Rajgira Dosa Recipe । రాజ్‌గిరా దోశ.. ఆకలి తగ్గించి, ఇమ్యూనిటీని పెంచే అల్పాహారం!
Rajgira Dosa Recipe: గోధుమ, బియ్యం వంటి ఇతర ప్రధాన ఆహారాలతో పోలిస్తే రాజ్‌గిరా చాలా పోషకమైనదిగా పరిగణిస్తారు. రాజ్‌గిరా పిండితో దోశలు కూడా చేసుకోవచ్చు. రెసిపీని చూడండి.
Rajgira Dosa Recipe (Unsplash)
Healthy Brekfast Recipes: రాజ్‌గిరా లేదా అమరాంత్ లేదా రామదాన ధాన్యాలు అని కూడా పిలుస్తారు. గోధుమ, బియ్యం వంటి ఇతర ప్రధాన ఆహారాలతో పోలిస్తే ఇది చాలా పోషకమైనదిగా పరిగణిస్తారు. రాజ్‌గిరాను తృణధాన్యాలు అని నమ్ముతారు. ఇది చాలా ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది, యాంటీ డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది, మైగ్రేన్ తలనొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఇది ఆకలిని కూడా తగ్గిస్తుంది, అందువల్ల దీనిని ఎక్కువగా ఉపవాస సమయంలో తీసుకుంటారు.
రాజ్‌గిరా పిండితో దోశలు కూడా చేసుకోవచ్చు. రాజ్‌గిరా దోశ రెసిపీని ఈ కింద చూడండి.
Rajgira Dosa Recipe కోసం కావలసినవి
- 1 కప్పు రాజ్‌గిరా పిండి
- ½ కప్పు పుల్లని మజ్జిగ
- 1 టేబుల్ స్పూన్ అల్లం-పచ్చిమిర్చి పేస్ట్
- రుచికి తగినంత రాతి ఉప్పు
- తగినంత నూనె
రాజ్‌గిరా దోశ తయారీ విధానం
- ముందుగా రాజ్‌గిరా పిండి, మజ్జిగ, అల్లం-పచ్చిమిర్చి పేస్ట్ , రాక్ సాల్ట్ వేసి బాగా కలపాలి, ఆపై దీనిని రాత్రంతా పులియబెట్టండి. (అంత సమయం లేదనుకుంటే తక్షణమే పులియబెట్టే మార్గాలను ఎంచుకోండి)
- దోశల పిండిని సిద్ధం చేసుకున్నాక, ఒక నాన్-స్టిక్ తవాను వేడి చేసి, నూనెను గ్రీజు చేసి అనంతరం ఒక గరిటెతో కొద్దిగా మందపాటి దోశలను వేసుకోండి.
- దోశను రెండు వైపులా బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు కాల్చండి.
అంతే, రాజ్‌గిర దోశ రెడీ. మీకు నచ్చిన చట్నీతో ఈ ఆరోగ్యకరమైన దోశను ఆరగించండి.
సంబంధిత కథనం