తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diwali Crackers: దీపావళి టపాసుల పొగతో జాగ్రత్త, ఏమరపాటుతో నిర్లక్యం చేస్తే మీ చూపుపై తీవ్రమైన ప్రభావం

Diwali Crackers: దీపావళి టపాసుల పొగతో జాగ్రత్త, ఏమరపాటుతో నిర్లక్యం చేస్తే మీ చూపుపై తీవ్రమైన ప్రభావం

Galeti Rajendra HT Telugu

31 October 2024, 7:00 IST

google News
  • Eye Care from Diwali crackers: దీపావళి రోజు అందరూ పోటీపడి మరీ టపాసులు కాలుస్తుంటారు. ఆ బాణాసంచా నుంచి వెలవడే పొగ మన కళ్లల్లోకి వెళ్లినప్పుడు పొరపాటున చేతితో కళ్లని రుద్దితే ఏమవుతుందో తెలుసా? 

బాణాసంచా పొగతో కంటి సమస్యలు
బాణాసంచా పొగతో కంటి సమస్యలు

బాణాసంచా పొగతో కంటి సమస్యలు

దేశవ్యాప్తంగా గురువారం (అక్టోబరు 31) దీపావళి జరుపుకుంటున్నారు. దీపావళి అంటే దీపాలు, స్వీట్లు, బాణసంచా కాల్చే హడావుడే కనిపిస్తుంది.  పిల్లలతో పాటు పెద్దలు కూడా దీపావళి రోజున టపాసులు కాలుస్తుంటారు. అయితే.. ఆ బాణాసంచా నుంచి వెలువడే విషపూరితమైన పొగ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఆ పొగ ఊపిరితిత్తులకే కాదు కళ్లకి కూడా చాలా ప్రమాదకరం. అందువల్ల ఈ పొగ నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

దీపావళి రోజున బాణాసంచా నుంచి వెలువడే పొగలో అనేక హానికరమైన రసాయనాలు ఉంటాయి. అవి దీర్ఘకాలంలో కళ్లను దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఆ పొగ మన కళ్లలోకి వెళ్తే.. కంటిలో దురద, ఇన్ఫెక్షన్, నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి.

బాణాసంచా నుండి వెలువడే పొగలో సల్ఫర్, గన్‌పౌడర్‌, సీసం వంటి హానికరమైన రసాయనాలు ఉంటాయి. ఇవి కార్నియాను దెబ్బతీస్తుంది. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలపై ఇది తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. కాలక్రమేనా ఇది పిల్లల దృష్టి సమస్యని పెంచుతుంది.

పొగ మన కళ్లల్లోకి వెళ్తే?

  • టపాసుల వల్ల వచ్చే పొగ, కాలుష్యం వల్ల కళ్లు పొడిబారుతాయి.అలాగే టపాసులు పేల్చేటప్పుడు కొన్ని సార్లు కళ్లకు గాయాలవుతుంటాయి.
  • బాణాసంచా కాల్చినప్పుడు వచ్చే మంటలు, పొగ కళ్లకు చికాకుని కలిగించొచ్చు
  • టపాసులు కళ్లలోని రెటీనాకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. రెటీనా గాయాలు దీర్ఘకాలిక దృష్టి సమస్యలకు దారితీస్తాయి. .
  • కలుషితమైన పొగ కంటి ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది నిరంతరం కళ్ల నుంచి నీరు కారడం, ఎరుపుగా మారడం లేదా వాపునకు దారితీస్తుంది.

కళ్లల్లోకి పొగ వెళ్లగానే ఈ తప్పులు చేయొద్దు

  • కళ్లల్లోకి పొగ వెళ్లగానే చాలా మంది వెంటనే చేతులతో రుద్దేస్తుంటారు. 
  • కానీ.. ఇది తప్పు. ఒకవేళ అలా రుద్దితే పొగలోని రసాయనాలు కళ్లు మొత్తం వ్యాప్తించి కన్నీళ్లు తెప్పిస్తాయి.
  • పొగ కళ్లల్లోకి వెళితే రుద్దకుండా వెళ్లి శుభ్రమైన నీటితో కళ్లని కడిగేయాలి. ఇలా చేయడం వల్ల కళ్లలోని దుమ్ము, ధూళి కణాలు శుభ్రం అవుతాయి. మీకు నిమిషాల్లోనే ఉపశమనం లభిస్తుంది.
  • టపాసులు పేల్చేటప్పుడు ప్లెయిన్‌ గాగుల్స్‌ ధరించడం మంచిది. ఆ అద్దాలు పొగ, ధూళి కణాల నుంచి మీ కళ్లని రక్షిస్తాయి.

బాణాసంచా కాల్చే సమయంలో ఒకవేళ పొరపాటున మీ కంటికి గాయం అయితే..  ఇంటి దగ్గరే ఒకసారి కంటిని శుభ్రం చేసుకుని పరిశీలించుకోండి. మీ పరిశీలనలో గాయం తీవ్రత ఎక్కువగా అనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. 

గమనిక: పైన ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు, ఇబ్బందులు ఉంటే సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించండి.

తదుపరి వ్యాసం