Lentil Tomato Curry Recipe । లంచ్‌లో ప్రోటీన్ ఆహారం కావాలా? ఇదిగో మినపపప్పు టొమాటో కూర!-pair your jonna rotte with lentil tomato curry here is the recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Lentil Tomato Curry Recipe । లంచ్‌లో ప్రోటీన్ ఆహారం కావాలా? ఇదిగో మినపపప్పు టొమాటో కూర!

Lentil Tomato Curry Recipe । లంచ్‌లో ప్రోటీన్ ఆహారం కావాలా? ఇదిగో మినపపప్పు టొమాటో కూర!

HT Telugu Desk HT Telugu
May 12, 2023 01:26 PM IST

Lentil Tomato Curry Recipe: మినపపప్పు- జొన్నరొట్టె మంచి కాంబినేషన్. అయితే మినపగుళ్లతో కూరలాగా వండుకుంటే మరింత రుచికరంగా, ఆరోగ్యకరంగా మారుతుంది.

Lentil Tomato Curry Recipe
Lentil Tomato Curry Recipe (Unsplash)

Healthy Recipes: మినపపప్పు ఒక మంచి ప్రోటీన్ ఆహారం. మాంసాహారంతో సమానమైన పోషకాలు ఈ శాకాహార ఉత్పత్తిలో ఉంటాయి. అయితే మిననపప్పుకు బదులు నేరుగా మినపగుళ్లు లేదా మినుములతో కూడా పప్పు వండుకోవచ్చు. సేంద్రియంగా పండించిన తెల్లని మినపగుండ్లలో పురుగుమందులు, ఇతర రసాయ సంకలితాలు ఉండవు. వీటిలో విటమిన్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. పాలిష్ చేసిన మినపపప్పుతో పోల్చితే, మినపగుండ్లను అచ్ఛంగా అలాగే వండుకోవడం ద్వారా అది మరింత పోషకభరితమైన ఆహారం అవుతుంది.

మినపగుండ్లను టొమాటోతో కలిపి మెత్తని కూరలాగా వండుకుంటే ఎంతో రుచికరంగా ఉంటుంది. జొన్నరొట్టె, పరాఠాలకు మంచి కాంబినేషన్ అవుతుంది. రెసిపీని ఈ కిందచూడండి.

White Lentil- Urad Dal Tomato Curry Recipe కోసం కావలసినవి

  • 1 కప్పు తెల్లని మినపపప్పు
  • 2 టమోటాలు
  • 4 పచ్చిమిర్చి
  • 8-10 కరివేపాకు
  • 1/2 టీస్పూన్ ఆవాలు
  • 1/2 స్పూన్ జీలకర్ర
  • 2 టేబుల్ స్పూన్లు నిమ్మరసం
  • 1 స్పూన్ మిరియాల పొడి
  • 1 టీస్పూన్ కారంపొడి
  • 1-అంగుళాల అల్లం
  • 2 టేబుల్ స్పూన్ల నూనె
  • 1 టేబుల్ స్పూన్ నెయ్యి
  • తాజా కొత్తిమీర తురుము
  • రుచికి తగినంత ఉప్పు

టమోటా మినపపప్పు కూర తయారీ విధానం

  1. ముందుగా మినపగుళ్లను ఒక గంపాటు నానబెట్టి, ఆ తర్వాత 2 కప్పుల నీటితో తక్కువ మంట మీద మెత్తగా ఉడికించండి.
  2. ఇప్పుడు కడాయ్‌లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి వేసి, తక్కువ మంట మీద వేయించాలి.
  3. ఆ తర్వాత సరిపడా ఉప్పుకారం వేయండి, వెంటనే టమోటాలు వేసి బాగా కలపండి.
  4. ఇప్పుడు ఉడకబెట్టిన పప్పు వేసి బాగా కలుపుతూ సుమారు 5 నిమిషాలు ఉడికించాలి.
  5. అనంతరం మిరియాల పొడి, నిమ్మరసం, తరిగిన కొత్తిమీర వేసి తేలికగా కలపండి, స్టవ్ ఆపివేయండి.
  6. చివరగా నెయ్యిలో పోపు వేయించి, ఆ పోపును సిద్ధం చేసుకున్న పప్పులో కలపండి.

టమోటా మినపపప్పు కూర రెడీ. ఇది రోటీతో బాగుంటుంది, అన్నంతో కూడా తినవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం