చాలా మందికి కాఫీ అంటే చాలా ఇష్టం. అయితే అందులో రెండు స్పూన్ల కొబ్బరి నూనె వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది
Unsplash
By Anand Sai Oct 31, 2023
Hindustan Times Telugu
కాఫీలో కొబ్బరి నూనెను వేసుకొని తాగడాన్ని బుల్లెట్ కాఫీ అని కూడా అంటారు.
Unsplash
ప్రతిరోజు ఉదయం పూట ఒక కప్పు కాఫీలో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను కలుపుకొని తాగడం వల్ల శరీరానికి రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Unsplash
ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్, గుండె జబ్బులు, ఇతర ప్రమాదకరమైన వ్యాధులు రాకుండా ఉపశమనం కలిగిస్తాయి.
Unsplash
కాఫీ కొబ్బరి నూనె మిక్స్ చేసుకొని తాగడం వల్ల శరీరంలోని రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీంతోపాటు బ్యాక్టీరియా కూడా సులభంగా నశిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Unsplash
దీనితో మెదడు కూడా సులభంగా మెరుగుపడుతుంది. ఏకాగ్రత పెరిగి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మెదడులోని నరాలను దృఢంగా ఉంచేందుకు సహాయపడుతుంది.
Unsplash
జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్న వారు కాఫీ కొబ్బరి నూనె కలిపి తీసుకుంటే మలబద్ధకం సమస్య పూర్తిగా నయం అవుతుంది. ఇందులో ఉండే గుణాలు డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి కూడా ప్రభావంతంగా సహాయపడతాయి.
Unsplash
రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రించి ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా శరీరాన్ని రక్షించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. కాఫీ, కొబ్బరి నూనె డిప్రెషన్‌ను తగ్గించి మానసిక స్థితిని కూడా మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది.
Unsplash
డిజిటల్ డీటాక్స్ : రోజంతా స్క్రీన్స్‌కి అతుక్కుపోతున్నారా? ఇలా రిఫ్రెష్ అవ్వండి..