెప్పవచ్చు. పడక గదిలో తన భర్త లేదా భార్య ద్వారా సంతృప్తి పొందలేని స్త్రీ లేదా పురుషుడు ఈ తరహా సంబంధాలపై ఆసక్తి చూపిస్తున్నారు. శృంగారంలో తన శరీర అందాలను పురుషుడు అసహ్యించుకుంటే ఆ స్త్రీ అతడితో శృంగారం చేసేందుకు ఇష్టపడదు. దీంతో పరాయి వారి వైపు చూస్తారని సర్వేలు చెబుతున్నాయి.

వివాహమైన కొత్తలో బాగా అలంకరించుకుని వచ్చే స్త్రీ.. తర్వాత రోజులు గడిచే కొద్ది తన అలంకరణపై శ్రద్ధ చూపకపోవడం వలన కూడా కొందరు పురుషులు పక్కచూపులు చూస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. పెళ్లికి ముందు తన మనసుల్లో ఉండే శృంగార కోరికలను పెళ్లైన తర్వాత పూర్తిగా విస్మరించడం కూడా మరో కారణంగా చెప్పవచ్చు. వివాహానికి ముందు ఉండే సంబంధాన్ని తర్వాత కూడా కొనసాగించాలనుకోవడం మరో కారణం.

వివాహానికి ముందు తనకు రాబోయే భాగస్వామిపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వివాహం తర్వాత ఆ గుణగణాలు లేకపోవడంతో ఇతరులకు కొందరు ఆకర్శితులవుతుంటారు. దీంతో పరాయి వారి దగ్గరకు వెళ్తారు.

పెళ్లైన కొత్తలో ఉన్న ప్రేమ తర్వాత చూపించకపోవడం కూడా వివాహేతర సంబధానికి అసలు కారణంగా ఉంది. మెుదట్లో ప్రేమగా ఉండి.. తర్వాత ప్రేమ తగ్గితే చాలా మంది ఇతరులకు ఆకర్శితులవుతుంటారు. దీంతో కుటుంబంలో చీలికలు వస్తాయి. ఏదిఏమైనప్పటికీ వివాహేతర సంబంధాలు అనేవి అస్సలు మంచివి కావు. కుటుంబం మెుత్తం రోడ్డు మీదకు రావాల్సిన పరిస్థితులు వస్తాయి.

తదుపరి వ్యాసం