తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Night Time Foods : రాత్రిపూట తినడానికి ఉత్తమమైన ఆహారాలు.. ఇదిగో లిస్ట్

Night Time Foods : రాత్రిపూట తినడానికి ఉత్తమమైన ఆహారాలు.. ఇదిగో లిస్ట్

HT Telugu Desk HT Telugu

10 April 2023, 18:30 IST

    • Night Time Foods List : మీరు డిన్నర్‌కి ఏం సిద్ధం చేశారని ఎవరైనా అడిగితే, బహుశా.. మ్.. అని ఆలోచిస్తూ చెబుతారు. ఇంకా తయారు చేయలేదు అని సమాధానం ఇస్తారు. మీరొక్కరే కాదు, రాత్రి భోజనానికి ఏ ఆహారం తినాలో వారి డైట్ ప్లాన్ కరెక్ట్ గా ఉందో.. లేదో.. తెలియని చాలా మంది ఉన్నారు.
రాత్రిపూట భోజనం
రాత్రిపూట భోజనం

రాత్రిపూట భోజనం

రాత్రిపూట తినడానికి సరైన ఆహారాన్ని ఎంచుకోవడం కొన్నిసార్లు చాలా కష్టమైన పని. మీరు అనారోగ్యకరమైన ఆహారాన్ని తినొచ్చు. చక్కెర, ఉప్పగా ఉండే ఆహారాలు రాత్రిపూట మీ నిద్రను ప్రభావితం చేస్తాయి. రాత్రి సమయంలో మీ కండరాలు, కణజాలాలు పని చేయడం, మరమ్మత్తు చేయడం ప్రారంభిస్తాయి. ఎందుకంటే పగటిపూట ఖాళీ సమయం దొరకదు. విటమిన్ B6, ట్రిప్టోఫాన్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్ల మిశ్రమంతో కూడిన సహజ ఆహారాన్ని ఎంచుకోవడం మంచిది.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

ఆకు కూరలు తినండి

మీ శరీరం మెలటోనిన్‌ను తయారు చేయడానికి ట్రిప్టోఫాన్‌ను ఉపయోగిస్తుందని, దానికి కాల్షియం అవసరమని మీకు తెలుసా? మెలటోనిన్ అనేది రాత్రిపూట సహజంగా నిద్రపోవడానికి మీకు సహాయపడే ఒక హార్మోన్. పాల ఉత్పత్తులలో నిస్సందేహంగా కాల్షియం ఉంటుంది. కానీ ముదురు ఆకుపచ్చ కూరగాయలు కూడా అనేక రకాలైన పెద్ద మొత్తంలో ఖనిజాలను అందిస్తాయి. బచ్చలికూర, పుదీనా మొదలైన ఆకుపచ్చ కూరగాయలను రాత్రిపూట తినవచ్చు.

వోట్మీల్

వోట్మీల్ అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. మీరు అల్పాహారం కోసం తినే అనేక ఇతర ధాన్యాల కంటే మెరుగైనది..ఓట్స్‌లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. మీకు ఎక్కువసేపు ఆకలిగా అనిపించదు. అర్ధరాత్రి కోరికలు మీకు రావు. ఓట్‌మీల్‌లో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్‌లు, ప్రొటీన్‌లు సెరోటోనిన్‌ను విడుదల చేయడం వల్ల రాత్రి బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. ఈ హార్మోన్ మెలటోనిన్ ఉత్పత్తిని పెంచేందుకు తోడ్పడుతుంది. ఓట్ మీల్ ను వేడి పాలలో లేదా పెరుగుతో కలిపి తాగవచ్చు.

చేప

వారానికి ఒకసారి 8 ఔన్సుల చేపలు లేదా సీఫుడ్ తినడం మంచి పద్ధతి. ఎందుకంటే విటమిన్ B6 శరీరం మెలటోనిన్ ఉత్పత్తి చేయడంలో సహాయపడే మరొక పోషకం. కొన్ని చేపలలో విటమిన్ B6 ఉంటుంది. ఉదాహరణకు సాల్మన్, ట్యూనా, హాలిబట్. చేపలలో ఒమేగా 3 యాసిడ్లు కూడా ఎక్కువగా ఉంటాయి.

అరటి

మీరు అరటిపండ్లు తినడం ద్వారా ప్రతిరోజూ మీ శరీరానికి అవసరమైన పొటాషియం, మెగ్నీషియం పొందవచ్చు. పడుకునే ముందు అరటిపండ్లు తినడం వల్ల మీరు సులభంగా నిద్రపోతారు. మీ కండరాలు విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడతాయి. ఇది నిద్రపై సహజ ప్రభావాలను కలిగి ఉంటుంది. ఆందోళనను తగ్గిస్తుంది. నిద్రను ప్రోత్సహిస్తుంది. మీ శరీర కొవ్వును కరిగిస్తుంది.

మాంసం కాస్త తినొచ్చు

మీరు మాంసాహార ప్రియులా? అయితే రాత్రిపూట ఈ ఆహారాన్ని తింటే మీకు సహాయం చేస్తుంది. ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం మాంసంలో ఉంటుంది. దాని ఉనికి నిద్రను ప్రభావితం చేస్తుంది. ఇటీవలి అధ్యయనం ప్రకారం, చికెన్ లేదా 3 ఔన్సుల టర్కీ మాంసం తినడం వల్ల నిద్ర వ్యవధి పెరుగుతుంది. మీ గాఢ నిద్రను పెంచడానికి, మీరు ట్రిప్టోఫాన్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి.

బాదం గింజలు తినండి.. మంచి నిద్ర పొందండి

బాదంపప్పు నిద్రను మెరుగుపరిచే ఉత్తమమైన ఆహారం అని మీకు తెలుసా? మీ కండరాలను సడలించడంలో బాదం చాలా మంచిది. ఇందులో మెగ్నీషియం, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ రెండింటి కలయిక కలిసి పని చేస్తుంది. శరీర కండరాలు విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. మీ మెదడుకు ట్రిప్టోఫాన్‌ను మెలటోనిన్‌గా మార్చడానికి కాల్షియం చాలా పని చేస్తుంది.

చెర్రీ పండ్లు

యూరోపియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ అధ్యయనం ప్రకారం, ప్రతిరోజూ చెర్రీ పండ్లను తీసుకునే వ్యక్తులు కూడా ఎక్కువ కాలం నిద్రపోతారు. ఎందుకంటే చెర్రీస్‌లో మెలటోనిన్ కంటెంట్ ఉంటుంది. ఇది సహజమైన నిద్రకు ఉపకరిస్తుంది. మెలటోనిన్లు ఎక్కువసేపు నిద్రపోవడానికి సహాయపడతాయి. చెర్రీస్‌లో యాంటీ-ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు, ఆర్థరైటిస్ పెయిన్ రిలీఫ్, బెల్లీ ఫ్యాట్ కరిగే గుణాలు, స్ట్రోక్ రిస్క్‌ను తగ్గించే సామర్థ్యం ఉన్నాయి.

తదుపరి వ్యాసం