తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Coconut Oil For Skin : చర్మానికి కొబ్బరి నూనె వాడితే కలిగే ప్రయోజనాలు తెలుసా?

Coconut Oil For Skin : చర్మానికి కొబ్బరి నూనె వాడితే కలిగే ప్రయోజనాలు తెలుసా?

Anand Sai HT Telugu

19 November 2023, 16:15 IST

google News
    • Coconut Oil For Skin In Winter : కొబ్బరి నూనెలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మొటిమల నివారణకు సహాయపడతాయి. లారిక్, క్యాప్రిక్ యాసిడ్స్ మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను చంపే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల కొబ్బరి నూనె చర్మానికి వాడితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
కొబ్బరి నూనె
కొబ్బరి నూనె

కొబ్బరి నూనె

కొబ్బరి నూనె(Coconut Oil) చర్మాన్ని హానికరమైన సూక్ష్మజీవుల నుండి రక్షిస్తుంది. కొబ్బరి నూనెలో ఉండే లారిక్, క్యాప్రిక్ యాసిడ్స్ వంటి కొవ్వు ఆమ్లాలు వాటి యాంటీమైక్రోబయల్ లక్షణాల వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి మన చర్మంపై పెరిగే హానికరమైన సూక్ష్మజీవులను నాశనం చేస్తాయి. మొటిమలు, ఫోలిక్యులిటిస్, సెల్యులైటిస్ వంటి చర్మ ఇన్ఫెక్షన్లు శిలీంధ్రాలు, బ్యాక్టీరియా వల్ల కలుగుతాయి.

పొడి, పగిలిన చర్మానికి కొబ్బరి నూనె(Coconut Oil For Skin) అత్యంత ప్రభావవంతమైన మాయిశ్చరైజర్. కొబ్బరి నూనె చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది. తేమను బాగా నిలుపుకోవడంలో ఉపయోగపడుతుంది. పొడిబారిన చర్మానికి(Dry Skin) కొబ్బరినూనె చక్కని రెమెడీ. కొబ్బరి నూనె మొటిమల చికిత్సకు సహాయపడుతుంది.

కొబ్బరి నూనెలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మొటిమల నివారణకు సహాయపడతాయి. ఇందులోని లారిక్, క్యాప్రిక్ యాసిడ్స్ మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను చంపే సామర్థ్యంతో ఉంటాయి. మన శరీరంలో యాంటీఆక్సిడెంట్లు, కొల్లాజెన్ స్థాయిలను పెంచే సామర్థ్యం కొబ్బరి నూనెకు ఉంది. కొబ్బరి నూనె చర్మ మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.

చర్మానికి కొబ్బరి నూనె యొక్క మరొక ప్రయోజనం ఏంటంటే ఇది యాంటీఆక్సిడెంట్ స్థితిని మెరుగుపరచడం ద్వారా మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. కొబ్బరి నూనె చర్మంపై నల్ల మచ్చలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. మీ చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి కొబ్బరి నూనెను స్నానానికి ముందు లేదా తర్వాత అప్లై చేయవచ్చు. మీ మెడ నుండి నూనెను రుద్దుతూ.. మోచేతులు, మోకాళ్లు, చేతులు, కాళ్లు వంటి పొడి ప్రాంతాల్లో నూనెను రాయండి. మీ మేకప్‌ను తొలగించడానికి కొబ్బరి నూనెను కూడా ఉపయోగించవచ్చు. అలాగే చలికాలంలో లిప్ బామ్‌గా కూడా వాడొచ్చు.

1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను మీ అరచేతిలో వేసి మీ ముఖం, మెడపై సున్నితంగా మసాజ్ చేయండి. తర్వాత టిష్యూ పేపర్‌తో ముఖంపై ఉన్న నూనెను తుడవండి. రాత్రిపూట ఇలా చేస్తే మంచిది. కొబ్బరి నూనెను మీ ముఖానికి మాత్రమే కాదు.. శరీరంలోని ఇతర భాగాలకు కూడా పూయవచ్చు. మీకు జిడ్డు చర్మం ఉన్నట్లయితే రాత్రిపూట చర్మానికి నూనె రాయాల్సిన అవసరం లేదు.

తదుపరి వ్యాసం