తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tofu Masala Dosa Recipe। టోఫు మసాలా దోశ.. రుచికరమైన ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్!

Tofu Masala Dosa Recipe। టోఫు మసాలా దోశ.. రుచికరమైన ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్!

HT Telugu Desk HT Telugu

26 July 2023, 6:06 IST

google News
    • Tofu Masala Dosa Recipe: ఈరోజు ప్రపంచ టోఫు దినోత్సవం (World Tofu Day 2023). అందుకే మీకు టోఫు దోశ రెసిపీని ఇక్కడ అందజేస్తున్నాం. టోఫు మసాలా దోశ ఎలా చేయాలో ఈ కింద సూచనలు చదవండి.
Tofu Masala Dosa Recipe
Tofu Masala Dosa Recipe (istock)

Tofu Masala Dosa Recipe

Healthy Breakfast Recipes: దోశ మనందరికీ ప్రియమైన బ్రేక్‌ఫాస్ట్ వంటకం. దోశకు దాని మసాలాతోనే రుచి వస్తుంది. ఈ మసాలాలతో మనకు వందల రకాల దోశ వెరైటీలు చేసుకోవచ్చు. ఆలూ దోశ, పనీర్ దోశ వంటివి మీరు చాలాసార్లు తినే ఉంటారు. ఎప్పుడైనా టోఫు మసాలా దోశ తిన్నారా? ఇక్కడ మీకు టోఫు మసాలా దోశ రెసిపీని అందిస్తున్నాం.

టోఫు అనేది పనీర్ కు ప్రత్యామ్నాయం, డెయిరీ ఉత్పత్తులు ఇష్టపడనివారు పనీర్ స్థానంలో టోఫు ఎంచుకోవచ్చు. ఎందుకంటే ఈ టోఫు అనేది పూర్తిగా మొక్కల ఆధారిత ప్రోటీన్. శాకాహారులకు ఇది మంచి ప్రోటీన్ ఫుడ్.

అన్నట్టూ.. ఈరోజు ప్రపంచ టోఫు దినోత్సవం (World Tofu Day 2023). ప్రతీ ఏడాది జూలై 26న ఈ ప్రత్యేక సందర్భాన్ని పాటిస్తారు. మాంసంకు బదులుగా, పూర్తిగా శాకాహారం - సోయాబీన్‌ల నుండి తయారయ్యే ఈ టోఫు తినడం ప్రోతహించటం ఈరోజుకు ఉన్న విశిష్టత. అందుకే మీకు టోఫు దోశ రెసిపీని ఇక్కడ అందజేస్తున్నాం. టోఫు మసాలా దోశ ఎలా చేయాలో ఈ కింద సూచనలు చదవండి.

Tofu Masala Dosa Recipe కోసం కావలసినవి

  • తురిమిన టోఫు - 1 కప్పు
  • ఇడ్లీ దోశ బ్యాటర్ - అవసరమైనంత
  • ఉల్లిపాయ - 2 పెద్దవి
  • టొమాటో - 1
  • దాల్చిన చెక్క - 1 అంగుళం
  • లవంగాలు - 2
  • ఫెన్నెల్ - 1/2 tsp
  • వంట నూనె - 1 టేబుల్ స్పూన్
  • అల్లం - వెల్లుల్లి పేస్ట్ - 1 tsp
  • కారం పొడి - 1 tsp
  • పసుపు పొడి - 1/8 tsp
  • ఉప్పు - రుచికి తగినంత
  • కొత్తిమీర తరుగు - గార్నిషింగ్ కోసం

టోఫు మసాలా దోశ తయారీ విధానం

  1. ముందుగా టోఫును తురుముకోండి, ఉల్లిపాయలు, కూరగాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పైన ఇచ్చిన మసాలా దినుసులను పౌడర్‌గా చూర్ణం చేయండి.
  2. ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె వేడి చేసి,ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్ట్, మసాలా చూర్ణం వేసి వేయించండి
  3. ఆపై టొమాటో ముక్కలు కారం, పసుపు, గరం మసాలా పొడి వేసి మెత్తగా మారే వరకు వేయించాలి.
  4. అనంతరం తురిమిన టోఫు, రుచికి సరిపడా ఉప్పు వేసి వేసి 5 నిమిషాలు బాగా కలపండి. కొత్తిమీర తరుగు వేసి బాగా కలపండి, స్టవ్ ఆఫ్ చేయండి. రుచికరమైన టోఫు మసాలా సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఈ మసాలాను దోశకు ఉపయోగించాలి.
  5. దోశ పాన్ వేడి చేయండి, నూనె చిలకరించి, ఒక గరిటెతో దోశ పిండిని పోసి వీలైనంత సన్నగా గుండ్రంగా విస్తరించండి.
  6. దానిపై సిద్ధం చేసుకున్న టోఫు మసాలా వేసి, అంతటా విస్తరించండి. దోశను గోధుమ రంగు వచ్చేవరకు కాల్చండి, పాన్ పై మూత పెట్టి ఒక ఒక నిమిషం పాటు ఉడికించండి.

అంతే, రుచికరమైన టోఫు మసాలా దోశ రెడీ. మడిచి వేడివేడిగా సర్వ్ చేయండి.

తదుపరి వ్యాసం