తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sago Dosa: ఉపవాసం రోజు తినగలిగే.. సాబుదానా దోశ..

Sago dosa: ఉపవాసం రోజు తినగలిగే.. సాబుదానా దోశ..

HT Telugu Desk HT Telugu

26 May 2023, 6:30 IST

google News
  • Sago dosa: ఉపవాసం రోజున  రాత్రి పూట భోజనంలో ఏం తినాలా అని ఆలోచిస్తున్నారా? అయితే సులభంగా ఈ సాబుదానా దోస చేసిచూడండి. 

Sago Dosa Recipe
Sago Dosa Recipe (Unsplash)

Sago Dosa Recipe

ఉపవాసం రోజు ఏం చేసుకోవాలా అని చూస్తున్నారా? సాబుదానా తో కిచిడీ, పాయసమే కాకుండా ఒకసారి రుచికరమైన దోశ తయారు చేసుకుని చూడండి. రుచిగా ఉంటుంది. ఆరోగ్యం కూడా.

కావాల్సిన పదార్థాలు:

సగం కప్పు సాబుదానా

పావు కప్పు రాజ్‌గిరా పిండి

2 చెంచా పెరుగు

1 చెంచా పచ్చిమిర్చి తరుగు

2 చెంచాల కొత్తిమీర తరుగు

సైంధవ లవణం తగినంత

మిరియాల పొడి రుచికి తగ్గట్లు

1 కప్పు నీళ్లు

తయారీ విధానం:

  1. ముందుగా సాబుదానా నీళ్లతో కడుక్కోవాలి. దీన్ని మూడు నాలుగు గంటలు నానబెట్టుకోవాలి.
  2. ఆ తరువాత నీళ్లు వడిచిపోయేలా సాబుదానా ను ఒక జాలి గిన్నెలో వేసుకోవాలి.
  3. ఈ సాబుదానాను కొద్ది కొద్దగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా పట్టుకోవాలి.
  4. ఈ పిండిలో, రాజ్‌గిరా పిండి, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, సైందవ లవణం, మిరియాల పొడి, పెరుగు కలుపుకోవాలి.
  5. ఉండలు లేకుండా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. దోసెలు పోసుకోడానికి వీలుగా నీళ్లు పోసుకోవాలి.
  6. దోశ పెనం తీసుకుని వేడెక్కాక నూనె రాసుకుని వీటిని కాస్త మందంగానే దోసెలాగా వేసుకోవాలి. అంచుల వెంబడి కాస్త నూనె వేసుకోవాలి.
  7. క్రిస్పీగా అయ్యేదాకా కాల్చుకుని తీసేసుకోవడమే. ఏ చట్నీ లేకుండా తినేయొచ్చు. ఇష్టముంటే పల్లి చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం