Protect Your Eyes । మీ కంటిచూపును కాపాడుకోండి, కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే మార్గాలు ఇవిగో!-protect your eyes natural ways to improve vision and eye health in this digital era ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Protect Your Eyes । మీ కంటిచూపును కాపాడుకోండి, కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే మార్గాలు ఇవిగో!

Protect Your Eyes । మీ కంటిచూపును కాపాడుకోండి, కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే మార్గాలు ఇవిగో!

HT Telugu Desk HT Telugu
Aug 03, 2024 10:47 PM IST

Protect Your Eyes: మీ కళ్లను సంరక్షించడానికి, మీ కంటిచూపుకు నష్టం జరగకుండా కొన్ని మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు ఏమిటో ఈ క్రింద చూడండి.

Improve vision and eyesight
Improve vision and eyesight (istock )

Protect Your Eyes: నేటి డిజిటల్ యుగంలో మొబైల్, ల్యాప్‌టాప్‌ , టీవీ మొదలైన స్క్రీన్‌లు మన రోజువారీ జీవితాల నుండి విడదీయరానివిగా మారాయి. అయితే ఎక్కువ సమయం పాటు ఇలా స్క్రీన్‌లకేసి చూస్తుండటం మన కళ్లకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఇది మన కంటిచూపుకి హాని కలిగించవచ్చు. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను సుదీర్ఘకాలం పాటు ఉపయోగించడం వల్ల కళ్ల ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావాలను చూపుతాయి, అనేక కంటి సంబంధిత సమస్యలకు దారితీవచ్చు. కానీ కొన్నిసార్లు మనం స్క్రీన్ చూస్తూ పనిచేయటం అనివార్యంగా ఉంటుంది. అలాంటపుడు కళ్లపై ఈ స్క్రీన్‌ల భారం పడకుండా ఏం చేయగలం?

అదృష్టవశాత్తూ, మీ కళ్లను సంరక్షించడానికి, మీ కంటిచూపుకు నష్టం జరగకుండా నివారించటానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. మీ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి మీరు అనుసరించాల్సిన ఆ మార్గాలు ఏమిటో ఈ క్రింద చూడండి.

సమతుల్య ఆహారం

పోషకాలు అధికంగా ఉండే ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారాన్ని తీసుకోండి. విటమిన్ ఎ, సి, కెరటినాయిడ్లు కలిగిన పాలకూర, కాలే వంటి ఆకుపచ్చని ఆకుకూరలు తినడం ద్వారా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు. అలాగే కంటి పనితీరుకు తోడ్పడే అవసరమైన పోషకాలను అందించడానికి ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే కొవ్వు చేపలు, నట్స్ మొదలైన ఆహారాలను తినాలి.

సన్ గ్లాసెస్ ధరించండి

మీ కళ్లను కాపాడుకోవడానికి తగిన రక్షణను అందించే సన్ గ్లాసెస్‌ను ఎంచుకోండి. 100 శాతం లేదా కనీసం 99 శాతం UVA , UVB రక్షణను అందించే సన్ గ్లాసెస్ ధరించాలి. ఇవి స్క్రీన్ల నుంచి వెలువడే బ్లూలైట్, UV కిరణాల హానికరమైన ప్రభావాల నుండి మీ కళ్ళను రస్తాయి. UV కిరణాలకు ఎక్కువసేపు గురికావడం వల్ల కంటిశుక్లం, ఇతర కంటి సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.

స్క్రీన్ బ్రేక్‌లు తీసుకోండి

కంటిపై భారాన్ని తగ్గించడానికి తరచుగా స్క్రీన్ బ్రేక్‌లు తీసుకోండి, 20-20-20 నియమాన్ని పాటించండి. ప్రతి 20 నిమిషాలకు, స్క్రీన్ నుండి కొంత విరామం తీసుకుని, దాదాపు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువుపై 20 సెకన్ల పాటు దృష్టి పెట్టండి. ఈ అభ్యాసం కంటి కండరాలను విశ్రాంతి తీసుకోవడానికి , నిరంతర స్క్రీన్ వాడకం వల్ల కలిగే కంటి అలసటను తగ్గిస్తుంది.

ధూమపానం మానుకోండి

ధూమపానం కంటి ఆరోగ్యానికి గణనీయమైన ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఈ అలవాటు వివిధ కంటి వ్యాధులకు దారితీసే అవకాశాలను పెంచుతుంది. కంటి నాడిని దెబ్బతీస్తుంది, ఇది కంటిచూపును నష్టపరుస్తుంది. కాబట్టి ధూమపానం మానేయడం అలాగే సెకండ్‌హ్యాండ్ పొగకు గురికాకుండా దూరంగా ఉండటం మీ కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

యోగా ఆసనాలు

మీ కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి వాటికి కూడా వ్యాయామం అవసరం. కళ్ల కోసం ప్రత్యేకమైన యోగా ఆసనాలు ఉన్నాయి. ఇవి మీ కంటి కండరాలలో సడలింపును ప్రోత్సహించడానికి, కళ్ళకు రక్త ప్రసరణను పెంచడానికి, మీ మొత్తం కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి.

తగినంత నిద్ర

ప్రతిరోజూ రాత్రి తగినంత నిద్ర పోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి, ఎలాంటి అవాంతరాలు లేని నాణ్యమైన నిద్ర అవసరం. 7-8 గంటలు నిద్ర పోవడం లక్ష్యంగా పెట్టుకోండి. మంచి రాత్రి నిద్ర మీ కళ్ళు తగినంత విశ్రాంతి పొందటానికి, ఆపై పునరుజ్జీవనం పొందేలా సహాయం చేస్తుంది, కంటి ఒత్తిడి, అలసటను తగ్గిస్తుంది. విశ్రాంతి తీసుకున్న కళ్ళు మెరుగ్గా పనిచేస్తాయి.

Whats_app_banner

సంబంధిత కథనం