Liver Health : ఈ ఆహారాలు తింటే కాలేయానికి సమస్యలు.. ఈరోజే ఆపేయండి
18 January 2024, 9:30 IST
- Liver Unhealthy Foods : కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. లేదంటే చాలా సమస్యలు వస్తాయి. మనం తీసుకునే ఆహారమే లివర్ ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది.
కాలేయ ఆరోగ్యం
కాలేయం మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. శరీరం మొత్తం ఆరోగ్యానికి ఇది చాలా ముఖ్యం. కాలేయం జీవక్రియను నియంత్రిస్తుంది. టాక్సిన్ ఫిల్టర్ చేసేందుకు పనిచేస్తుంది. మన జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడంలో దీని పాత్ర కీలకం. అందువల్ల కాలేయం ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం.
అయితే మనం సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా సులభంగా దెబ్బతినే అవయవం కూడా ఇది. శరీరం నుండి హానికరమైన రసాయనాలను తొలగించడం దీని పని. మనం ఏది తిన్నా, తాగినా, అది ఔషధం లేదా ఆహారం కావచ్చు, ప్రతిదీ కాలేయం గుండా వెళుతుంది. తినేటప్పుడు, తాగేటప్పుడు కొన్ని విషయాలపై శ్రద్ధ పెడితే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.
ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వల్ల కాలేయం ఆరోగ్యాన్ని విషంలా ప్రభావితం చేస్తుంది. అంతేకాదు కొన్ని ఆహార పదార్థాలు కూడా కాలేయాన్ని అనారోగ్యంగా చేస్తాయి. మనకు తెలియకుండా ప్రతీరోజూ తింటాం. కాలేయంలో చిన్నపాటి సమస్య వచ్చినా శరీరం బలహీనపడి ఆకలి లేకపోవడం, వాంతులు, నిద్రలేమి, నీరసం, అలసట, బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాలేయ వ్యాధులు రాకుండా ఉండేందుకు ఎలాంటి ఆహారపదార్థాలను నివారించాలో తెలుసుకోండి.
వెన్న ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయ సమస్యలు పెరుగుతాయి. వెన్నలో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉంటుంది. కాలేయం ఫిల్టర్ చేయడానికి చాలా కష్టపడాలి. వెన్నకు బదులుగా నెయ్యి లేదా ఆలివ్ నూనెను ఉపయోగించడం మంచిది. కాలేయం పని కొవ్వును విచ్ఛిన్నం చేయడం, శక్తిని సృష్టించడం. మీరు చాలా కొవ్వు తింటే కాలేయం చాలా కష్టపడాలి. దీని వల్ల ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చే అవకాశాలు పెరిగి కాలేయ కణాలలో కొవ్వు పేరుకుపోతుంది.
మీరు చాలా స్వీట్లు తింటే అది మీ కాలేయానికి హాని కలిగిస్తుంది. తీపి పదార్థాలను విచ్ఛిన్నం చేయడానికి కాలేయం చాలా కష్టపడాలి. దానిని ఎక్కువగా తీసుకోవడం వల్ల భవిష్యత్తులో కొవ్వు కాలేయ వ్యాధికి దారి తీస్తుంది.
ఫ్రెంచ్ ఫ్రైస్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోయి మంట వస్తుంది. దీర్ఘకాలిక నిర్లక్ష్యం వల్ల అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఫ్రెంచ్ ఫ్రైస్ లేదా ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల త్వరగా ఈ సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయి.
ప్రాసెస్ చేసిన మాంసాలలో సంతృప్త కొవ్వు అధికంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ప్రతిరోజూ తినడం మానుకోవాలి. ఇది కాలేయానికి ఎక్కువ హానికరం.
చీజ్‌బర్గర్‌లలో సంతృప్త కొవ్వు ఉంటుంది. ఇది ఎక్కువగా జంతు ఉత్పత్తులు, నూనెలలో కనిపిస్తుంది. ఇది మీ గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. కూరగాయలు, పండ్లు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం మేలు.