తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Meal Timings । వేళకు తింటున్నారా? రాత్రి భోజనం, అల్పాహారంకు మధ్య ఉండాల్సిన వ్యవధి ఇదీ!

Meal Timings । వేళకు తింటున్నారా? రాత్రి భోజనం, అల్పాహారంకు మధ్య ఉండాల్సిన వ్యవధి ఇదీ!

HT Telugu Desk HT Telugu

29 April 2023, 21:09 IST

    • Meal Timings: వేళకు భోజనం చేయడం ద్వారా పగలు హుషారుగా ఉండవచ్చు, రాత్రి హాయిగా నిద్రపోవచ్చు, ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండవచ్చు. భోజనం చేసేందుకు ఉత్తమ సమయం చూడండి.
Meal Timings
Meal Timings (istcok)

Meal Timings

Meal Timings:మనం రోజూ ఏం తింటాము, ఎంత తింటాము, ఏ సమయంలో తింటాము.. ఈ మూడు అంశాలు నేరుగా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఆహారంలోని పోషక విలువలను దృష్టిలో ఉంచుకుని వేళకు భోజనం చేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. సరైన సమయంలో తీసుకునే భోజనం జీవక్రియపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అధిక బరువు పెరగటం మొదలుకొని, ఆసిడిటీ వంటి జీర్ణ సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే వేళకు భోజనం చేయడం కీలకం. కొంతమంది రాత్రి భోజనం మానేస్తారు, మరికొంత మంది ఉదయం అల్పాహారం వదిలేస్తారు. ఫలితంగా భోజన సమయాల్లో మార్పులు వస్తాయి. ఆకలి కారణంగా ఎక్కువగా తినేస్తే లేదా చిరుతిళ్లకు అలవాటు పడితే అది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెంచడానికి కారణం అవుతుంది. ఇది దీర్ఘకాలం పాటు కొనసాగితే మధుమేహం సమస్యకు దారితీస్తుంది.

జీవనశైలిలో అవాంతరాల కారణంగా, చాలా మందికి భోజనం సమయాలు సర్దుబాటు చేయడం కష్టంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో వేళకు భోజనం చేయాలని తెలుసుకోవడంపై శరీర సంకేతాలను గమనించాలి. గ్రెలిన్ హార్మోన్ మన ఆకలిలో ప్రత్యేక పాత్రను కలిగి ఉంది, ఈ హార్మోన్ మీ మెదడుకు మీరు ఆకలితో ఉన్నారని, ఇది తినడానికి సమయం అని సూచిస్తుంది. కాబట్టి ఆకలితో ఉన్నప్పుడు కడుపు మాడ్చుకోకుండా కొద్ది మొత్తంలో అయినా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Avoid Late Night Dinners- ఆలస్యంగా భోజనంతో నిద్ర చెదిరిపోతుంది

మన శరీరం సిర్కాడియన్ వ్యవస్థ లేదా అంతర్గత జీవ గడియారంపై ఆధారపడి ఉండే మెకానిజంపై పనిచేస్తుంది. సిర్కాడియన్ వ్యవస్థ పగటివేళలో మీ ఉత్పాదకతను, రాత్రివేళలో మీ నిద్రకు ప్రేరేపిస్తుంది. అసమయ భోజన సమయాల వలన జీవ గడియారం లయ తప్పుతుంది. ఇది నిద్రను కూడా ప్రభావితం చేస్తుంది. ఆలస్యంగా భోజనం చేయడం వలన నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి. తద్వారా పగటివేళ మీ పనితీరు మందగించి మీ ఉత్పాదకత తప్పిపోతుంది.

Best Time to Eat- తినడానికి సరైన సమయం ఏది?

జీవగడియారం సక్రమంగా పనిచేయాలంటే రాత్రి త్వరగా పడుకోవడం, ఉదయం త్వరగా మేల్కోవడం అలవాటు చేసుకోవాలి. రాత్రి త్వరగా భోజనం చేసినపుడు త్వరగా నిద్రపోగలుగుతారు. రాత్రి నుంచి ఉదయం వరకు మీ రెండు భోజనాలకు మధ్య వ్యవధి 12 గంటలకు మించి ఉండకూడదు. రాత్రి నిద్రపోయిన తర్వాత మీరు ఉదయం వరకు ఉపవాసంలోనే ఉన్నట్లు అర్థం చేసుకోవాలి. ఈ స్థితిలో మీరు మీరు రాత్రి 8 గంటలకు మీ రాత్రి భోజనం చేస్తే, మీరు మీ తదుపరి భోజనం అంంటే మీ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ 8-9 మధ్య ముగించాలి. ఎట్టి పరిస్థితుల్లో అల్పాహారం చేయకుండా ఉండరాదు.

ఈ అలవాటును ప్రతిరోజూ పాటించటం వలన మీరు వేళకు నిద్రపోగలుగుతారు, మీరు తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం అవుతుంది. మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు.