Radhika Merchant: మెడలో నల్లపూసలతోనే రాధికా మర్చంట్, నిజమైన భారతీయ స్త్రీకి ఆమె నిదర్శనం-radhika merchant with black beads is the epitome of a true indian woman ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Radhika Merchant: మెడలో నల్లపూసలతోనే రాధికా మర్చంట్, నిజమైన భారతీయ స్త్రీకి ఆమె నిదర్శనం

Radhika Merchant: మెడలో నల్లపూసలతోనే రాధికా మర్చంట్, నిజమైన భారతీయ స్త్రీకి ఆమె నిదర్శనం

Haritha Chappa HT Telugu
Oct 01, 2024 02:00 PM IST

Radhika Merchant: అంబానీ చిన్నకోడలు రాధికా మర్చెంట్ ఎక్కడ కనిపించినా చాలా సింపుల్ గా అందంగా ఉంటుంది. పెళ్లయ్యాక ఆమె తన మెడలో నల్లపూసలను తీసేందుకు ఇష్టపడడం లేదు. నిజమైన భారతీయ స్త్రీలా ఆమె నల్లపూసలను నిత్యం మెడలోనే ఉంచుకుంటోంది.

నల్ల పూసలతో రాధికా మర్చంట్
నల్ల పూసలతో రాధికా మర్చంట్

రాధికా మర్చంట్, ఇషా అంబానీ, అంబానీ కుటుంబంతో కలిసి గత వారం భారత ఒలింపిక్, పారాలింపిక్ అథ్లెట్ల కార్యక్రమానికి హాజరయ్యారు. రిలయన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్, ఐఓసీ సభ్యురాలు నీతా అంబానీ ముంబైలోని తన నివాసం అంటిలియాలో ఈ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా రాధిక, ఇషా చాలా అందంగా తయారయ్యారు. ఆమె ఇప్పటికీ తన మెడలో నల్లపూసలను ధరించడం కనిపించింది. ఎంతో మంది సెలెబ్రిటీలు పెళ్లయిన కొత్తలో మాత్రమే నల్లపూసలను ధరించి తరువాత ఫ్యాషన్ చైన్‌లు వేసుకుంటారు. కానీ రాధికా మాత్రం తన మెడలో కచ్చితంగా నల్లపూసలు వేసుకునేందుకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. ఆమె భారతీయ సంప్రదాయాలకు ఎంత విలువ ఇస్తుందో దీన్ని బట్టి అర్థమవుతుంది. 

ఆంటిలియాలో జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన గాలా చిత్రాలు,  వీడియోలు యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్‌లలో సందడి చేస్తున్నాయి. ఇషా అంబానీ, రాధికా మర్చంట్ ఒలింపిక్స్ ఆటగాళ్లు, పారాలింపిక్ అథ్లెట్లను పిలిచి సత్కరించారు. ఆ క్రీడా ప్రముఖులతో ఫొటోలు దిగి వారిని ఉత్సాహపరిచారు. ఈ ఈవెంట్లో 140 మంది ఒలింపియన్లు, పారాలింపియన్లు పాల్గొన్నారు. 

ఇషా, రాధికా మర్చెంట్ ఫోటోలు
ఇషా, రాధికా మర్చెంట్ ఫోటోలు

ఈ కార్యక్రమంలో ఇషా సొగసైన, గులాబీ రంగు దుస్తుల్లో మెరిసింది. ఈ దుస్తుల్లో మిడి లెంగ్త్ స్కర్ట్ తో స్టైలిష్ బ్లౌజ్ వేసుకుంది. పై భాగంలో మాండరిన్ కాలర్, ఫ్రంట్ బటన్ క్లోజర్స్, బటన్డ్ కఫ్స్ తో ఫుల్ లెంగ్త్ స్లీవ్స్, రిలాక్స్డ్ ఫిట్టింగ్ ఉండగా, స్కర్ట్ నడుముపై నాట్ డిజైన్, ఫిగర్ స్కిమ్మింగ్ సిల్హౌట్ ను కలిగి ఉంది.

గుండె ఆకారంలో ఉండే వజ్రాలు, స్ఫటికాలతో అలంకరించిన స్టేట్మెంట్ చెవిపోగులు వంటి సింపుల్ ఆభరణాలతో ఇషా అందంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే గ్లామర్ కోసం ఆమె నల్లటి కనుబొమ్మలు, మస్కారాతో అలంకరించిన కనురెప్పలు, నల్లటి ఐలైనర్, పింక్ లిప్ గ్లాస్, రోజ్ రంగు బుగ్గలు ఇస్తా చక్కగా కనిపిస్తోంది.

అంబానీ కుటుంబానికి చెందిన 'చోటీ బాహు' రాధికా మర్చంట్ ఈ కార్యక్రమానికి ప్రింటెడ్ మిడి డ్రెస్ ధరించింది. రాధికా వస్త్రధారణ సింపుల్ గా ఉంది. నలుపు రంగు డ్రెస్సులోతెలుపు పూల ప్రింట్ తో చక్కటి డ్రెస్ ఆమె ఎంపిక చేసుకుంది. స్లీవ్ లెస్ డ్రెస్ లో చతురస్రాకార నెక్ లైన్, బాడీ ఫిట్టింగ్ తో ఈ గౌను చక్కగా ఉంది.

రాధిక ఇతర వజ్రభరణాలు వేసుకోవడానికి బదులు ఆమె సింపుల్ మంగళసూత్రాన్ని ధరించింది. సింపుల్ చెవిపోగులు, చంకీ బ్రాస్ లెట్ లతో రాధికా మెరిసిపోతోంది. గ్లామర్ కోసం ఆమె సైడ్-పార్ట్డ్ లూజ్ లాక్స్, మస్కారా అలంకరించిన కనురెప్పలు, న్యూడ్ పింక్ లిప్ షేడ్, నలుపు ఐలైనర్ ను అలంకరించుకుంది.

టాపిక్