తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kodi Chips : కరకరలాడే కోడి చిప్స్.. ఒక్కసారి తింటే మళ్లీ కావాలంటారు

kodi Chips : కరకరలాడే కోడి చిప్స్.. ఒక్కసారి తింటే మళ్లీ కావాలంటారు

Anand Sai HT Telugu

31 March 2024, 11:00 IST

google News
    • kodi Chips : నాన్ వెజ్ ప్రియులకు చికెన్ అంటే మహా ఇష్టం. దీనితో చేసే రెసిపీలు అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు. అయితే కొత్తగా కోడి చిప్స్ ట్రై చేయండి.
కోడి చిప్స్ తయారీ విధానం
కోడి చిప్స్ తయారీ విధానం

కోడి చిప్స్ తయారీ విధానం

చాలా మందికి చికెన్ అంటే ఇష్టం. కానీ ఎప్పుడూ ఒకేలాగా చేసి తింటే బోర్ కొడుతుంది కదా. అందుకే అప్పుడప్పుడు కొత్తగా ట్రై చేయండి. ఇందుకోసం చాలా రెసిపీలు ఉన్నాయి. నాన్ వెజ్ అంటే ఇష్టమున్న వారు చికెన్ తో చేసిన రెసిపీలను బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే కాస్త వెరైటీగా ఉంటే ఇంకా మంచిదని అనుకుంటారు. అందులో భాగంగా కొత్తగా కోడి చిప్స్ ట్రై చేయండి. ప్లాట్ ఫామ్ 65 చెఫ్ వీహెచ్ సురేశ్ ఈ రెసిపీని అందిస్తున్నారు.

కోడి చిప్స్ చేసేందుకు పెద్దగా టైమ్ తీసుకోదు. ఈజీగా తయారు చేయవచ్చు. కావాల్సిన పదార్థాలు కూడా తక్కువే. దీనిని ఇంట్లోనే ఈజీగా తయారు చేయవచ్చు. దీనిని పెద్దలతోపాటుగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనిని నేరుగా తినవచ్చు. లేదంటే అన్నంలోకి సైడ్ డిష్‌లాగా పెట్టుకుని లాగించొచ్చు. కోడి చిప్స్ రెసిపీ చేసే విధానం, ఏమేం కావాలో ఇప్పుడు చూద్దాం..

కోడి చిప్స్‌కు కావాల్సిన పదార్థాలు

250గ్రా బోన్‌లెస్ చికెన్ బ్రెస్ట్

20గ్రా బేసన్ (గ్రాఫ్లోర్)

20గ్రా కార్న్ ఫ్లోర్

2 TSP అల్లం వెల్లుల్లి పేస్ట్

ఉప్పు

1 టీస్పూన్ కారంపొడి

1 టీస్పూన్ చాట్ మసాలా

0.5 లీటర్ నూనె (డీప్ ఫ్రై కోసం)

1/4 టీస్పూన్ ధనియా పొడి (కొత్తిమీర పొడి)

1/4 నిమ్మకాయ

2 పచ్చిమిర్చి ముక్కలు

10 కరివేపాకు

50గ్రా బ్రెడ్ ముక్కలు

కోడి చిప్స్ తయారు చేసే పద్ధతి

ముందుగా బోన్‌లెస్ చికెన్ బ్రెస్ట్‌ను సన్నని ముక్కలుగా కట్ చేసుకోండి.

ఇప్పుడు ఒక గిన్నెలో, బేసన్, మొక్కజొన్న పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పొడి, నిమ్మరసం, కారం పొడి, ఉప్పు కలపాలి.

ఇప్పుడు పిండిని క్రమంగా నీరు కలుపుకొంటూ కాస్త గట్టిగానే ఉంచాలి.

తర్వాత చికెన్ ముక్కలను పిండిలో వేసి, వాటిని బాగా కలపాలి.

ఇప్పుడు చికెన్ ముక్కలకు పిండి బాగా పట్టిందో లేదో చూసుకోవాలి. అవి సమానంగా ఉన్నాయని చూసుకోవాలి.

వాటిని బ్రెడ్ ముక్కలకు సమానంగా పెట్టాలి. అతుక్కునేలా చేయాలి.

డీప్ ఫ్రై కోసం బాణలిలో నూనె వేడి చేయండి.

నూనె వేడి అయ్యాక, జాగ్రత్తగా చికెన్ ముక్కలను నూనెలో వేయండి.

వాటిని బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించి, ఉడికించాలి.

ఎక్కువగా ఉంటే నూనెను తొలగించడానికి వేయించిన చికెన్ ముక్కలను పేపర్ టవల్ మీద వేసుకోండి.

టొమాటో సాస్‌తో వేడిగా సర్వ్ చేయండి. అంతే వేడి వేడిగా కోడి చిప్స్ రెడీ. అందరూ వీటిని ఎంజాయ్ చేస్తూ తింటారు.

తదుపరి వ్యాసం