Chick Pea Dosa Recipe । ప్రోటీన్‌తో కూడిన బ్రేక్‌ఫాస్ట్ చేయాలనుకునే వారికి ఇది రుచికరమైన అల్పాహారం!
02 June 2023, 6:30 IST
- Chick Pea Dosa Recipe: మీరు ఉదయం ప్రోటీన్ నిండిన అల్పాహారం చేయాలనుకుంటే, ఇక్కడ శనగల దోశ రెసిపీని అందిస్తున్నాము.
Chick Pea Dosa Recipe
Protein-rich Breakfast Recipes: తెల్లశనగలు చాలా ఆరోగ్యకరమైనవి ఎందుకంటే వీటిలో కేలరీలు తక్కువ ఉంటాయి, ప్రోటీన్‌లు ఎక్కువ ఉంటాయి. బరువు నియంత్రణలో భాగంగా కేలరీలు తక్కువ ఉండే ఆహారం తీసుకోవాలనుకునే వారికి ఇవి ఉత్తమమైనవి. ఉదయం వేళ తీసుకునే అల్పాహారంలో ప్రోటీన్లు ఎక్కువ ఉండేలా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తారు. కడుపును నిండుగా ఉంచుతూ ఆకలి కోరికలను తగ్గించడంలో ప్రోటీన్ సహాయపడుతుంది. కండరాల పెరుగుదలకు, ఎముకల దృఢత్వానికి కూడా ప్రోటీన్ అవసరం.
మీరు ఉదయం ప్రోటీన్ నిండిన అల్పాహారం చేయాలనుకుంటే, ఇక్కడ తెల్లశనగల దోశ రెసిపీని అందిస్తున్నాము. ఇది మీకు రుచికరమైన, ఆరోగ్యకరమైన అల్పాహారంగా ఉంటుంది.
Chick Pea Dosa Recipe కోసం కావలసినవి
- 1 కప్పు చిక్‌పా పిండి
- 1 కప్పు నీరు
- 1 స్పూన్ పసుపు
- ½ స్పూన్ ఉప్పు
- ½ స్పూన్ నల్ల మిరియాలు
- 3 స్ప్రింగ్ ఆనియన్
- 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్
చిక్‌పా దోశ తయారీ విధానం
- ముందుగా మిక్సింగ్ గిన్నెలో చిక్‌పా పిండి, నీరు, పసుపు, ఉప్పు, మిరియాలు వేసి, మెత్తగా బ్లెండ్ చేయండి. పిండి చిక్కని ద్రవంలా తయారవ్వాలి.
- అనంతరం నాన్-స్టిక్ పాన్‌లో నూనె లేదా నెయ్యిని వేడి చేయండి.
- ఆపై సిద్ధం చేసుకున్న బ్యాటర్ తో పైనంపై గుండ్రంగా దోశను వేసుకోండి.
- రెండు వైపులా దోశను ముదురు గోధుమ రంగు వచ్చేంత వరకు కాల్చుకోవాలి.
- మీరు కావాలనుకుంటే ఈ దోశపై క్యాప్సికమ్, పచ్చిబఠానీలు, చిల్లీ ఫ్లేక్స్ వేసి టాపింగ్ చేసుకోవచ్చు.
అంతే, చిక్‌పా దోశ రెడీ. ఈ దోశను వేడిగా ఉన్నప్పుడు తింటేనే రుచికరంగా ఉంటుంది.