తెలుగు న్యూస్ / ఫోటో /
Tomato Flu | చిన్నారులకు టొమాటో ఫ్లూ ముప్పు.. ఈ అంటువ్యాధిని ఇలా నివారించవచ్చు!
- టొమాటో ఫ్లూ లేదా టొమాటో జ్వరం ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. సాధారణ జలుబు లక్షణాలు ఉన్న వ్యక్తికి సన్నిహితంగా మెలిగే వ్యక్తులకు వ్యాపిస్తుంది. పిల్లలకు డైపర్ మార్చే సందర్భాల్లోనూ వ్యాపించవచ్చునని డాక్టర్ రాజీవ్ జయదేవన్ తెలిపారు. టొమాటో ఫ్లూకు సంబంధించి కొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకోండి.

(1 / 6)
ఒకవైపు కరోనావైరస్, మంకీ పాక్స్ సమస్యలు ఇబ్బంది పెడుతున్న సమయంలోనూ కొత్త టొమాటో ఫ్లూ లేదా టొమాటో ఫీవర్ కేసులు కేరళ, ఒడిశా రాష్ట్రాలలో వెలుగుచూశాయి. ఇప్పటి వరకు 82 మంది చిన్నారులకు ఈ వ్యాధి సోకినట్లు సమాచారం. ఇది సోకితే చేతులు, పాదాలు, పిరుదులపై దద్దుర్లు కనిపిస్తాయి . నోటిలో పూతలు ఏర్పడవచ్చు.(File Image (Representative Image))
(2 / 6)
ఈ అరుదైన వైరల్ ఇన్ఫెక్షన్ లక్షణాలు పరిశీలిస్తే అధిక జ్వరం, ఒళ్లు నొప్పులు, కీళ్ల వాపు, అలసట. వికారం, వాంతులు, విరేచనాలు, డీహైడ్రేషన్, కీళ్ళలో వాపు వంటివి ఉంటాయి.(File Image (Representative Image))
(3 / 6)
టొమాటో ఫ్లూ పేగు వైరస్ కారణంగా చిన్నారులకు వస్తుంది. అయితే పెద్ద వారిలో తట్టుకునే శక్తి ఉంటుంది కాబట్టి ఇది పెద్దలకు సోకడం చాలా అరుదు.(Reuters)
(4 / 6)
లక్షణాలు వ్యక్తికి వ్యక్తికి మధ్య భిన్నంగా ఉండవచ్చు. వైరస్ రకాన్ని బట్టి లక్షణాలు మారుతూ ఉంటాయి. ఇది చేతులు, పాదాలు, నోటికి సంబంధించిన వ్యాధిలాగా అనిపిస్తోంది. ఏది ఏమైనా నిర్లక్ష్యంగా ఉండకూడదు అని సర్ గంగారామ్ ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ధీరేన్ గుప్తా అన్నారు.(Unsplash)
(5 / 6)
చేతులు కడుక్కోవడం, ప్రాథమిక పరిశుభ్రత చర్యలు పాటిస్తే ఈ టొమాటో ఫ్లూ వ్యాపించకుండా నివారించవచ్చు. ఒకవేళ ఈ వ్యాధి సోకితే లక్షణాలకు అనుగుణంగా చికిత్స చేస్తే సరిపోతుంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని మరొక డాక్టర్ రాజీవ్ పేర్కొన్నారు.(Unsplash)
ఇతర గ్యాలరీలు