Oats Attu Recipe । బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్ అట్టు తినండి, ఫిట్‌గా తయారవుతారు!
Oats Attu Recipe: బ్రేక్‌ఫాస్ట్ కోసం మీకు ఓట్ మీల్ చాలా మంచి ఆహారం. నానబెట్టిన ఓట్స్, శనగపిండి కలిపి అద్భుతమైన ఓట్స్ అట్టు చేసుకోవచ్చు.
Summer Breakfast Recipes: వేసవిలో వేడి చేసే ఆహరాలకు దూరంగా ఉండాలి. కడుపులో తేలికగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలి. వేడి కాలంలో బ్రేక్‌ఫాస్ట్ కోసం మీకు ఓట్ మీల్ చాలా మంచి ఆహారం. నానబెట్టిన ఓట్స్, శనగపిండి కలిపి అద్భుతమైన ఓట్స్ అట్టు చేసుకోవచ్చు.
ఓట్స్ అనేవి గ్లూటెన్ రహిత తృణధాన్యాలు, వీటిలో ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. బరువు తగ్గడానికి, రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడానికి ఓట్స్ మేలు చేస్తాయి, ఓట్స్ తింటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.
మరోవైపు శనగపిండి కూడా ఆరోగ్యకరమైనదే. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నిర్వహించడంలో, ప్రేగు కదలికను సులభతరం చేయడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో శనగపిండి ప్రయోజనకరమైది. ఈ పిండి క్యాన్సర్ నిరోధక లక్షణాలను ప్రదర్శిస్తుంది. ఈ రెండింటి కలయికతో చేసే ఓట్స్ అట్టు రెసిపీని ఈ కింద అందిస్తున్నాం, సూచనలు చదివి సులభంగా చేసేయండి.
Oats Attu Recipe కోసం కావలసినవి
- 1/2 కప్పు ఓట్స్
- 1/2 కప్పు శనగపిండి
- 1/4 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు
- 1/4 కప్పు సన్నగా తరిగిన టమోటాలు
- 1/4 టీస్పూన్ జీలకర్ర
- 1/2 అంగుళం అల్లం
- 1 పచ్చిమిర్చి
- 1/4 కప్పు తరిగిన కొత్తిమీర ఆకులు
- 1/4 టీస్పూన్ కారం
- 1/4 టీస్పూన్ పసుపు పొడి
- ఉప్పు అవసరం మేరకు
- నూనె అట్లు వేయించడానికి
ఓట్స్ అట్టు తయారీ విధానం
- ముందుగా ఓట్స్‌ను తీసుకుని గ్రైండర్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. లేదా రాత్రంతా నానబెట్టిన ఓట్స్ కూడా కలుపుకోవచ్చు.
- ఇప్పుడు మిక్సింగ్ గిన్నెలో ఓట్స్ పిండిని తీసుకొని అందులో శనగపిండిని కలపండి.
- అనంతరం నూనె మినహా పైన పేర్కొన్న ఇతర పదార్థాలన్నీ పిండిలో కలిపేసుకోవాలి. అవసరం మేర నీరు పోసుకొని అట్లు వచ్చేలా పిండి బ్యాటర్ సిద్ధం చేసుకోవాలి.
- అనంతరం ఒక ఫ్లాట్ పాన్‌ను తక్కువ మంటపై వేడి చేసి కొద్దిగా నూనె చిలకరించండి.
- ఇప్పుడు అట్లు వేసుకొని లేత బంగారు రంగులోకి వచ్చే వరకు కాల్చాలి. రెండు వైపులా కాల్చుకోవాలి.
అంతే ఓట్స్ అట్టు రెడీ. మీకు నచ్చిన ఏదైనా చట్నీతో లేదా టొమాటో సాస్‌తో సర్వ్ చేయండి.
సంబంధిత కథనం