Oatmeal Egg Recipe । ఓట్‌మీల్ ఎగ్.. ఆరోగ్యకరమైన, పోషకభరితమైన అల్పాహారం!
03 August 2024, 22:29 IST
- Oatmeal Egg Recipe: ఆరోగ్యకరమైన, పోషకాలు అధికంగా ఉండే అల్పాహారం తినాలనుకునే వారికి ఓట్‌మీల్ ఎగ్ అద్భుతంగా ఉంటుంది. రెసిపీని ఈ కింద చూడండి.
Oatmeal Egg Recipe
Healthy Breakfast Recipes: ఓట్‌మీల్‌ను గుడ్డు, కొన్ని కూరగాయలతో కలిపి బ్రేక్‌ఫాస్ట్ కోసం చక్కని అల్పాహారం సిద్దం చేసుకోవచ్చు. ఆరోగ్యకరమైన, పోషకాలు అధికంగా ఉండే అల్పాహారం తినాలనుకునే వారికి ఈ రెసిపీ అద్భుతంగా ఉంటుంది. ఓట్స్‌లో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి కరగని, కరిగే రెండు రకాల ఫైబర్‌లను కలిగి ఉంటాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి, జీర్ణక్రియను నెమ్మదిస్తాయి.
మరోవైపు ఉదయం వేళ ప్రొటీన్లు, కొవ్వులు నిండిన అల్పాహారం తీసుకోవడం చాలా మంచిది. ఈ పోషకాలను గుడ్లు భర్తీ చేస్తాయి.
ఓట్స్, గుడ్లను కలిపి త్వరితగతిన 15 నిమిషాల్లోనే అల్పాహారం సిద్ధం చేసుకోవచ్చు. ఓట్‌మీల్ ఎగ్ రెసిపీని ఈ కింద చూడండి.
Oatmeal Egg Recipe కోసం కావలసినవి
- 1/4 కప్పు ఓట్స్
- 1- 2 గుడ్లు
- 1 టేబుల్ స్పూన్ నూనె
- 1 పచ్చిమిర్చి
- 1 tsp అల్లం వెల్లుల్లి పేస్ట్
- 1/2 టీస్పూన్ జీలకర్ర
- 1/4 కప్పు కూరగాయల ముక్కలు (క్యారెట్లు, పచ్చిబఠానీలు, స్వీట్ కార్న్)
- 1/4 టీస్పూన్ పసుపు
- 1/4 టీస్పూన్ గరం మసాలా
- రుచికి తగినంత ఉప్పు
- 1 స్పూన్ నిమ్మరసం
- 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీర ఆకులు
ఓట్‌మీల్ ఎగ్ తయారీ విధానం
- ముందుగా బాణలిలో నూనె వేసి, వేడయ్యాక జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి.
- తరువాత ఉల్లిపాయలు ముక్కలు వేసి బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించాలి, ఆపై అల్లంవెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
- తర్వాత తరిగిన కూరగాయలను వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. ఆపై మూతపెట్టి ఉడికించాలి.
- ఇప్పుడు ఓట్స్, పసుపు, ఉప్పు వేసి అన్నింటిని బాగా కలపాలి. 1- 2 నిమిషాలు వేయించాలి.
- ఇప్పుడు గుడ్డును గిలక్కొట్టి వేయాలి, ఆపై ఉడికినంత వరకు తక్కువ మంట మీద మూత పెట్టి ఉడికించాలి.
- అనంతరం అన్నింటిని బాగా కలపాలి, చివరగా నిమ్మరసం, కొత్తమీర చల్లాలి.
అంతే ఓట్‌మీల్ ఎగ్ రెడీ, వేడివేడిగా సర్వ్ చేయండి.