Watermelon Dosa Recipe। పుచ్చకాయ దోశ.. ఇది అచ్చమైన బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ!
29 July 2023, 6:00 IST
- Watermelon Dosa Recipe: పుచ్చకాయతో దోశలు కూడా చేసుకోవచ్చు. మీకు పుచ్చకాయ దోశ రెసిపీనికి ఇక్కడ అందిస్తున్నాం.
Watermelon Dosa Recipe
Recipe of the day: ఒక వంటకాన్ని మీరు మీదైన శైలిలో ఎన్నో రకాలుగా వండుకోవచ్చు. ముఖ్యంగా దోశ లాంటి అల్పాహారానికి ఇది సరిగ్గా వర్తిస్తుంది. దోశల్లో ఇప్పటికే చాలా వెరైటీలు ఉన్నాయి, ఇక్కడ మీకు ఎప్పుడూ వినని ఒక దోశ వెరైటీని పరిచయం చేస్తున్నాం, అదే పుచ్చకాయ దోశ. అవును మీరు చదివింది కరెస్టే, పుచ్చకాయతో దోశలు కూడా చేసుకోవచ్చు. మీకు పుచ్చకాయ దోశ రెసిపీనికి ఇక్కడ అందిస్తున్నాం.
ఈ దోశ అద్భుతమైన రుచిని మాత్రమే కాకుండా, విటమిన్లు, మినరల్స్ మొదలైన గొప్ప పోషకాలను అందిస్తుంది. మీరూ ఇలా ఓ సారి ట్రై చేయడి. పుచ్చకాయ దోశను ఎలా చేయాలో ఈ కింద ఇచ్చిన సూచనలను జాగ్రత్తగా చదవండి.
Watermelon Dosa Recipe కోసం కావలసినవి
- 1 కప్పు బియ్యం
- 2 టేబుల్ స్పూన్లు తెల్ల శనగలు
- 1/2 స్పూన్ మెంతులు
- 1 పుచ్చకాయ (బయటి తెల్ల భాగం/తొక్క మాత్రమే)
- 2 చిన్న ముక్కలు అల్లం
- 3 పచ్చి మిరపకాయలు
- రుచికి తగినంత ఉప్పు
- వేయించడానికి సరిపడా నూనె/ నెయ్యి
పుచ్చకాయ దోశ తయారీ విధానం
- ముందుగా బియ్యం, శనగలు, మెంతులను కడిగి, ఆపై ఈ మూడు పదార్థాలను ఒక పెద్ద గిన్నెలో తగినన్ని నీళ్లలో నానబెట్టండి. కనీసం 3-4 గంటలు నీటిలో నానబెట్టండి లేదా రాత్రంతా నానబెట్టవచ్చు.
- నానబెట్టడం పూర్తయ్యాక, పుచ్చకాయలోని ఎర్రని గుజ్జును జ్యూస్ చేసుకోండి, తెల్లని బయటి తొక్కను మాత్రం పాడేయకుండా, ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి.
- ఇపుడు ఒక మిక్సింగ్ జార్‌లో నానబెట్టిన బియ్యం, శనగల మిశ్రమ, పుచ్చకాయ తొక్క ముక్కలు, అల్లం, పచ్చి మిరపకాయలు వేయండి, అవసరమైనంత నీరు కూడా పోసి మెత్తని పేస్ట్‌గా గ్రైండ్ చేయండి.
- ఇప్పుడు రుబ్బుకున్న ఈ పిండిలో కొద్దిగా ఉప్పు వేసి, కనీసం ఒక గంట పాటు పక్కనపెట్టండి. మీ దోశ బ్యాటర్ సిద్ధం అవుతుంది.
- ఇప్పుడు పాన్ వేడి చేసి, ఒక టీ స్పూన్ నూనె లేదా నెయ్యిని చిలకరించండి. వేడయ్యాక పాన్ మీద ఒక గరిటె పిండిని పోసి గుండ్రంగా దోశలా విస్తరించండి.
- దోశ బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు కాల్చిన తర్వాత, మరొక వైపు తిప్పండి, మరో నిమిషం ఉడికించాలి.
అంతే, పుచ్చకాయ దోశ రెడీ. వేడివేడిగా మీకు నచ్చిన చట్నీలో తింటూ, పుచ్చకాయ జ్యూస్ తాగుతూ మీ దినచర్యను మొదలు పెట్టండి.
టాపిక్