చలికాలంలో మీ చర్మం పొడిబారి, పగులుతోందా? ఈ టిప్స్ ట్రై చేయండి

Photo: Pexels

By Chatakonda Krishna Prakash
Nov 14, 2023

Hindustan Times
Telugu

చలికాలంలో చర్మంపై ఉన్న తేమ (మాయిశ్చర్) త్వరగా పోతుంది. దీంతో చర్మం పొడిబారడం, పగలడం లాంటివి జరుగుతాయి. అందుకే చర్మాన్ని తేమగా ఉంచుకోవాలి. అలా చర్మాన్ని తేమగా ఉంచునేందుకు 5 మార్గాలు ఇవే.

Photo: Pexels

చలికాలంలోనూ తప్పనిసరిగా తరచూ సరిపడా నీరు తాగాలి. అలాగే, ఫ్రూట్, వెజిటెబుల్ జ్యూస్ లాంటివి తీసుకోవాలి. దీంతో చర్మం పొడిబారకుండా ఇవి తోడ్పడతాయి.

Photo: Pexels

చలికాలంలో వేడినీటితో ఎక్కువ సేపు స్నానం చేయకూడదు. వేడి నీటిని స్నానం చేస్తే తొందరగా ముగించేయాలి. ఎందుకంటే చర్మంలోని తేమను వేడి నీరు తొలగించేస్తుంది. దీంతో చర్మం పొడిబారి.. పగిలే అవకాశాలు ఉంటాయి.

Photo: Pexels

చలికాలంలో తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేయాలి. ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఏ పుష్కలంగా ఉండే వాటిని మీ ఆహారంలో తీసుకోవాలి. దీని వల్ల చర్మానికి మేలు జరుగుతుంది.

Photo: Pexels

చలికాలమైనా సరే ఎండలోకి వెళ్లే ముందు చర్మానికి సన్‍స్క్రీన్ పూసుకోవడం చాలా మేలు. ఇవి రాసుకోవడం వల్ల చర్మం తేమగా ఉంటుంది.

Photo: Pexels

స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజర్ లోషన్ లేదా బాడీ ఆయిల్‍ను మీ శరీరమంతా పూసుకోండి. దీంతో తేమను మీ చర్మంలోనే ఉంచేందుకు ఇవి తోడ్పడతాయి.

Photo: Pexels

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels