తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Neck Cancer: మీరు ఉదయాన చేసే ఈ పొరపాటు మెడ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచేస్తుంది

Neck Cancer: మీరు ఉదయాన చేసే ఈ పొరపాటు మెడ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచేస్తుంది

Haritha Chappa HT Telugu

04 October 2024, 8:30 IST

google News
    • Neck Cancer: తల, మెడ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలో ఒక అధ్యయనం తేల్చింది. ప్రతిరోజూ బ్రష్ చేయడంతో పాటు చిగుళ్ళను శుభ్రం చేసుకోవడం వంటివి చేసుకోవాలి. లేకుంటే క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది.
తల, మెడా క్యాన్సర్ కారకాలు ఏమిటి?
తల, మెడా క్యాన్సర్ కారకాలు ఏమిటి? (Pixabay)

తల, మెడా క్యాన్సర్ కారకాలు ఏమిటి?

Neck Cancer: ఉదయం పూట మీరు చేసే చిన్న పొరపాటు భవిష్యత్తులో మిమ్మల్ని తల లేదా మెడ క్యాన్సర్ బారిన పడే ప్రమాదాన్ని పెంచుతుంది. మీరు ఎవరూ ఊహించని పరిణామమిది. కొత్తగా చేసిన అధ్యయనంలో తల, మెడ క్యాన్సర్ సమస్యలు పెరగడానికి నోటి అనారోగ్యం కూడా ఒకటని తేలింది. మీ దంతాలను, చిగుళ్ళను పరిశుభ్రంగా ఉంచుకోకపోతే ఈ రెండు క్యాన్సర్ల వారిన పడే అవకాశం పెరుగుతుంది. అమెరికన్ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.

అమెరికన్ శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం నోరు పరిశుభ్రంగా ఉండకపోతే మధుమేహం, అధిక రక్తపోటు వంటివి వచ్చే ప్రమాదం పెరుగుతుందని, అలాగే తల, మెడ క్యాన్సర్ ప్రమాదం కూడా పెరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ దంతాల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

అధ్యయనం ఏం చెప్పింది

నోటిలోని కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. వాటిని ప్రతిరోజు బ్రష్ చేయడం ద్వారా తొలగించుకోవాలి. లేకుంటే ఆ బ్యాక్టీరియాకు క్యాన్సర్‌తో అవినాభావ సంబంధం ఉన్నట్టు ఈ అధ్యయనం చెప్పింది. నోటిలో ఉండే వందల రకాల బ్యాక్టీరియాల్లో డజనుకు పైగా బ్యాక్టీరియాలు తలా, మెడ క్యాన్సర్ రావడానికి దోహదం చేస్తాయని అధ్యయనం చెబుతోంది. ఈ బ్యాక్టీరియాలో తల, మెడ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని 50 శాతం పెంచే అవకాశం ఉన్నట్టు కూడా అధ్యయనం చెబుతోంది.

ఒక ఆంకాలజీ మ్యాగజైన్లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం ఆరోగ్యకరమైన పురుషులు, మహిళల నుంచి నోటిలోని బ్యాక్టీరియాలను సేకరించారు. వాటి జన్యు నిర్మాణాన్ని పరిశోధకులు పరిశీలించారు. నోటిలో ఉండే ఈ వందలాది బ్యాక్టీరియాలలో 13 జాతులు మెడ, తల క్యాన్సర్ తో సంబంధాన్ని కలిగి ఉన్నాయని చెప్పారు. ఈ బ్యాక్టీరియాలలో క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే బ్యాక్టీరియాలు 30 శాతం అధికంగా ఉన్నట్టు కూడా వివరిస్తున్నారు. అలాగే చిగుళ్ల వ్యాధికి కారణం అయ్యే బ్యాక్టీరియాలలో 50 శాతం క్యాన్సర్ కు కారణం అవుతాయని వివరిస్తున్నారు. కాబట్టి చిగుళ్ళను, నోటిని, దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.

గతంలో చేసిన అధ్యయనాల్లో క్యాన్సర్ తో బాధపడుతున్న వ్యక్తుల కణితుల్లో ఉండే బ్యాక్టీరియాలను ఇప్పటికే సేకరించారు. తాజాగా జరిగిన అధ్యయనంలో పరిశోధకులు నోటిలో ఉండే బ్యాక్టీరియాలతో... క్యాన్సర్ కారకాలైన బ్యాక్టీరియాలకు అనుబంధం ఉందో లేదో పరీక్షించారు. ఆ పరీక్షల్లో క్యాన్సర్ కారకాలుగా ఈ బ్యాక్టీరియాలు మారతాయని తేలింది. దీన్నిబట్టి ప్రతి ఒక్కరూ నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఈ కొత్త అధ్యయనం చెబుతోంది.

ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం లేచాక కచ్చితంగా దంతాలను తోముకోవాలి. అలాగే దంతాల మధ్యనున్న ఆహార పదార్థాలను కూడా క్లీన్ చేసుకోవాలి. చిగుళ్ళను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడప్పుడు వేడి నీటిలో ఉప్పును వేసి పుక్కిలించి ఉమ్ముతూ ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నోటిలోని బ్యాక్టీరియా క్యాన్సర్ కు కారకంగా మారకుండా అడ్డుకోవచ్చు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

తదుపరి వ్యాసం