తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  వయస్సును బట్టి కనిపించే డయాబెటిస్ లక్షణాలు ఇవే..

వయస్సును బట్టి కనిపించే డయాబెటిస్ లక్షణాలు ఇవే..

HT Telugu Desk HT Telugu

25 February 2024, 15:15 IST

    • Age Specific Symptoms of Diabetes: డయాబెటిస్ లక్షణాలు వయస్సును బట్టి విభిన్నంగా కనిపించే అవకాశం ఉంది. ఆయా లక్షణాలను బట్టి బ్లడ్ షుగర్ పరీక్షలు చేయించుకుని సత్వర చికిత్స తీసుకోవడం వల్ల డయాబెటిస్ పర్యవసనాల నుంచి రక్షించుకోవచ్చు.
వయసును బట్టి కనిపించే డయాబెటిస్ లక్షణాలు ఇవే
వయసును బట్టి కనిపించే డయాబెటిస్ లక్షణాలు ఇవే (Pixabay)

వయసును బట్టి కనిపించే డయాబెటిస్ లక్షణాలు ఇవే

డయాబెటిస్ అనేది ప్రపంచంలో చాలా మందిని ప్రభావితం చేసే ఒక సాధారణ అనారోగ్య సమస్య. ఈ వ్యాధి ఉంటే వయస్సును బట్టి వివిధ రకాల లక్షణాలు కనిపిస్తాయి. డయాబెటిస్ లక్షణాలు గుర్తించడం ద్వారా ముందుగానే చికిత్సను ప్రారంభించి ఈ వ్యాధి కారణంగా ఎదురయ్యే సమస్యలను నివారించుకోవచ్చు. వయస్సు ఆధారంగా కనిపించే డయాబెటిస్ లక్షణాల గురించి ఇక్కడ తెలుసుకోండి.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

చిన్నారులు, కౌమార దశలో ఉన్న వారు

చిన్నారులు, కౌమారదశలో ఉన్న వారిలో టైప్ 1 డయాబెటిస్ సాధారణం. ఈ వయసు వారిలో అధిక దాహం, తరచుగా మూత్రవిసర్జన, అసాధారణంగా బరువు కోల్పోవడం, అలసట, దృష్టి లోపం వంటి లక్షణాలు కనిపించినప్పుడు డయాబెటిస్ పరీక్షలు నిర్వహించడం వల్ల వ్యాధిని త్వరగా గుర్తించవచ్చు.

యువకులు, మధ్య వయసు వారు

యువకులు మరియు మధ్య వయసు వారిలో టైప్ 2 డయాబెటిస్ సాధారణంగా కనిపిస్తుంటుంది. అయితే వీరిలో అంత త్వరగా లక్షణాలు కనిపించవు. ఈ వయస్సు వారిలో స్థూలకాయం, గాయాలు ఆలస్యంగా నయం కావడం, తరచుగా ఇన్ఫెక్షన్లకు గురికావడం, ముఖ్యంగా చర్మం, మూత్రపిండాల సంబంధిత ఇన్ఫెక్షన్లు ఎదురవడం, అసాధారణం ఆకలి వంటి లక్షణాలను గమనించవచ్చు.

వృద్ధులు

వృద్ధులలో డయాబెటిస్ లక్షణాలు స్పష్టంగా కనిపించకపోవచ్చు. తరచుగా దాహం, తరచుగా మూత్రవిసర్జన, అసాధారణంగా అలసట చెందడం, కొన్ని సార్లు దృష్టి లోపం వంటి సాధారణ లక్షణాలు గమనించవచ్చు. వారిలో కూడా గాయాలు నయం కావడంలో ఆలస్యం జరుగుతుంది.

డయాబెటిస్ చికిత్స

డయాబెటిస్ లక్షణాలు గుర్తించడం ముఖ్యం. ఒకవేళ గుర్తిస్తే సకాలంలో వైద్యం ప్రారంభించడం ద్వారా పేషెంట్ జీవన నాణ్యతను మెరుగుపరచవచ్చు. మధుమేహం వల్ల కలిగే సమస్యలను నివారించవచ్చు. డయాబెటిస్ నివారణ, నిర్వహణ కోసం ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లు, సరైన ఆహార నియమాలు, తేలికపాటి వ్యాయామం అవసరం. అలాగే తరచుగా నిర్ధిష్ట వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ విధానాలు డయాబెటిస్ ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

మధుమేహం ఉన్న వారు వైద్యడిని సంప్రదించడంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. ఒకసారి రాసిచ్చిన ప్రిస్కిప్షన్‌ను ఏళ్లపాటు ఉపయోగిస్తారు. ఇలా చేయడం సరికాదు. కనీసం 6 నెలలకోసారి తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాల్సిందే. షుగర్ ఉన్న వారికి వైద్య నిపుణులు తరచుగా మందులు మారుస్తుంటారు. చికిత్స స్పందన తీరును బట్టి మారుస్తుంటారు.

జీవనశైలి మార్పులే ప్రధానం

ప్రతి వయస్సు వర్గంలోని వ్యక్తులు డయాబెటిస్ లక్షణాలను గుర్తించి, తగిన జాగ్రత్తలు తీసుకుంటే అదుపులో ఉంటుంది. డయాబెటిస్ నియంత్రణలో ఉండాలంటే జీవనశైలి మార్పులు అవసరం. వ్యాయామం, సరైన ఆహార నియమాలు, తగినంత నిద్ర, మానసిక ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం అవసరం. ఈ రోగంపై పోరాడటంలో ఇవి కీలకం. అలాగే తరచుగా బ్లడ్ షుగర్ లెవెల్స్ మానిటరింగ్ కూడా అవసరం.

అలాగే మద్యపానం, ధూమపానం వంటి చెడు అలవాట్లను వెంటనే వదిలివేయాలి. లేదంటే మీ షుగర్ లెవల్స్ పెరుగుతూ పోతాయి. దీని ప్రభావం శరీరంలోని అనేక అవయవాలపై పడుతుంది. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు, గుండె జబ్బులు, చర్మ సమస్యలు తీవ్రమవుతాయి.

తదుపరి వ్యాసం