తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Psoriasis Causes: సొరియాసిస్ ఎవరికి వస్తుంది? ఎందుకు వస్తుంది? ఇది వారసత్వంగా వచ్చే వ్యాధా?

Psoriasis Causes: సొరియాసిస్ ఎవరికి వస్తుంది? ఎందుకు వస్తుంది? ఇది వారసత్వంగా వచ్చే వ్యాధా?

Haritha Chappa HT Telugu

24 May 2024, 14:35 IST

google News
    • Psoriasis Causes: సొరియాసిస్ అనేది ఒక చర్మవ్యాధి. ఒక్కసారి వస్తే జీవితాంతం వెంటాడుతుంది. సొరియాసిస్ ఎవరికి వస్తుందో, ఎలాంటి లక్షణాలను చూపిస్తుందో తెలుసుకోండి.
సొరియాసిస్ ఎందుకు వస్తుంది?
సొరియాసిస్ ఎందుకు వస్తుంది?

సొరియాసిస్ ఎందుకు వస్తుంది?

Psoriasis Causes: మన శరీరానికి చర్మం చాలా ముఖ్యం. ఇది నాలుగు పొరలుగా ఉంటుంది. చర్మం ఎంత ఆరోగ్యంగా ఉంటే మనిషి అంత అందంగా కనిపిస్తాడు. చర్మానికి వచ్చే వ్యాధుల్లో సోరియాసిస్ ఒకటి. ఇది ప్రాణాంతకమైనది కాదు, కానీ చాలా చికాకును కలిగిస్తుంది. జీవితాంతం వెంటాడుతుంది. అంద విహీనంగా చేస్తుంది. తెల్లటి పొలుసులు, లేత గులాబీ రంగు పొలుసులు, ఎర్ర రంగు మచ్చలతో చూడటానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. దురద, నొప్పి వంటి లక్షణాలు కూడా ఉంటాయి.

సొరియాసిస్ శరీరంలో ఎక్కడైనా రావచ్చు. కొంతమందికి తలపైన ఉన్న మాడుపై అధికంగా వస్తుంది. అక్కడ నుంచి ఎక్కడైనా సోకే అవకాశం ఉంది. కొందరికి గోళ్ళ మీద వచ్చి గోళ్లు ఊడిపోతాయి. మెడ, చేతులు,తొడలు మీద ఈ పొలుసులు కనిపిస్తూ ఉంటాయి. వీటికి జీవితాంతం మందులు వాడుతూనే ఉండాలి.

సొరియాసిస్ ఎందుకు వస్తుంది?

సొరియాసిస్ సోకిన వారిలో ఎక్కువ మందికి ఇదే సందేహం వస్తుంది. వైద్యులు ఈ సొరియాసిస్ రావడానికి కారణాన్ని ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు. ఇది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధిగానే చెబుతారు. అంటే మన రోగనిరోధక శక్తి మన చర్మ కణాల మీదే దాడి చేస్తే వచ్చే వ్యాధి ఇది. సొరియాసిస్ వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. అయితే కచ్చితంగా రావాలని కూడా లేదు, కొందరికి రాకపోవచ్చు. ఇది వయసుతో సంబంధం లేకుండా బయటపడుతుంది. మనదేశంలో దాదాపు పిల్లలు, పెద్దలు కలిపి సుమారు మూడు కోట్ల మంది సొరియాసిస్‌తో బాధపడుతున్నారు.

ఇలా జాగ్రత్తలు తీసుకోండి

సొరియాసిస్ బారిన పడినవారు జీవితాంతం మందులు వాడుతూనే ఉండాలి. మందులు వాడుతూ రోజువారీ జీవితాన్ని సంతోషంగా గడవవచ్చు. మందులు వాడడం వల్ల సొరియాసిస్ అదుపులోనే ఉంటుంది. కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే వారికి ఎలాంటి సమస్యలు రావు. ముఖ్యంగా సొరియాసిస్ అంటువ్యాధి కాదు. ఒకరి నుంచి ఒకరికి వ్యాపించదు. అలాగే సొరియాసిస్ ఉన్నా కూడా సంతోషంగా పెళ్లి చేసుకొని, పిల్లల్ని కనవచ్చు. పునరుత్పత్తి సమస్యలు ఏవీ రావు. అయితే ఊబకాయం ఉన్నవారు మాత్రం త్వరగా బరువు తగ్గాలి. అలాగే మధుమేహం ఉంటే దాన్ని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆహారపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సొరియాసిస్‌తో బాధ పడేవారు పూర్తిగా శాఖాహారాన్ని తింటే ఉత్తమం. మాంసాన్ని తినాల్సి వస్తే చాలా తక్కువగా తినాలి. చేపలు తింటే మంచిది. అలాగే పాలు, పనీర్ వంటివి తక్కువగా తీసుకోవాలి. పెరుగును తినవచ్చు.

ఆల్కహాల్, ధూమపానం అంటే అలవాట్లు ఉన్నవారు వెంటనే వాటిని మానేయాలి వాటి వల్ల సొరియాసిస్ సమస్య మరింతగా పెరుగుతుంది అలాగే వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి రోజు వారి వ్యాయామం చేయడం వల్ల సోరియాసిస్ అదుపులో ఉంటుంది గాయాలు దెబ్బలు ఒంటరి తగిలితే త్వరగా తగ్గదు కాబట్టి అవి తగలకుండా జాగ్రత్తపడాలి ఎప్పుడూ వేడి నీటితో స్నానం చేయకూడదు పోలీసులు మీద గట్టిగా గోకడం వంటిది చేయొద్దు పులుసుల్ని లాగడం వంటివి చేస్తే కొత్తగా వస్తూనే ఉంటాయి ముఖ్యంగా మచ్చలు ఏర్పడే ప్రమాదం ఎక్కువ

రోజుకు పావుగంటసేపు శరీరానికి ఎండ తగిలేలా చూసుకోవాలి లేదా సాయంత్రం ఎండ అయితే మంచిది తీవ్రమైన ఎండలోకి వెళితే వారు తట్టుకోలేరు అలాగే మానసిక ఒత్తిడి ఎంతగా తగ్గించుకుంటే అంత మంచిది సోరియాసిస్ గురించి ఆలోచించడమే మానేయాలి మందులు వాడుతూ సంతోషంగా ఉండాలి వంటికి చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది

తదుపరి వ్యాసం