Tomato Flu:మరో కొత్త రోగం.. భయపెడుతున్న టోమాటో ఫ్లూ.. మీ పిల్లలు జాగ్రత్త!-what is tomato flu causes symptoms and treatment ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tomato Flu:మరో కొత్త రోగం.. భయపెడుతున్న టోమాటో ఫ్లూ.. మీ పిల్లలు జాగ్రత్త!

Tomato Flu:మరో కొత్త రోగం.. భయపెడుతున్న టోమాటో ఫ్లూ.. మీ పిల్లలు జాగ్రత్త!

HT Telugu Desk HT Telugu
Jul 28, 2022 09:25 PM IST

మంకీపాక్స్ భయాలు వీడక ముందే ఇక టొమాటో ఫ్లూ భారతదేశంలో వేగంగా వ్యాపిస్తోంది. కేరళలో 80కి పైగా టొమాటో ఫ్లూ కేసులు నమోదయ్యాయి. టొమాటో జ్వరంలో ప్రాథమిక లక్షణాల్లో ఎరుపు రంగులో దద్దుర్లు వస్తుంటాయి.

<p>Tomato Flu</p>
Tomato Flu

కోవిడ్-19 ‌భయాలు ఇంకా తొలగకముందే కొత్త, కొత్త వ్యాధులు ప్రపంచానికి భయపెడుతున్నాయి. ఇప్పుడిప్పుడే ప్రపంచం నెమ్మదిగా సాధారణ స్థితికి రావడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మంకీపాక్స్ కలవరపెడుతుంది. దీంతో పాటు టొమాటో ఫ్లూ కూడా చాప నీరులా విజృభిస్తోంది. వీటితో ఇతర సీజనల్ అంటువ్యాధులు, వైరస్లు వ్యాపిస్తున్నాయి. మంకీపాక్స్ భయాలు వీడక ముందే ఇక టొమాటో ఫ్లూ భారతదేశంలో వేగంగా వ్యాపిస్తోంది. కేరళలో 80కి పైగా టొమాటో ఫ్లూ కేసులు నమోదయ్యాయి. టొమాటో జ్వరంలో ప్రాథమిక లక్షణాల్లో ఎరుపు రంగులో దద్దుర్లు వస్తుంటాయి. ఈ దద్దుర్లు తరచుగా బొబ్బలుగా మారి, పొక్కులు పెద్దవిగా మారతాయి. ఈ దద్దుర్లు టమోటాను పోలి ఉంటాయి.

టొమాటో జ్వరం అంటే ఏమిటి?

దీనిని టొమాటో జ్వరం లేదా టొమాటో ఫ్లూగా అని కూడా పిలుస్తారు, ఇది ఒక సాధారణ జ్వరం, 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు వ్యాధి బారిన పడతారు. ఫ్లూ పిల్లల శరీరంపై బొబ్బలు కలిగిస్తాయి. ఇవి టమోటాలను పోలి ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్ అంత తీవ్రమైనది కాకపోయినప్పటీకి, ఇది అంటువ్యాధి.

టొమాటో జ్వరానికి కారణాలు

ఇది పేగు వైరస్‌ల వల్ల సంభవిస్తుంది

డెంగ్యూ లేదా చికున్‌గున్యా

టొమాటో జ్వరం లక్షణాలు

ఎర్రటి బొబ్బలు

జ్వరం

దద్దుర్లు

చర్మంపై దురద

డీహైడ్రేషన్

అలసట

అసౌకర్యం

అతిసారం

దగ్గు

జలుబు, దగ్గు

ఒళ్ళు నొప్పులు

టొమాటో జ్వరం చికిత్స

విశ్రాంతి తీసుకోవాలి. పుష్కలంగా నీరు త్రాగాలి. బొబ్బలు గోకకూడదు. పరిశుభ్రంగా ఉండాలి. వ్యాధి సోకిన పిల్లలు చల్లటి నీటితో స్నానం చేయాలి. చర్మాన్ని చికాకు నుండి ఉపశమనానికి పొందడానికి స్నానం చేసిన తర్వాత ఔషదం రాయాలి. వ్యాధి సోకిన పిల్లలు ఉప్పు, కారంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి. డాక్టర్ సూచించిన మందులను తప్పనిసరిగా పాటించాలి.

వ్యాధి బారిన పడకుండా ఎలా నివారించాలి?

వ్యాధి సోకిన పిల్లల నుండి దూరం పాటించాలి. టొమాటో ఫ్లూ ఉన్న వారితో కాంటక్ట్‌లో ఉండకూడదు. వారు వాడిన పాత్రలు, బట్టలు, ఇతర వస్తువులను ఉపయోగించకూడదు. మీ పిల్లలలో టొమాటో ఫ్లూ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

Whats_app_banner

సంబంధిత కథనం