Deepavali 2024: దీపావళి రోజు ఇంట్లో కాలుష్యం చేరకుండా ఇలా జాగ్రత్తలు తీసుకోండి
Deepavali 2024: దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చడం వల్ల వాతావరణం కలుషితం కావడం సహజం.దీని వల్ల దుమ్ము, ధూళి కారణంగా బయటే కాకుండా ఇంటి లోపల కూడా అలర్జీలు వస్తాయి. కాబట్టి శ్వాస సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీపావళి రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.
దీపావళి అంటే కేవలం దీపాల పండుగ మాత్రమే కాదు. టపాసుల పండుగ కూడా. దీపావళి సందర్భంగా ఇప్పటికే ప్రజలు టపాసులు పేల్చడం ప్రారంభించారు. బాణసంచా కాల్చి ఐదు రోజుల పండుగను జరుపుకోవడం వేడుకల్లో భాగమే. ఈ సందర్భంలో వాతావరణం కలుషితమవుతుంది.
దీపావళి బాణసంచా కాలుష్యం ప్రభావం ఇంటి బయటే కాదు లోపల కూడా కనిపిస్తుంది. బాణాసంచా పొగ, దుమ్ము గాలి ద్వారా కూడా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. దీనితో పాటు ఇంట్లో అప్పటికే ఉన్న ధూళి కణాలు అలర్జీలకు దారితీస్తాయి. ఇప్పటికే ఆస్తమా, డస్ట్ అలర్జీలు, తుమ్ములు, ముక్కు దిబ్బడ మొదలైనవి ఉన్నవారు దీని వల్ల చాలా బాధపడవచ్చు. అందువల్ల, ఇంటి అలెర్జీలను నివారించడం చాలా ముఖ్యం. దీని కోసం ఏమి చేయాలో ఇక్కడ చిట్కాలు ఉన్నాయి.
దీపావళి కాలుష్యం
దీపావళి రోజు ఉదయం నుంచే టపాసులు కాల్చడం మొదలైపోతుంది. కాబట్టి ఇంటి కిటికీలు, తలుపులు తెరవవద్దు. దీనివల్ల దుమ్ము, పొగ నేరుగా ఇంట్లోకి ప్రవేశిస్తాయి. అలాగే దుమ్ము, పొగలు ఇంటి అంతటా వ్యాపించి అలర్జీలు వంటివి కలిగిస్తాయి. దీనివల్ల శ్వాస సమస్యలు తీవ్రమవుతాయి. కాబట్టి ఇంటి లోపల దుమ్ము, బాణసంచా పొగ లేకుండా చూసుకోవాలి.
ఇంటి లోపల టపాసులు కాల్చకండి
కొంతమంది పెద్దగా శబ్దం చేయని టపాసులను ఇంటి లోపల కాలుస్తూ ఉంటారు. పిల్లలు ఇంటి లోపల కేప్స్, రీల్స్ వంటి చిన్న చిన్న టపాసులు కూడా వెలిగిస్తారు. ఇది నేరుగా ఇంటిలో పొగ, ధూళితో నింపుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి లోపల టపాసులు కాల్చడానికి ప్రయత్నించవద్దు.
ధూపం వద్దు
ఇంట్లో టపాసులు కాల్చడమే కాకుండా ధూపం వెలిగించడం వంటివి చేస్తారు. వీటి వల్ల కూడా శ్వాస సంబంధ సమస్యలు తలెత్తుతాయి. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ పదార్థాలకు రసాయనాలను కూడా ఉపయోగిస్తున్నారు. అలాగే దీని పొగ టపాసు కాలుష్యంతో కలిసి ఇంటి లోపల ఎక్కువ దుమ్ము, ధూళిని కలిగిస్తుంది. శ్వాస సమస్యలు ఉన్నవారికి ధూపం అలెర్జీ కలగవచ్చు.
టపాసుల కాలుష్యం రాత్రి పూట ఎక్కువ. ఎన్ని కిటికీలు, తలుపులు తెరిచినా ఇంట్లో ఏదో ఒక మూల నుంచి దుమ్ము, పొగలు రావొచ్చు. అపరిశుభ్రమైన గాలి బయటకు వెళ్లి స్వచ్ఛమైన గాలి లోపలికి రావాలంటే ఉదయం లేవగానే కిటికీలు, తలుపులు తెరవండి. ఉదయం వాతావరణం క్లియర్ గా ఉండటంతో ఇంట్లోకి స్వచ్ఛమైన గాలి ప్రవేశిస్తుంది.
ఎయిర్ ప్యూరిఫైయర్ వాడకం
ఎయిర్ ప్యూరిఫైయర్ల వాడకం వల్ల లోపలి వాతావరణం కలుషితం కాకుండా ఉంటుంది. ఎయిర్ ప్యూరిఫైయర్ ఇంటి లోపల స్వచ్ఛమైన గాలిని వ్యాప్తి చేస్తుంది. కాబట్టి దీపావళి సమయంలో ఎయిర్ ప్యూరిఫైయర్ ఉపయోగించడం మంచిది.
దీపావళి తర్వాత
దీపావళి తర్వాత ఇంటిని శుభ్రం చేయడం చాలా ముఖ్యం. కిటికీ కర్టెన్లు, బెడ్ షీట్లు, కార్పెట్లు వంటి వాటిని ఉతకాలి. దుమ్ము, పొగతో అవి నిండి ఉంటాయి. దీనివల్ల అలర్జీలు వస్తాయి.
టాపిక్